Drop Down Menus

భార్య భర్తలు ఎప్పటికి విడిపోకుండా ఉండాలంటే ఇవి పాటిస్తే చాలు ...| How should a husband and wife maintain a relationship?

భార్య భర్తలు ఇలా ఉండాలి!
వేదమంత్రోచ్ఛారణల మధ్య, అగ్నిసాక్షిగా మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యే భార్యాభర్తలిద్దరూ ఎలా ఉండాలన్నదానిపై వేదాల్లో ఒకటైన అధర్వణ వేదంలో ఇలా చెప్పడం జరిగింది.
"జీవితంలో భార్యాభర్తలు ఇద్దరూ ప్రసన్నచిత్తులై ఉండాలి. భార్య సౌకర్యాలను భర్త విధిగా చూడాలి. ఆమె జాతి ప్రగతికి అతను తప్పనిసరిగా పాటు పడాలి. ఇరువురూ కలిసి మెలసి ధర్మమార్గంలోనే సిరి సంపదలను పొందాలి. భార్యాభర్తలు ఇరువురూ తనువులు వేరైనా మనసులు ఒకటిగా మెదలాలి. ఇద్దరి మేధస్సూ ఒక్కటే అని పరస్పరం గుర్తించాలి".
ఇరువురూ పూజలు, వ్రతాలతో పరమ "భక్తి"తో ఎప్పుడూ నడుచుకోవాలి. మంచివి, వైదికమైనవి, మంచి జీవనం గురించి మాట్లాడుకోవాలి. అటువంటి స్థితిలో మంచి గురువు లేదా పురోహితుని దగ్గర సమయం చూసుకుంటూ జ్ఞానమును పొందుతూ వేదమును ప్రమాణముగా చేసుకుని, వేదము చెప్పినట్లుగా జీవనం సాగిస్తూ, శాస్త్ర ప్రకారం కర్మలను ఆచరిస్తూ ఉండటంలో ఉండే జీవనం వలన "ఆమె లక్షీ దేవీ అని, ఈయన నారాయణుడని" తెలుసుకోవడం వలన ఒక అరుదైన "దాంపత్య" బంధం ఏర్పడుతుంది, ప్రతీరోజూ ఇళ్ళల్లో ఎప్పుడూ ఒక పండుగ వాతావరణం ఉంటూనే ఉంటుంది!
బయటకి శరీరాలు విడివిడిగా ఉన్నా సరే లోన అర్ధనాదీశ్వరునిలా ఉన్నవారే "భార్యాభర్తలు"! ఆమె ఈయనతో, ఈయన ఆమెతో.. పరస్పరం ఎప్పుడూ కలిసి ఉండాలనే కోరుకోవాలి. ఒక్కోసారి చిన్నపిల్లల్లా ఇరువురూ పడుకునే ముందు మంచి కథలు చెప్పుకుంటూ౦టే ఉంటే ప్రతీరోజూ ఒక కొత్త అనుభవమే! అంతే తప్పా అనవసరపు విషయాలను ఇరువురి మధ్యలోకి తీసుకుని రాకూడదు. అవి దూరాన్ని పెంచుతాయి. లేని సమస్యలను తీసుకొస్తాయి..
స్వతంత్రంగా ఉండాలి:
ఎటువంటి పరిస్థితి ఎదురైనా సరే ఒకరికొకరు తమ ఆలోచనలు, నిర్ణయాలు స్వతంత్రంగా తీసుకుని చెప్పుకోవాలి. ఒకవేళ నేను చేసే పనికి ఎవరైనా ఏమనుకుంటారో అని సిగ్గుపడకుండా తమకు ఎలా అనిపిస్తే ఆ విధంగా చేయాలి. భార్య‌కు అనారోగ్యంగా ఉంటే భ‌ర్త‌, భ‌ర్త‌కు అనారోగ్యంగా ఉంటే భార్య తోడుగా ఉండాలి. వ‌దిలిపెట్టి వెళ్లే మ‌న‌స్త‌త్వం క‌లిగి ఉండ‌రాదు.
భార్యే వంటింటికి పరిమితం అవ్వాల్సిన అవసరం లేదు:
నా భార్య ఎప్పుడు నా కోసం వంటగదిలో కమ్మనైన భోజనాన్ని వండిపెట్టే ఒక యంత్రంగాగా పనిచేయడం నాకు ఇష్టం లేదు. నేను కూడా ఈ పని చేయగలను, నేను మన కోసం, మన కుటుంబం కోసం ఏమైనా చేయాలనుకుంటున్నాను అని ఆలోచించి భార్యకు సహాయం చేస్తే భంధం మరింత గట్టిపడుతుంది.
ఆకలితో ఉన్నా ప్రేమగా ఉండకూడదు:
భర్త ఆఫీస్ నుండి రావడం ఆలస్యం అవుతుందని తెలిసినా తను ఆకలితో ఉండి భర్త కోసం ఎదురుచూడటం ప్రేమ అనిపించుకోదు. నా కోసం నా భార్య ఎదురుచూడటమే ప్రేమ కాదు. ఒక్కోసారి నేను ఆలస్యం అయినా సరే తను సమయానికి తిని పడుకోవాలి అని అనుకోవాలి.
నవ్వుతూ నవ్వించాలి:
భర్త ఏదైనా హాస్యం చేసినప్పుడు ఒకవేళ భార్యకు అర్ధం కాకపోయినా సరే కానీ కొంచెమైనా సెన్సాఫ్ హ్యూమర్ ఉంటే తమ జీవితం మరింత సంతోషకరంగా ఆనందంగా ఉంటుంది.
నాతో సమానమే:
భార్యాభర్తలు ఇద్దరూ చేరుసగం అనే విషయాన్ని పూర్తిగా నమ్మాలి. భర్తగా నాకు ఎంత హక్కు ఉందో, భార్యగా తనకు అంతే హక్కు, బాధ్యత ఉంది అనుకోవాలి. తమ దృష్టిలో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు. మేమిద్దరం సమానమే అనిపించినప్పుడే ప్రతి దాంపత్య జీవితం బాగుంటుంది.
నమ్మకం, క్షమాపణ:
భర్త జీవితంలోకి వచ్చిన అమ్మాయిని భార్యగా స్వీకరించినప్పుడు నిజాయితీ, నమ్మకం, ప్రేమ, లైంగికంగా కలిసిపోవడం, తప్పు చేసినప్పుడు క్షమాపణ కోరడంలో తప్పేమీ లేదు. అప్పుడే ఇద్దరి మధ్య బంధం మరింత గట్టిగా ఉంటుంది. ఒకరికొకరు తప్పు చేసుకోము, ఎలాంటి పరిస్థితిలోనైనా సరే ఇద్దరం నిజాయితీగా ఉంటాము అనే ఒక్క మాటపై ఇకా ఇద్దరి జీవితాలకు తిరుగు లేదు.
మౌనంగా ఉండకూడదు:
భర్త ఏదైనా మాట్లాడుతున్నప్పుడు భార్య కూడా ఏదైనా సలహా ఇవ్వడం లేదా, మంచేదో చెడేదో చెప్పడం చేయాలి గానీ నేనేం చేసినా, ఏది చెప్పినా మీరే కరెక్ట్ అని మౌనంగా ఉండటం మంచిది కాదు. తన మౌనమే భర్త తప్పులకు కారణమవుతుంది. పిల్ల‌ల‌కు సంబంధించిన ప్ర‌తి విష‌యంలోనూ భార్యాభ‌ర్త ఇద్ద‌రి ప్ర‌మేయం ఉండాలి.
ఇష్టాలను పంచుకోవాలి:
ఒకరి మనసులో మాటలను చెప్పకుండా తెలుసుకోవడం కొంతమందికే సాధ్యం కాబట్టి, వారికి ఏమి ఇష్టమో అది చేయాలనుకున్నప్పుడు ప్రతీ భార్య తన భర్తతో పంచుకోవాలి. వారి ఇష్టాలను చెబితేనే ఏ భర్తకైనా తెలుస్తుంది. భార్య ఇష్టాలను భర్త ఎప్పటికీ కాదనలేడు.
ప్రోత్సహించాలి:
భర్త చేస్తున్న పని చిన్నదా పెద్దదా అని ఆలోచించకుండా భర్త వేసే ప్రతి అడుగులో నేను మీకు తోడుగా ఉన్నానంటూ ప్రోత్సహించాలి. భార్య ఇచ్చే ఈ ప్రోత్సాహమే భర్త మరిన్ని విజయాలకు దారి తీస్తుంది. భార్య ఇచ్చే ప్రోత్సాహం మరెవరూ ఇవ్వలేరు. అప్పుడ‌ప్పుడు కుటుంబసమేతంగా అంతా క‌లిసి యాత్రలకు వెళ్లాలి. విహార యాత్ర‌ల్లో పొందే అనుభవాలు, ఆనందం పొందితే కుటుంబ సంబంధాలు మెరుగవుతాయి.
మంచి స్నేహితుల్లా ఉండాలి:
నా భార్య ఇలానే ఉండాలి, నా భార్త ఇలానే ఉండాలి అని ఈ విధంగా ఉండకూడదు. జీవితంలో పాటించాల్సిన నియమాలు పాటిస్తే చాలు. ఒక మంచి స్నేహితుల్లా ఇరువురు అర్థం చేసుకుని తమ ప్రతి విషయాన్ని పంచుకుంటే ఇరువురు ఎటువంటి సమస్యలలో అయినా, కష్టాలలో అయినా రానించగలరు. దంప‌తుల‌న్నాక అప్పుడ‌ప్పుడు ప‌లు విష‌యాల్లో ఇద్ద‌రికీ ఏకాభిప్రాయం రాక‌పోవ‌చ్చు. అంత‌మాత్రాన గొడ‌వ ప‌డ‌కూడ‌దు. ఒకరి అభిప్రాయాన్ని మ‌రొక‌రు గౌర‌వించాలి.
దయ, సహాయ గుణం ఉండాలి:
ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడే మనిషిలోని మంచి గుణం, దయ బయటకు వస్తుంటాయి. తమ జీవితం ఎప్పుడు స్వార్థంతో నిండి ఉండకూడదు. తమ కుటుంబ స్వార్థమే కాకుండా సమాజం గురించి కూడా ఆలోచించాలి. దీనికోసం కుటుంబాన్ని పక్కనపెట్టాల్సిన అవసరం లేదు, అందులో ఒక భాగంగానే చూసుకోవాలి.
మంచి అలవాట్లు కలిగి ఉండాలి:
మంచి అలవాట్లు, జీవన విధానం కలిగి ఉండాలి. ఒకవేళ ఇద్దరిలో ఎవరో ఒకరు అలా లేకపోయినా సరే చూసి నేర్చుకోవాలి. మంచి జీవన విధానమే మంచి ఆరోగ్యానికి దారితీస్తుంది. మంచి ఆరోగ్యమే దాంపత్య జీవితాన్ని బాగుచేస్తుంది. మంచి దాంపత్య జీవితమే ఆరోగ్యమయిన సంతానాన్ని కలుగజేస్తుంది.

Tags: భార్య భర్తలు, husband wife,  relationship, marriage, wife and husband relationship telugu, wife and husband relationship secrets, husband wife physical relationship, husband wife relationship rules
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.