నిత్యదరిద్రకారణాలు_ఇవే...
కొంతమందికి ఉన్నా కొన్ని అలవాట్లు వలన ఎంత కష్టపడినా కూడా సక్సెస్ కాలేరు. ఏదో ఒక సమస్యలతో సతమతమవుతుంటారు. ఆ అలవాట్లను మానుకోకపోతే ఎప్పుడూ కష్టాలు దారిద్య్రంలో కొట్టు మిట్లాడుతూ చివరకు రోడ్డున పడే ప్రమాదం కూడా లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఆ అలవాట్లు ఏమిటి? వాటి వలన ఎలాంటి నష్టం వస్తుందో తెలుసుకుందాం.
Also Read : చేతిలోని డబ్బు నిలవాలంటే...ఏమి చేయాలి?
1.కొందరు ఇంట్లో బాత్రూమ్ లు శుభ్రంగా ఉంచుకోరు. అలా బాత్రూం శుభ్రంగా లేకపోవడం వలన దరిద్రం పట్టుకోవడమే కాకుండా, అనారోగ్యపాలు కూడా అవుతారు.
2.రోజూవాడే మంచం, పక్కబట్టలు శుభ్రంగా ఉంచుకోవాలట. మంచాన్ని ఉదయం మాత్రమే శుభ్రపరచాలట. రాత్రిపూట శుభ్రపరుస్తే నెగెటివ్ ఎనర్జీ వస్తుందని పండితుల ఉవాచ.
3.కొందరు తాము తినగలిగిన దానికంటే ఎక్కువగా పెట్టుకొని వదిలేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఎప్పుడూ పేదవారిలాగానే ఉంటారట.
4.తిన్న తరువాత ప్లేట్ అలానే ఉంచకూడదు వెంటనే కడగకపోతే అస్సలు మంచిది కాదంట.
5.ఉమ్మును ఎక్కడపడితే అక్కడ ఊయడం వలన లక్ష్మీ దేవి ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోతుందట. దీని వలన దరిద్రం తాండవిస్తుంది.
6.ఇంటికి ఉత్తరంలో నల్లటి వస్తువులు ఉంటే అవి నెగెటివ్ ఎనర్జీ నీ తెస్తాయట.
7. ఉత్తర మూలల్లో బరువైన వస్తువులు పెట్టకూడదట. ఇలా చేస్తే ఇంట్లో వారి మధ్యన గొడవలు తలెత్తే ప్రమాదం ఉందట.
8.శాస్త్రం ప్రకారం సంధ్యా వేళలో ఊడ్చకూడడు. ఇలా చేయడం కూడా పరమ దరిద్రమేనట.
9.మద్యపానీయాలు ఇంట్లో పెట్టుకోకూడదట. ఇలా చేయడం వల్ల లక్ష్మిదేవి ఇంట్లోలో నుంచి వెళ్ళిపోతుందట.
10.సుమంగళి స్త్రీలు ఖచ్చితంగా పాపిట బొట్టు ధరించండి.పురుషులు ఉదయం లేవగానే దాన్ని దర్శించండి.
11.భయటనుండి ఏ విధంగానైనా డబ్బులు వస్తే మీ భార్యచేతికిచ్చి అవసరాన్ని బట్టి మళ్ళీ తీసుకోండి,(ఈ విషయంలో ఎందుకు, ఏమిటి?ఏక్కడివి అని భార్యలు అడగకండి)
12.భర్త భయటకు వెళ్ళేముందు పోరపాటునకూడా ఎక్కడికి?ఎందుకు? ఎప్పుడొస్తారు.అని అడగకండి. వెళ్ళేపనిలో ఆటంకమేర్పడుతుంది.
13.ఏదైనా వ్యాపారము లేదా పెట్టుబడి విషయంలో మీ భార్య సలహా కూడా తీసుకోండి.
14.వయసులో ఉన్న ఆడపిల్లలు ఖచ్చితంగా బొట్టు గాజులు ధరించండి, దీనివల్ల పెళ్ళితరువాత మంచి గౌరవప్రదమైన కుటుంబం లభిస్తుంది.
Also Read : అమ్మాయి పుష్పావతి అయిన సమయములో చేయవలసినవి
మనకు నష్టాన్ని కలిగించే అలవాట్లు మానుకుని, మంచి చేసే అలవాట్లను అలవరుచుకుంటే జీవితం ఎంతో హాయిగా సుఖసంతోషాలతో సాగుతుంది.
(ఇవి పెద్దలు శాస్త్రరీత్యా మరియు వారియెక్క అనుభవ రీత్యా తెలుసుకున్న విషయాలు. నమ్మి ఆచరించన మంచి ఫలితం పొందవచ్చును)
Famous Posts:
> ఇది వినాలంటే ఎన్నో కోట్ల జన్మల పుణ్యం ఉండాలి..
> కాలుకి నల్ల దారం కట్టుకోవడం వెనక రహస్యమేంటి?
> పూజలో కొబ్బరికాయ చెడిపోతే అపచారమా ?
> అమ్మాయి పుష్పావతి అయిన సమయములో చేయవలసినవి
> దిష్టి, దృష్టి - నివారణ మార్గాలు
> శివునికి ఏ అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితం దక్కుతుంది?
> అగ్నిసాక్షిగా వివాహం ఎందుకు చేస్తారు..?
> అన్నదానం చేసేటపుడు 100 లో 99 మంది చేసే అతి పెద్ద తప్పు
> గుడి దగ్గర్లో ఇల్లు ఉండకూదనడానికి ఖచ్చితమైన కారణాలు ఇవే
నిత్య దరిద్రలు, dharma sandehalu telugu lo, dharma sandehalu telugu book, dharma sandehalu 2020, dharma sandehalu about death, dharma sandehalu online, dharma sandehalu contact number, dharma sandehalu questions
Comments
Post a Comment