Drop Down Menus

శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎందుకు ప్రత్యేకం ? ఆ రోజే ఏడుకొండల వాడిని పూజించాలా ? Sri Venkateswara Swamy Pooja Vidhanam saturdays

శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎందుకు ప్రత్యేకం ? ఆ రోజే ఏడుకొండల వాడిని పూజించాలా ?

పురాణాలలో ఏయే వారాలలో ఏ దేవుని పూజిస్తే ఫలితం ఉంటుందో నిర్ణయించారు. అంటే.. ఆదివారం సూర్యభగవానుడు, సోమవారం శివుడు, మంగళవారం సుబ్రమణ్యస్వామి, ఆంజనేయ స్వామి, బుధవారం అయ్యప్పస్వామి, గురువారం సాయిబాబా, శుక్రవారం అమ్మవారు, శనివారం వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకం. ఇలా ఒక్కో రోజుని ఒక్కో దేవునికి ప్రత్యేకంగా చెప్పబడింది.

వెంకటేశ్వర స్వామికి శనివారం ప్రత్యేకం కావడంతో.. ఆ రోజు ఆ దేవుడికి పూజలు, దర్శనాలు చేసుకుంటారు. కలియుగంలో అత్యంత శక్తివంతమైన దైవం శ్రీనివాసుడు. ప్రతి భక్తుడు ఆ అలంకారప్రియుడిని శనివారమే దర్శించుకోవాలని భావిస్తాడు. ఇంతకీ శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎందుకు ప్రత్యేకం ? ఆ రోజే ఏడుకొండల వాడిని పూజించాలా ? మిగిలిన రోజుల్లో శ్రీనివాసుడి కరుణాకటాక్షాలు పొందలేమా ?

సాధారణంగా శనివారం అంటే శనిదోషాల నివృత్తి కోసం శ్రీ వేంకటేశ్వరుని ఆరాధిస్తారు. వెంకటేశ్వర స్వామిని శనివారం పూజించడం వెనక చాలా కారణాలే ఉన్నాయి.

> ఓంకారం ప్రభవించిన రోజు శనివారం .

> శనివారం నాడు ఎవరైతే శ్రీనివాసుని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో , వారిని పీడించనని శనిశ్వరుడు వేంకటేశ్వర స్వామికి వాగ్దానం చేసిన రోజు  శనివారం .

> శ్రీ వేంకటేశ్వరుడు శ్రీ మహాలక్ష్మిని తన వక్షస్థలాన నిలిపిన రోజు  శనివారం .

> శ్రీనివాసుని భక్తులు మొట్ట మొదట సారి దర్శించిన రోజు శనివారం .

> ఆలయ నిర్మాణం చేయమని శ్రీ వేంకటేశ్వరుడు తొండమాన్ చక్రవర్తికి ఆజ్ఞ ఇచ్చిన రోజు శనివారం .

> శ్రీ  శ్రీనివాసుని సుదర్శనం పుట్టినరోజు శనివారం .

> శ్రీనివాసుడు ఆలయ ప్రవేశం చేసిన రోజు శనివారం .

> శ్రీనివాసుడు పద్మావతి దేవిని వివాహ మాడిన రోజు శనివారం .

కనుక శ్రీనివాసునికి శనివారమంటే అంత ప్రీతి .

పంచభక్ష్య భోజనం అంటే ఏమిటి.....???

1) భక్ష్యము       : నమిలి తినుట !

2) భోజ్యము     : చప్పరిస్తే కరిగిపోయేది !

3) చోష్యము     : పీల్చుకునేది / జుర్రుకునేది !

4) లేహ్యము     : నాక్కుంటూ తినదగిన !

5) పానియము  : త్రాగేది !

ఈ 5 విధాలైన పదార్దలతో కూడిన భోజనమే పంచభక్ష్య భోజనము అని అంటారు .

తీర్థ ప్రసాదాలు 4 రకాలు......

1) జల తీర్థం

2) కషాయ తీర్థం

3) పంచమృత తీర్థం

4) పానకా తీర్థం

జల తీర్థం .....

ఈ తీర్థం ద్వారా అకాల మరణం , సర్వరోగాలు నివారించాబాడుతాయి....అన్నీ కష్టాలు , ఉపసమానాన్ని ఇస్తాయి.....బుద్ది అధర్మం వైపు పయనించకుండా అడ్డుపడుతుంది.....

కషాయ తీర్థం .......

ఈ తీర్థం కొల్హపురంలోని శ్రీ మహాలక్ష్మి దేవాలయం , కొల్లూరు ముకాంబిక దేవాలయం , హిమచల ప్రదేశ్ జ్వాలమాలిని దేవాలయం, అస్సాంలోని శ్రీ కామాచి దేవాలయములో ఇస్తారు .....రాత్రి పూజ తరువాత తీర్థని కషాయం రూపంలో పంచుతారు.....వీటిని సేవించటం ద్వారా కనిపెంచే - కనిపించని రోగాలు త్వరలో నయం అవుతాయి .....

పంచామృత అభిషేక తీర్థం ....

పంచామృత సేవనం ద్వారా చేపట్టిన అన్నీ పనులు దిగ్విజయముగా పూర్తికావటం మరియు  బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది....

పానకా తీర్థం .......

శ్రీ మంగళగిరి నరసింహస్వామి దేవునికి , అహోబిలం నరసింహ దేవునికి పానకం నరసింహస్వామి దేవునిగా ఖ్యాతినర్జించారు ..... కారణం స్వామి పానకాన్ని నివేధ్యంగా పెట్టి , వచ్చే భక్తులకు పానకాన్ని తీర్థంగా పంచుతారు.....

పానకా తీర్థాలు వలన ప్రయోజనాలు....

* దేహంలో ఉత్సాహం ఎక్కువ అవుతుంది !

* కొత్త చైతన్యం వస్తుంది !

* దేహంలో ఉండే వేడి సమస్థితికి వచ్చే విధంగా చేస్తుంది.!

* రక్తపోటు ఉన్నవారికి తల తిరగడం , నోరు ఎండిపోవునట్లు ఉండడం జరుగదు !

* రుమాటిజం , ఎముకలుకు సంభందించిన వ్యాధులు నయం అవుతుంది !

* దేవుని తీర్థమైన పానకం సేవించటం ద్వారా మధుమేహ వ్యాధి అదుపులో ఉంటుంది !

* జీవితంలో శత్రువుల బాధ ఉండదు!

* బుద్ది చురుకుగా పని చేస్తుంది !

* జ్జాపకశక్తి  పెరుగుతుంది !

Famous Posts:

హనుమ నామస్మరణం సర్వపాప నివారణం


స్త్రీల గూర్చి పురుషులు, పురుషుల గూర్చి స్త్రీలు తెలుసుకోవాల్సినవి?


సూర్యుడి అనుగ్రహాన్ని కోరుతూ ఆదివారాల నోము


శనేశ్వరుడు శనివారాల నోము


శుక్రవారాల నోముకి ఎంతో ప్రాధాన్యత

శ్రీనివాసుడికి శనివారమే, saturdays, sri venkateswara swamy 7 saturday vratham in telugu pdf, venkateswara swamy pooja vidhanam in telugu pdf, venkateswara pooja at home, how to do 7 saturday pooja , venkateswara swamy pooja pdf, venkateswara pooja at home in tamil, tirupati balaji pooja vidhi at home, nitya pooja vidhanam in telugu pdf, venkateswaraswamy pooja saturday

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.