పూజా ప్రక్రియలో నిషిద్ధకర్మలు:- గృహంలో దేవతా విగ్రహాలు ఆరు ఇంచుల లోపే ఉండాలి.అంతకన్నాపెద్దగా ఉండరాదు. మంత్ర పుష్పం, సుప్రభాతం కుర్చుని చదవరాదు. ఈశ్వరుడుకి పవళింపు సేవ నిలబడి చేయరాదు. నుదుట బొట్టు, విభూతి లేదా కనీసం బొట్టు అయిన లేకుండా పూజ చేయకూడదు. ఈశ్వరుడికి, గురువుకి ఒక చేతితో నమస్కారం చేయరాదు అలా చేస్తే పై జన్మలో చేతులు లేకుండా జన్మించటం, చేతులు పోవటం కానీ జరుగుతాయి.
Also Read : హెయిర్ కట్ మంగళవారం ఎందుకు చేసుకోకూడదు..? ఏ ఏ రోజుల్లొ చేయించుకోవాలి ?
దేవునికి ( ఈశ్వరునికి ) వీపు చూపరాదు, ఈశ్వరుడి ఎదురుగా నిలబడి ఆత్మప్రదక్షిణ చేయరాదు. ఈశ్వరుడికి చేసే దీపారాధన పరదేవతతో సమానం. ఆ దీపారాధనతో పుల్లలు కానీ, సాంబ్రాణికడ్డికానీ, హారతి కర్పూరం కానీ మరి ఏదైనా కానీ వెలిగించకూడదు. పూజ సమయమున ఈశ్వరుడు మన కంటే ఎత్తులో వుండాలి, అలానే పూజా వస్తువులు కుడి వైపు నుంచి తీసుకోవాలి. ఎడమ చేయి పూజా విధులలో నిషేధం. ఆచమనం చేసేటప్పుడు శబ్దం రాకూడదు.
ఈశ్వర నిర్మాల్యం కాలితో తొక్కరాదు. అలాచేస్తే ఈ జన్మలో చేసుకున్న పుణ్యంతో పాటు పూర్వ జన్మలో చేసుకున్న పుణ్యం కూడా నశించును. రుద్రాక్షలు ధరించే వారు మద్యం, మాంసము, ఉల్లి, వెల్లుల్లి, మునగ, శ్లేషాత్మక పదార్ధాలు తినకూడదు.
స్త్రీలకి నిషిద్ధకర్మలు :- స్త్రీలు తులసీ దళాలు తుంచ రాదు. పురుషులు మాత్రమే తుంచ వలెను. పౌర్ణమి, అమావాస్య నాడు, రవి సంక్రమణ, తైలాభ్యంగనస్నానం చేసిననూ త్రి సంధ్యల కాలంలో, మైల రోజులలో, రాత్రి ధరించి ఉన్న దుస్తులతోను, స్నానం చేసి శుభ్రమైన వస్త్రం ధరించకుండా, తులసిని తుంచిననూ మహాపాపం.
స్త్రీలు జుట్టు విరబోసుకుని ఇంట్లో తిరగరాదు. ఇలా స్త్రీలు చేస్తే ఇంటికి, ఇంట్లో ఉన్నవారికి అశుభం. అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. స్త్రీలు జుట్టు విరబోసుకుని భర్తకి కనపడరాదు. అలా కనపడితే భర్తకి గండం. బయటకి వెళుతున్నపుడు స్త్రీ జుట్టు విరబోసుకుని కనపడితే వెనక్కి ఇంట్లోకి వచ్చి కాళ్ళు కడుక్కుని కొంచం సేపు కుర్చుని వెళ్ళాలి. స్త్రీలు చెవి దిద్దులు లేకుండా భర్తకి కనపడరాదు. అలాకనపడితే భర్తకి గండం, శ్రేయస్సు కాదు.
పురుషులకి నిషిద్ధకర్మలు :- పూర్తిగా శిరో ముండనం చేసుకోకూడదు కనీసం శిఖ ఉంచుకోవాలి. అలా చేసుకుంటే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. పూర్తిగా శిరో ముండనం చేసుకుంటే వైదిక క్రియలకి పనికిరాదు. ఏకాదశి, చతుర్దశి, అమావాస్య, పూర్ణిమా, సంక్రాంతి, వ్యతిపాతము, విష్టి, ఇత్యాదుల యందు, వ్రత దినముల యందు, శ్రాద్ధ దినముల యందు, మంగళ, శనివారముల యందు క్షురకర్మ పనికిరాదు.
Also Read : ఈ విషయాలు మీకు తెలుసా ?
పై తెలిపిన శాస్త్రీయ పద్ధతులు భక్తీ శ్రద్ధలతో ఆచరించిన వారికి శుభఫలితాలు ఉంటాయి. ఆరోగ్య సిరి సంపదలు కలుగుతాయి.ఆనాదిగా కాలంగా మన పూర్వీకుల నుండి వస్తున్న శాస్త్రీయ పద్ధతులు పెడచెవిన పెట్టె వారిని, ఆధునిక పోకడతో పోయేవారికి వారి విజ్ఞతకే వదిలి వేయాలి. నమ్మిన వారికి నారాయణుడు ఉన్నాడు , నమ్మని ఆచరించని వారికి నారాయణుడే ఉన్నాడు జై శ్రీమన్నారాయణ.
Famous Posts:
> జాతక పరంగా దంపతులకు సంతానం కలగక పోవటానికి కారణాలు ఇవే
> పెళ్ళికాని మగవారికి అద్భుతమైన పరిష్కారం
> గర్భవతులు విన్నా, చదివినా కీర్తి ప్రతిష్ఠలు కలిగిన పుత్రులు కలుగుతారు
> ఇక్కడ వినాయకుడి చెవిలో కోరిక చెబితే తీరుతాయి..
> వాటి సైజును బట్టి ఆడవాళ్లు ఎలాంటి వాళ్లో ఇట్టే చెప్పేస్తారు..
> మొక్కు తీర్చడం అంటే ఏమిటి ? దేవుడి మొక్కు ఎలా తీర్చుకోవాలి ?
> వాస్తురిత్య మనీ ప్లాంట్‌ను ఏ దిశలో పెంచాలి ?
> బంగారు ఉసిరి కాయలు కురిసింది ఇక్కడే ఆ ఇల్లు...
> తలనీలాలు పుట్టు వెంట్రుకలు ఎందుకివ్వాలి - ఫలితం ఏంటీ ?
> జ్యోతిషశాస్త్రం ప్రకారం జాతకం ఎప్పుడు రాయించుకోవాలి?
5 step puja, daily pooja mantras, pooja for beginners, best time to do pooja at home, puja ritual steps, daily pooja procedure at home, how is puja performed, types of puja, women, men, స్త్రీ, పురుష, నిషిద్ధకర్మలు
Comments
Post a Comment