Drop Down Menus

నాగారాధన విశిష్టత మరియు నాగారాధన వల్ల కలిగే సత్ఫలితాలు..| Nagaradhane Visistatha Telugu

నాగారాధన విశిష్టత మరియు నాగారాధన వల్ల కలిగే సత్ఫలితాలు..

నాగారాధన తో చెవి, చర్మ సంబంధ వ్యాధులు పోతాయని, సంతానం కలుగుతుందని ఓ నమ్మకముంది. కొన్ని వ్యాధుల నిర్మూలనలో సర్ప విషం విలువ తెలిసిందే. ఇంతటి సామాజిక ప్రయోజనం ఉన్నందువల్లనే ఒక ప్రాంతం, ఒక దేశమని కాకుండా నేటికీ చాలామంది సర్పారాధన చేస్తున్నారు.

ప్రాణులన్నిటా పరమాత్మ ఉన్నాడని, ఏ ప్రాణి నీ అనవసరం గా భాదించకూడదని, దేనివల్ల జరగాల్సిన మేలు దానివల్ల జరుగుతూనే ఉంటుందని తెలియజెప్పే ఓ సందేశం తో సర్ప పూజ ఆచరణ లోకి వచ్చిందని పూర్వులు చెబుతారు.నాగ దేవతలను ఆరాధించే సంస్కృతీ ప్రపంచవ్యాప్తం గా పలు ప్రాంతాలలో ఉంది. అందరు జరుపుకోనేది ఒకే కారణానికి, కాని ఆచరించే విధానాలు వేరుగా ఉంటాయి.కొన్ని వేదమంత్రాల్లో సర్పమంత్రాలు ప్రత్యేకంగా ఉన్నాయి. గుళ్ళు గోపురాలు, విగ్రహాలు లేనప్పటి నుండి కూడా నాగ పూజలను ఆచరించే వారు. ప్రకృతి తో పాటు గా నాగారాధన అనాదిగా వస్తున్న ఆచారం. మన తెలుగునాట ముఖ్యం గా శ్రావణ శుద్ద చవితి, పంచమి నాడు, కార్తీక శుద్ద చవితి, పంచమి నాడు ఈ నాగ పూజను విశేషం గా జరుపుతారు.

నాగుల చవితి, పంచమి గురించి పురాణాలలో ఎన్నో కథలు ఉన్నాయి. గ్రీష్మ వర్ష ఋతువులలో సర్వ సాధారణం గా పాములు బయట సంచరించవు. శరదృతువులో ప్రకృతి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది కాబట్టి పాములు బాగా స్పందించి సంచరిస్తూ ఉంటాయి. అందుకే ఈ కాలం లోనే నాగులను పూజించడం ఆచారం గా చెప్పబడింది. శ్రావణ మాసం లో వర్షాల వల్ల పుట్టల నుంచి పాములు వెలుపలికి వచ్చి బాదిస్తాయి, కావున నాగ పూజ వర్షాకాలం లో ప్రాధాన్యత ను సంచరించుకుంది.

వాసుకి, తక్షకుడు, ఐరావతుదు ధనుంజయుడు, కర్కోటకుడు, అనంతుడు, శేషుడు వీరిని సర్ప జాతికి మూల పురుషులుగా పురాణాల ద్వారా తెలుస్తుంది.

Famous Posts:

పంచముఖ ఆంజనేయ స్వామి వారి అవతార కథ


హనుమ నామస్మరణం సర్వపాప నివారణం


స్త్రీల గూర్చి పురుషులు, పురుషుల గూర్చి స్త్రీలు తెలుసుకోవాల్సినవి?


సూర్యుడి అనుగ్రహాన్ని కోరుతూ ఆదివారాల నోము


శనేశ్వరుడు శనివారాల నోము


శుక్రవారాల నోముకి ఎంతో ప్రాధాన్యత

Nagaradhane, nagamandala, nagadevi, nagula chavithi, chavithi, snakes, nagaradhana telugu

ఇవి కూడా చూడండి
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON