Tirumala Darshan Information:

Tirumala News ***  ఓం నమో వేంకటేశాయ *** నవంబర్ నెలకు సంబంధించిన రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టిక్కెట్ల‌ ఆన్‌లైన్ కోటాను సెప్టెంబరు 21న ఉదయం 9 గంటలకు టీటీడీ వెబ్‌సైట్‌లో విడుదల చేయ‌నుంది.***నవంబర్ నెలలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవతో సహా ఆర్జిత సేవా టిక్కెట్లు సెప్టెంబరు 21 మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. ***నవంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్లు సెప్టెంబర్ 21 నుండి అందుబాటులో ఉంటాయి.***అక్టోబర్ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్‌లు సెప్టెంబర్ 22న ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయబడతాయి.***అక్టోబ‌రు 25న సూర్యగ్రహణం, న‌వంబరు 8న చంద్ర‌గ్ర‌హ‌ణం- ఆయా రోజుల్లో 12 గంట‌ల పాటు శ్రీ‌వారి ఆల‌య త‌లుపులు మూత –అన్ని ర‌కాల ద‌ర్శ‌నాలు ర‌ద్దు – స‌ర్వ‌ద‌ర్శ‌నం భ‌క్తుల‌కు మాత్ర‌మే అనుమ‌తి.** ***ప్రస్తుతం తిరుమలలో ఎటువంటి ఉచిత దర్శనం టికెట్స్ ఇవ్వడం లేదు . అందరు టికెట్ లేకుండా దర్శనం చేసుకోవచ్చు. ***జులై 7న సెప్టెంబరు నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా 9 గంట‌ల‌కు టిటిడి ఆన్ లైన్ లో విడుదల.***తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్‌ నిషేధం. ప్లాస్టిక్ బాటిళ్లు, బ్యాగులు, కవర్ల వినియోగాన్ని తిరుమలలో టీటీడీ పూర్తిగా నిషేధించింది. *** ఆన్లైన్ సేవ తీసుకున్నవారికి కూడా దర్శనం ఉంటుంది సేవ తో పాటు దర్శనం బుక్ చేస్కోవాలి .*** కళ్యాణం టికెట్స్ ఏ ఇద్దరైనా బుక్ చేస్కోవచ్చు దంపతులే కాకుండా   ఇద్దరు మగవాళ్ళు , ఇద్దరు ఆడవాళ్లు కూడా బుక్ చేస్కోవచ్చు . *** .****

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***షిర్డీ ఆలయం ఓపెన్ లోనే ఉంది . ఆన్ లైన్ లో టికెట్స్ బుక్ చేస్కుని దర్శనానికి వెళ్ళాలి . రామేశ్వరం లో బావుల్లో స్నానానికి అనుమతించడం లేదు తమిళనాడు లోని ఆలయాలకు ఆన్లైన్ బుకింగ్ అవసరం లేదు . అరుణాచలం దర్శనానికి ఆన్ లైన్ టికెట్ అవసరం లేదు నేరుగా వెళ్లి దర్శించవచ్చు గిరిప్రదక్షిణ కలదు .  . 

ఇడాన మాత దేవాలయం, ఉదయపుర్, రాజస్థాన్

తీర్ధయాత్ర - రాజస్తాన్ 

ఇడాన మాత దేవాలయం, ఉదయపుర్, రాజస్థాన్

ఆలయ దర్శనం సమయం: ఈ ఆలయం ప్రతిరోజు 24 గంటలు తెరిచి ఉంటుంది

రాజస్థాన్ లో ఉదయపుర్ లో అగ్ని స్నానమాచరించే ఇడాన మాత ఆలయం ఉంది. అక్కడ అగ్ని దానంతటా అదే వస్తుంది. ఈ ఆలయానికి ఎక్కువగా పక్షవాతం రోగులు ఇక్కడకు వస్తుంటారు. ఈ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తుంటారు.

 అక్కడున్న దేవత అగ్నిస్నానమాచరిస్తుంది. అంటే మంట దానంతట అదే ఉద్భవిస్తుంది. 

అగ్నిని నీరుగా తీసుకునే విచిత్రమైన అమ్మవారి దేవాలయం రాజస్థాన్ లో ఉంది. అక్కడ ఇడాన మాతాలయంగా ప్రసిద్ధి. ఈ మందిరానికి ఓ ప్రత్యేకత ఉంది. ఆరావళి పర్వతాల్లో నెలకొని ఉన్న ఈ దేవాలయం రాజస్థాన్ లోని ఉదయపుర్ కు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. పైన రూఫ్ లేకుండా నిర్మించిన ఈ ఆలయం చతురాస్రాకరంలో ఉంది. 

ఇడాన ఉదయపుర్ మేవాల్ మహారాణి పేరు మీదున్న ఈ ఆలయం చుట్టుపక్కల ఎంతో ప్రసిద్ధి గాంచింది. ఇక్కడ ఉన్న ఇడాన మాత అగ్నిని స్నానంగా తీసుకుంటుంది. నెలకు రెండు మూడు సార్లు అమ్మవారు ఇలాంటి స్థితిలో ఉంటుందని అక్కడ స్థానిక ప్రజలు చెబుతున్నారు. మంట దానంతట అదే మండుతుంది. దేవాలయంలోని అమ్మవారి విగ్రహం తప్ప అక్కడున్న ప్రతి వస్తువు అగ్నికి ఆహుతి అవుతుంది. ఈ పరమ పవిత్రమైన దృశ్యాన్ని చూసేందుకు భక్తులు తండోపతండాలుగా విచ్చేస్తుంటారు. 

ఇలా మంట ఎలా వస్తుందో తెలుసుకునేందుకో ఎంతో మంది ఎన్ని రకాలు పరిశోధనలు చేసిన ఫలితం లేకపోయింది. ఇంతవరకు ఈ మిస్టరీని కనిపెట్టలేకపోయారు. ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేక గుర్తింపు వల్ల ఎక్కువ సంఖ్యలో భక్తులు హాజరవుతుంటారు. ముఖ్యంగా పక్షవాతం, మానసిక ఆందోళకు గురవుతున్న ప్రజలు రోగ విముక్తి కోసం ఇక్కడకు వచ్చి అమ్మవారి ఆశీర్వదాలు పొందుతారు. ఆలయంలో అగ్ని వచ్చినంత కాలం ఇక్కడకు భక్తులు భారీ సంఖ్యలో హాజరవుతుంటారు. 

ముఖ్యంగా దగ్గరలో ఉన్న గ్రామస్థులు భారీ సంఖ్యలో వస్తుంటారు. ఇక్కడున్న అమ్మవారే స్వయంగా జ్వాలాదేవి రూపాన్ని ఆవహించిందని ఇడాన దేవాలయంలో పుజారులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ ఆలయంలో వచ్చే మంట దాదాపు 10 నుంచి 20 అడుగులు వరకు వస్తుందట. ఇక్కడకు వచ్చే భక్తులు అమ్మవారి అగ్నిని చూడటమే కాకుండా అక్కడున్న త్రిశూలాన్ని పూజిస్తారు. 

ముఖ్యంగా సంతానం లేని వారు త్రిశూలానికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఫలితంగా వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. పక్షవాతం రోగులకు అయితే ఆరోగ్యం కుదటపడి సాధారణ స్థాయికి చేరుకుంటారు. అంతేకాకుండా కోరుకున్న కోరికల తీరతాయని నమ్మకం.

ఎలా చేరుకోవాలి 

రోడ్డు మార్గం: సురజ్‌పోల్ నుండి ఉదయం సబర్బన్ బస్సు సర్వీస్ అందుబాటులో ఉంది. ఇది కాకుండా, కురాబాద్-బాంబోరా రోడ్డులో వెళ్లే వాహనాల ద్వారా బంబోరా చేరుకోవడం ద్వారా శక్తిపీఠాన్ని జీపు ద్వారా చేరుకోవచ్చు.

సమీప రైల్వే స్టేషన్: ఉదయపూర్ సిటీ రైల్వే స్టేషన్, ఇది ఇడాన మాత ఆలయం నుండి 63.4 కి.మీ దూరంలో ఉంది.

సమీప విమానాశ్రయం: మహారాణా ప్రతాప్ విమానాశ్రయం ఉదయపూర్, ఇది ఇదానా మాత ఆలయం నుండి 49 కిమీ దూరంలో ఉంది.

సర్వేజనా సుఖినోభవంతు

రామకృష్ణంరాజు గాదిరాజు

Comments

Popular Posts