Tirumala Darshan Information:

Tirumala News ***  ఓం నమో వేంకటేశాయ *** నవంబర్ నెలకు సంబంధించిన రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టిక్కెట్ల‌ ఆన్‌లైన్ కోటాను సెప్టెంబరు 21న ఉదయం 9 గంటలకు టీటీడీ వెబ్‌సైట్‌లో విడుదల చేయ‌నుంది.***నవంబర్ నెలలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవతో సహా ఆర్జిత సేవా టిక్కెట్లు సెప్టెంబరు 21 మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. ***నవంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్లు సెప్టెంబర్ 21 నుండి అందుబాటులో ఉంటాయి.***అక్టోబర్ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్‌లు సెప్టెంబర్ 22న ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయబడతాయి.***అక్టోబ‌రు 25న సూర్యగ్రహణం, న‌వంబరు 8న చంద్ర‌గ్ర‌హ‌ణం- ఆయా రోజుల్లో 12 గంట‌ల పాటు శ్రీ‌వారి ఆల‌య త‌లుపులు మూత –అన్ని ర‌కాల ద‌ర్శ‌నాలు ర‌ద్దు – స‌ర్వ‌ద‌ర్శ‌నం భ‌క్తుల‌కు మాత్ర‌మే అనుమ‌తి.** ***ప్రస్తుతం తిరుమలలో ఎటువంటి ఉచిత దర్శనం టికెట్స్ ఇవ్వడం లేదు . అందరు టికెట్ లేకుండా దర్శనం చేసుకోవచ్చు. ***జులై 7న సెప్టెంబరు నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా 9 గంట‌ల‌కు టిటిడి ఆన్ లైన్ లో విడుదల.***తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్‌ నిషేధం. ప్లాస్టిక్ బాటిళ్లు, బ్యాగులు, కవర్ల వినియోగాన్ని తిరుమలలో టీటీడీ పూర్తిగా నిషేధించింది. *** ఆన్లైన్ సేవ తీసుకున్నవారికి కూడా దర్శనం ఉంటుంది సేవ తో పాటు దర్శనం బుక్ చేస్కోవాలి .*** కళ్యాణం టికెట్స్ ఏ ఇద్దరైనా బుక్ చేస్కోవచ్చు దంపతులే కాకుండా   ఇద్దరు మగవాళ్ళు , ఇద్దరు ఆడవాళ్లు కూడా బుక్ చేస్కోవచ్చు . *** .****

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***షిర్డీ ఆలయం ఓపెన్ లోనే ఉంది . ఆన్ లైన్ లో టికెట్స్ బుక్ చేస్కుని దర్శనానికి వెళ్ళాలి . రామేశ్వరం లో బావుల్లో స్నానానికి అనుమతించడం లేదు తమిళనాడు లోని ఆలయాలకు ఆన్లైన్ బుకింగ్ అవసరం లేదు . అరుణాచలం దర్శనానికి ఆన్ లైన్ టికెట్ అవసరం లేదు నేరుగా వెళ్లి దర్శించవచ్చు గిరిప్రదక్షిణ కలదు .  . 

తాంబూలానికి తమలపాకులనే ఎందుకు వాడతారు? Why are betel leaves used for tambulam?

తాంబూలానికి తమలపాకులనే ఎందుకు వాడతారు?

1. హిందూ ధర్మంలో తమలపాకు ప్రాముఖ్యత 

హిందూ ధర్మం లో తమలపాకును అష్ట మంగళాల లో(1. పూలు 2. అక్షింతలు, 3. ఫలాలు,4,అద్దం, 5. వస్త్రం, 6. తమలపాకు మరియు వక్క ,7.దీపం, 8. కుంకుమ)  ఒకటిగా భావిస్తారు. కలశ పూజలో మరియు సంప్రోక్షణ లు చేసేటప్పుడు తమలపాకుని వాడతారు. పూజలలో, నోములలో, వ్రతాలలో తమలపాకు మొట్టమొదట ఉండవలసిన వస్తువు.పసుపు గణపతినీ, గౌరీదేవినీ తమలపాకుపైనే అధిష్టింపజేస్తాం.  భారత దేశం లో తాంబూల సేవనం చాలా ప్రాచీనమైన అలవాటు. భగవంతుని పూజలోనూ, అతిథి మర్యాదల లోనూ, దక్షిణ ఇచ్చేటప్పుడూ, భోజనానంతరం తమలపాకుని తప్పని సరిగా ఉపయోగిస్తారు. దంపతులు తాంబూల సేవనం చేయడం వల్ల వారి అనురాగం రెట్టింపు అవుతుందని పెద్దలు చెబుతారు.

2. తమలపాకు పూజలలో ఎందుకు ముఖ్యం?

క్షీర సాగర మథనం లో వెలువడిన అనేక అపురూపమైన వస్తువులలో తమలపాకు ఒకటని స్కాంద పురాణం లో చెప్పబడింది. శివపార్వతులే స్వయంగా తమలపాకు చెట్లను హిమాలయాలలో నాటారని జానపద కథలు చెబుతున్నాయి . తమలపాకు యొక్క మొదటి భాగం లో కీర్తి, చివరి భాగం లో ఆయువు, మధ్య భాగం లో లక్ష్మీదేవీ నిలిచి ఉంటారని పెద్దలు చెబుతారు.

3. తమలపాకు లోని ఏయే భాగాలలో ఏ దేవతలు ఉంటారో తెలుసుకుందాం 

తమలపాకు పైభాగం లో ఇంద్రుడు, శుక్రుడు ఉంటారు.

సరస్వతీదేవి మధ్యభాగం లో ఉంటుంది.

తమలపాకు చివరలలో మహాలక్ష్మీ దేవి ఉంటుంది.

జ్యేష్టా దేవి తమలపాకు కాడకీ కొమ్మకీ మధ్యన ఉంటుంది.

విష్ణుమూర్తి తమలపాకు లో ఉంటాడు.

శివుడు, కామదేవుడు తమలపాకు పైభాగం లో ఉంటారు.

తమలపాకు లోని ఎడమవైపున పార్వతీదేవి, మాంగల్య దేవి ఉంటారు.

భూమాత తమలపాకుకి కుదిభాగం లో ఉంటుంది.

సుబ్రహ్మణ్య స్వామి తమలపాకు అంతటా వ్యాపించి ఉంటాడు.

4. తమలపాకు లోని అద్భుతమైన ఆయుర్వేద గుణాలు 

తమలపాకు నోటి దుర్వాసనను పోగొడుతుంది. నోటిపుండ్లు, నోటిపూత వంటి వ్యాధులను తగ్గిస్తుంది. లైంగిక శక్తిని పెంచుతుంది. అరుగుదలకు తమలపాకు ఎంతగానో సహకరిస్తుంది కనుకనే భోజనానంతరం తాంబూల సేవనాన్ని చేస్తారు.

తమలపాకు ఎ మరియు సి విటమిన్లకు నిలయం. తమలపాకులలో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. దీనివల్ల అనేక వ్యాధులు నిర్మూలించబడతాయి. తాంబూలం లో వేసుకునే ఇతర సుగంధ ద్రవ్యాలైన జాజికాయ, జాపత్రి శ్లేష్మాన్ని,కఫాన్నీ నిర్మూలిస్తాయి. ఏలకులు అసిడిటీ మరియు గ్యాస్ సమస్యలను పోగొడతాయి. నరాల బలహీనత,మూత్ర సంబంధ వ్యాధులు కూడా తమలపాకు వల్ల తొలగుతాయి.

కాన్సర్ నివారణకు తమలపాకు అద్భుతమైన ఔషధం. 

శరీరం లో వేడి ఎక్కువగా ఉన్నవారు, తలనొప్పితో బాధపడుతున్న వారు తమలపాకును నుదుటిపై ఉంచడం ద్వారా ఉపశమనం పొందుతారు. చెవిపోటుతో బాధపడుతున్నవారు తమలపాకు నూనెను లేదా రసాన్ని గోరువెచ్చగా చేసి చెవిలో పోయడం ద్వారా చెవిపోటు తగ్గుతుంది. చీము,పుండ్లు వంటివి నశిస్తాయి. తమలపాకులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.

తమలపాకు రసం రాయడం వల్ల గాయాలు త్వరగా మానిపోతాయి.

పూర్వకాలం లో స్త్రీలు తాంబూల సేవనం శృంగార ప్రేరేపకంగానూ, సౌందర్య వస్తువుగానూ భావించేవారు. తాంబూలం నోటినీ పెదవులనూ ఎర్రగా చేయడం ఇందుకు ప్రధానకారణం. చేతులకు గోరింటాకు లాగే నోటికి తాంబూలం శోభాకరంగా భావించేవారు. ఆ భావన ఇప్పటికీ కొంసాగుతోంది.

5. తమలపాకు వాడకం లో తప్పనిసరిగా తీసుకోవలసిన  జాగ్రత్తలు 

తమలపాకుని పూజలకు ఉపయోగించేటప్పుడు రంధ్రాలు ఉన్నవి గానీ, వాడిపోయినవి గానీ ఉపయోగించరాదు. అవి తాంబూల సేవనానికి కూడా మంచివికావు.

తమలపాకు అతిగా సేవించడం వల్ల రక్తం పలచబడే అవకాశం ఉంది. కాబట్టి భోజనానంతరం ఒకటి లేదా రెండుకు మించి అతిగా తినరాదు.

తమలపాకులో పొగాకు వంటివాటిని వాడటం ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరం. సంప్రదాయ బద్ధమైన తాంబూల సేవనం మాత్రమే ఆరోగ్యాన్ని ఇస్తుంది. తమలపాకులో హానికారకమైన వస్తువులని కలిపి సేవించడం అనారోగ్యాలకు దారితీస్తుంది.

Famous Posts:

ఈ విచిత్ర దేవాలయాల గురించి మీకు తెలుసా?


ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలో మీకు తెలుసా ?


అమెరికా ఏడారిలో 22 కిమీల శ్రీ చక్రం


తమలపాకులు, తాంబూలం, betel leaf benefits, betel leaves, tambulam, tamalapakulu, pooja

Comments

Popular Posts