Drop Down Menus

పాపాలు చేసేవారికి గరుడ పురాణం ప్రకారం 30 రకాల శిక్షలు ఇవే | According to the Garuda Purana, there are 30 types of punishments for sinners

 

గరుడ పురాణం అనేది చాలా మందికి తెలుసు. అపరిచితుడు మూవీ చూసిన ప్రతి ఒక్కరికీ ఇది ఇప్పటికీ గుర్తు ఉండి ఉంటుంది. గరుడపురాణం మనకు చాలా విషయాలు తెలుపుతుంది.

దీన్ని వేదవ్యాసుడు రచించాడు. విష్ణుమూర్తి వాహనమైన గరుత్మంతుడు ఒకసారి విష్ణువును ఒక ప్రశ్న అడుగుతాడు.

Also Readమనిషిగా పుట్టాక చేయాల్సిన పనులు ఏంటి ? 

ఏ తప్పునకు ఎలాంటి శిక్ష

పూర్వఖండంలో బ్రహ్మాదుల ఆవిర్భావం, రాజుల కథలు, వ్యాకరణం, ఛందస్సు, యుగధర్మాలు, విష్ణువు దశావతారాలు వంటివి ఉన్నాయి. ఉత్తర ఖండంలోని ప్రథమాధ్యాయంలో ప్రేతకల్పం అనే భాగం ఉంది. అందులో మరణానంతరం జీవుడు ఏం చేస్తాడు... వంటి విషయాలుంటాయి. ఎవరైనా మరణించినప్పుడు ఈ అధ్యాయాన్నే పఠిస్తారు. ద్వితీయాధ్యాయాన్ని ఎవరైనా, ఎప్పుడైనా చదువుకోవచ్చు.గరుడపురాణంలో చెప్పినట్టు నరకంలో విధించే శిక్షలు ఏమిటి.. అవి ఎలా ఉంటాయి. ఏ తప్పునకు ఎలాంటి శిక్ష విధిస్తుందో తెలుసుకుందామా.

తమిశ్రం 

గరుడ పురాణం ప్రకారం తమిశ్రం అంటే ఇతరుల సొమ్మును, భార్యాపిల్లలను కాజేసిన వాళ్ళను శిక్షించడం. దీని ప్రకారం శిక్ష చాలా గోరంగా ఉంటుంది. యమదూతలు కాలపాశంతో కట్టేసే చిమ్మచీకటి నరక కూపాన్నే తమిశ్రం అంటారు.

మరణించిన తర్వాత.. 

మరణించిన తర్వాత మనిషి ఎక్కడికి వెళ్తాడు. మనిషి బతికి ఉన్నప్పుడు చేసిన పాపాలకు ఏయే శిక్షలు పడతాయని గరుత్మంతుడు విష్ణువును అడుగుతాడు. విష్ణుమూర్తి ఆ ప్రశ్నలకు సమాధానాలు చెబుతాడు. విష్ణువు గరుడుని కోసం చెప్పింది కాబట్టి దీనికి గరుడ పురాణం అని పేరొచ్చింది. ఇందులో ప్రధానంగా రెండు భాగాలున్నాయి. ఒకటి... పూర్వఖండం. రెండోది ఉత్తర ఖండం.

కుంభీపాకం 

కుంభీపాకం ప్రకారం వేట ఒక ఆట అనుకుని.. సాధు జంతువులను కిరాతకంగా హతమార్చి కడుపునింపుకునే వారిని శిక్షిస్తారు. అనవసరంగా ఇతరులను హింసించే చంపేవారిని కుంభీపాకం ద్వారా శిక్ష పొందుతారు. ఈ నరకం చాలా భయంకరంగా ఉంటుంది. కణకణలాడే రాగిపాత్రలాగా ఉంటుంది. పైనుంచి సూర్యుడు, కింద భగ్గున మండుతున్న మంటతో ఆ రాగి కొలిమి విపరీతంగా వేడెక్కి ఉంటుంది. అందులో పాపులను వేసి శిక్షిస్తారు.

రౌరవం 

రురు అంటే భయంకరమైన విషనాగు అని అర్థం. శరీరం శాశ్వతమని తనకోసం, తన వారి కోసం ఇతరుల ఆస్తిపాస్తులను లాక్కుని అక్రమంగా అనుభవించే వాళ్ళు రౌరవం అనే నరకానికి వస్తారు. వారికి శిక్ష కూడా చాలా కఠినంగా ఉంటుంది.

మహారౌరవం 

న్యాయమైన వారసత్వాన్ని కాదని ఆస్తిపాస్తులను అక్రమంగా లాక్కుని అనుభవించే వారిని, ఇతరుల భార్యను, ప్రేమికురాలిని అక్రమంగా లోబరచుకుని అనుభవించే వారు ఇక్కడకు వస్తారు. ఇక అంధతమిశ్రం ప్రకారం.. స్వార్థ చింతనతో ముక్కుమునగ తినే వారిని, అవసరాలు తీరే వరకు భార్యను వాడుకుని ఆ తరువాత వదిలిపారేసే వారిని శిక్షిస్తారు. భార్యా భర్తలను శిక్షించేందుకు యముడు ఈ నరకానికి పంపుతాడు.

అసితపత్రవనం

అసితపత్రవనం ప్రకారం విధ్యుక్త ధర్మాలను గాలికి వదిలేసి ఇతరుల పనులలో వేలుపెట్టి వాళ్ళనూ చెడగొట్టే వాళ్ళు ఇక్కడకు వస్తారు. సూకరముఖం ప్రకారం అధికార దుర్వినియోగానికి పాల్పడి, అక్రమాలు, అన్యాయాలలో దిగబడి విధినిర్వహణలో సక్రమంగా వ్యవహరించని పాలకులు, అధికారులు ఈ నరకానికి వస్తారు.

Also Readకాలుకి నల్ల దారం కట్టుకోవడం వెనక రహస్యమేంటి?

అంధకూపం

అంధకూపం ప్రకారం చిన్న చీమకు అపకారం తలపెట్టని వాళ్లని బాధించేవారు, అపకారికైనా ఉపకారం చేసే వాళ్ళను బుద్ధిపూర్వకంగా తొక్కిపట్టి బాధించే వాళ్ళు, కాపాడమని ప్రాథేయపడేవారిని అవకాశం ఉండి కూడా కాపా డని వాళ్ళు ఈ నరకానికి వస్తారు. 

తప్తమూర్తి ప్రకారం నరకం ఒక కొలిమిలా ఉంటుంది. ఇక్కడ పెను మంటలు నాల్కలు సాచి భగభగ మండుతుంటాయి. బంగారం, విలువైన రత్నాలు, రత్నాభరణాలు కాజేసిన వారిని ఇందులో పడేసి సజీవదహనం చేస్తారు.

క్రిమిభోజనం

క్రిమిభోజనం ప్రకారం క్రిమికీటకాలతో నరకం నిండి ఉంటుంది. ఇంటికి అతిథులుగా వచ్చిన వాళ్ళను ఆదరించకుండా, వాళ్ళకు మెతుకు విదిల్చకుండా మింగేవాళ్ళను, ఎదుటి వాళ్ళను సొంత పనులకు, స్వార్థ ప్రయోజనాలకు వాడుకుని అవసరం తీరాక విసిరిపారేసే వాళ్ళను ఇక్కడికి తీసుకువచ్చి క్రిమికీటకాలకు ఆహారంగా పడేస్తారు. 

శాల్మలి ప్రకారం వావీ వరస పట్టించుకోకుండా అక్రమ సంబంధాలకు ఎగబడే ఆడ, మగ వారు శిక్షించబడతారు.

వజ్రకంటకశాలి

జాతి రీతి లేకుండా జంతువులతోనూ శృంగారం నడిపే వారు వజ్రకంటకశాలి ప్రకారం శిక్ష విధిస్తారు. 

వైతరణి ప్రకారం.. అధికారాన్ని సద్వినియోగం చేసి ప్రజలకు సేవ చేయాల్సిన వాళ్లు వాటిని పూర్తిగా దుర్వినియోగపరచి అక్రమాలకు, అనుచితాలకు పాల్పడితే శిక్షకు గురవుతారు.

పూయోదకం

వైతరిణిలో ఉండే కాలుష్య జలమే ఈ నరకంలో ఒక బావిలో ఉంటుంది. వివాహం చేసుకునే ఉద్దేశం లేకపోయినా మాయమాటలు చెప్పి ఆడపిల్లను ముగ్గులోకి దింపి అనుభవించే పురుషపశువులకు ఈ నరకంలో శిక్ష పడుతుంది. 

ప్రాణరోధం ప్రకారం.. కుక్కలు వగైరా జంతువులను వేటకు ఉసిగొల్పి సాధు జంతువుల ప్రాణాలు హరించే వారికి శిక్ష ఉంటుంది.

వైశాసనం

పేదలు ఆకలి దప్పులతో బాధపడుతుంటే తమ దర్పాన్ని ప్రదర్శించుకోడానికి విందులు వినోదాలు చేసుకుంటూ అవతలి బాధపడుతుంటే చూసి ఆనందించే దుర్మార్గపు మనసున్న వాళ్ళంతా ఈ నరకానికి వచ్చి పడతారు. 

లాలభక్షణం ప్రకారం... అతి కాముకులు, భార్యను కట్టుబానిసంగా కన్నా నీఛంగా చూసే వాళ్ళు తమ ఆధిక్యతను చాటుకోడానికి వీర్యం తాగించేవాళ్లకు శిక్ష విధిస్తారు.

Also Readవాటి సైజును బట్టి ఆడవాళ్లు ఎలాంటి వాళ్లో ఇట్టే చెప్పేస్తారు.. 

సారమేయాదానం

ఆహారంలో విషం కలిపే వాడు, ఊచకోతకు దిగేవాడు, దేశాన్ని సర్వనాశనం చేసే వాడు ఈ నరకానికి వస్తాడు. 

ఇక అవీచి ప్రకారం.. శిక్ష చాలా కఠినంగా ఉంటుంది. నీటిబొట్టులేని నరకం ఇది. అక్కడ రాతిపలకలు పరుచుకున్న తీరు చూస్తే అక్కడ సముద్రమేదో ఉందేవెూ అనిపిస్తుంది. తప్పుడు సాక్ష్యం చెప్పేవాళ్ళను, తప్పుడు ప్రమాణాలు చేసే వాళ్ళను, వ్యాపార వ్యవహారాలలో అబద్ధాలు చెప్పి వెూసం అవీచి ప్రకారం శిక్షిస్తారు.

అయోపానం

ఈ నరకం తాగుబోతుల కోసమే ఉంది. ఆడా, మగ తాగుబోతులకు వేరువేరుగా శిక్షలుంటాయి. పాపులు బతికి ఉండగా ఎన్నిసార్లు మద్యం పుచ్చుకున్నారో లెక్కలు తీసి అన్నిసార్లు ఈ శిక్షలు విధిస్తారు. తాగుబోతు ఆడదైతే ఇనపద్రవాన్ని తాగాలి. అదే తాగుబోతు మగవాడైతే లావా తాగాలి. 

ఇక రక్షోభక్ష ప్రకారం.. జంతుబలిని, నరబలిని విచ్చలవిడిగా చేసి మాంసాన్ని ఇష్టానుసారంగా తినే వారికి శిక్ష విధిస్తారు.

శూలప్రోతం

ఎదుటి వాడు ఏ అపకారం చేయకపోయినా నిష్కారణంగా ప్రాణాలు తీసే వాళ్ళను, నమ్మకద్రోహం చేసే వాళ్ళను శూలప్రోతం లోకి పంపుతాడు యముడు. 

క్షరకర్దమం ప్రకారం.. మంచి వాళ్ళ పట్ల అవమానకరంగా వ్యవహరించి దబాయించి బతికేసే వాళ్ళను శిక్షిస్తారు.

దందశూకం

తనతోటి మానవులను జంతువుల్లా భావించి విచ్చలవిడిగా వేటాడడం, తక్కువ చూపు చూడడం, మానవహక్కులను హరించి వేయడంలాంటివి చేస్తాడో వాడు ఈ నరకానికి వస్తాడు. 

ఇక వాతరోదం ప్రకారం.. అడవులలో, చెట్లమీద, కొండకొమ్ములలో ఉంటూ ఎవ్వరి జోలికీ రాని జంతువులను పట్టి పల్లార్చే వారిని శిక్షిస్తారు.

Also Read మన జీవితం లో జరిగేవి - జరగనివి

పర్యావర్తనకం 

ఆకలితో అలమటించిపోయే వాడు ఒక్క ముద్ద అన్నం పెట్టమని అడిగితే పెట్టకపోగా నానా దుర్భాషలాడేవాడిని పర్యావర్తనకం ప్రకారం శిక్ష అనుభవిస్తారు. 

ఇక సూచీముఖం ప్రకారం.. గర్వం, పిసినారితనం ఉన్న వారిని, రోజు వారి ఖర్చులకు కూడా డబ్బు తీయకుండా దాచేసే పరమలోభులు శిక్ష అనుభవిస్తారు.

Famous Posts:

పూజ గది ఎలా ఉండాలి.. ఇంట్లో ఎక్కడ ఉండాలి తెలుసా ?


ఈ ఆరు దోషపు అలవాట్లను వదిలితేనే అభ్యున్నతి


కాశీలోని చాలా మంది కి తెలియని కొన్ని వింతలు.. 


ఆలయం గర్భగుడిలోకి ఎందుకు ప్రవేశించరాదు


ఈ ఆరు దోషపు అలవాట్లను వదిలితేనే అభ్యున్నతి


వత్తులు ప్రాముఖ్యత - దీపారాధన విధానం - దిక్కుల ఫలితములు 


ఇది మహా శివుడిని స్మరించే గొప్ప మంత్రం..


మహా మృత్యుంజయ మంత్రం మీ కోరికలను ఎలా నెరవేర్చగలదో తెలుసా?

గరుడ పురాణం, garuda purana punishments in telugu pdf free download, garuda puranam book in telugu, garuda puranam in telugu wikipedia, garuda puranam telugu lo, sampurna garuda puranam in telugu, garuda puranam story, garuda puranam in telugu images, kumbhipakam in telugu

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON