Drop Down Menus

పూరీ జగన్నాథ్ దేవాలయం యొక్క అంతుచిక్కని రహస్యాలు | Mysteries of Jagannath Temple that defy scientific logic

పూరీ జగన్నాథ్ దేవాలయం యొక్క అంతుచిక్కని రహస్యాలు... సైన్స్ కూడా కనిపెట్టలేని నిజాలు:
ఒడిశా రాష్ట్రంలోని పూరీ జగన్నాథ్ ఆలయం గురించి తెలియని వారు ఉండరు. ప్రతి ఏటా అక్కడ జరిగే రథోత్సవం ఎంతో ప్రసిద్ధి కలది. ఈ ఆలయం ప్రాముఖ్యత గురించి అందరికీ తెలిసి ఉండవచ్చు కానీ అక్కడి ఆశ్చర్యపరిచే నిజాల గురించి మాత్రం అతికొద్ది మందికి మాత్రమే తెలుసు. అవేంటో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యానికి లోనవుతారు.
పూరీ జగన్నాథ్ ఆలయానికి హిందూ భక్తుల్లో ప్రత్యేక స్థానం ఉంది. దేశంలోనే ప్రసిద్ధ చార్ ధామ్ క్షేత్రాల్లో ఇది ఒకటి. ఇక్కడ ప్రతి ఏటా నిర్వహించే రధయాత్రకు దేశ విదేశాల నుంచి లక్షలాది సంఖ్యలో భక్తులు విచ్చేస్తారు. శ్రీ మహావిష్ణువు కలలో కనిపించి ఆదేశించిన ప్రకారం ఇంద్రద్యుమ్న మహరాజు పూరీ ఆలయాన్ని నిర్మించినట్లు పురాణ కధనం. పాండవులు యమరాజు వద్దకు తమ ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు మోక్షానికి చేరువ చేసే చార్ ధామ్ క్షేత్రాల్లో ఒకటైన పూరీ జగన్నాధ్ ఆలయాన్ని దర్శించుకున్నారట. సైన్స్ కు కూడా అంతుచిక్కని రహస్యాలతో ఈ ఆలయం ముడిపడి ఉన్నట్లు చెబుతారు. పూరీ జగన్నాథ్ ఆలయమే ఒక పెద్ద మిస్టరీ. అక్కడ ఉన్న ప్రతి ఒక్కటీ మిస్టరీయే. అందుకే పూరీ జగన్నాథ స్వామిని భక్తులు అంతలా ఆరాధిస్తారు. ఇంతకీ పూరీ జగన్నాథ్ ఆలయంలో ఉన్న మిస్టరీలేంటో ఒకసారి తెలుసుకుందాం.

65 అడుగుల ఎత్తైన పిరమిడ్ నిర్మాణం:
ఈ ఆలయంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అక్కడ ఉన్న 65 అడుగుల ఎత్తైన పిరమిడ్ నిర్మాణం. అక్కడ ఉండే స్తంభాలు, గోడలు..అన్నీ ప్రత్యేకతతో కూడుకున్నవే. ఈ ఆలయంలో క్రుష్ణుడి జీవితాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించే గోడలు, స్థంభాలు ఈ ఆలయానికి మరింత శోభను తీసుకొసుకొస్తాయి. అన్ని ఆలయాల్లో ఉన్నట్లే గోపురం, దేవతలు, గంటలు, ప్రసాదం అన్నీ ఉన్నా ప్రతీదానికీ ఒక విశిష్టత అద్బుతం కలిగి ఉంది ఇక్కడ ఇంకా ఎన్నో అద్భుతాలున్నాయి.

ఆలయంపై జెండా:
పూరీ జగన్నాధ్ ఆలయంపై ఎప్పుడూ హిందూ మతం చిహ్నాలతో కూడిన జెండాలు కనిపిస్తాయి. ఇందులో ఆశ్చర్యం ఏం ఉంది అనుకోకండి. అసలు రహస్యం ఇక్కడే ఉంది. ఈ జెండాలు గాలి వీచే దిశలో కాకుండా వ్యతిరేక దిశలో రెపరెపలాడుతూ ఉంటాయి. దీని వెనుక రహస్యం శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టలేకపోయారు.
సుదర్శన చక్రం:
20 అడుగుల ఎత్తు, టన్ను బరువు గల సుదర్శన చక్రాన్ని పూరీ జగన్నాధ్ ఆలయ పై భాగాన ఏర్పాటు చేశారు. ఆశ్చర్యకర విషయం ఏమిటంటే పూరీ పట్టణంలో ఏ మూల నుంచి చూసినా ఈ సుదర్శన చక్రం కనిపిస్తుంది. ఆలయంపైన ఈ చక్రాన్ని ఉంచిన తీరు ఒక ఇంజినీరింగ్ మిస్టరీగానే మిగిలిపోయింది. ఏ వైపు నుంచి మీరు దీనిని చూసినా అది మీకు అభిముఖంగానే ఉన్నట్లు కనిపించడం విశేషం.

ఆలయంపై నుంచి విమానాలు, పక్షులు ఎగరవు:
ఈ ఆలయంపై నుంచి విమానాలు, పక్షులు ఎగరకపోవడం ఆశ్చర్యకర విషయం. దేశంలోని ఏ ఆలయంలోనూ ఇటువంటి అంశం కనిపించడం అరుదు. ఏ ప్రభుత్వమూ దీనిని నో ప్లయింగ్ జోన్ గా ప్రకటించలేదు. ఏదో తెలియని అతీత శక్తి కారణంగా ఇది నో ఫ్లయింగ్ జోన్ గా పరిగణింపబడుతుంది. దీనికి ఇప్పటికీ శాస్త్రీయ వివరణ లేకపోవడంతో రహస్యంగానే మిగిలిపోయింది.

ఆలయ నిర్మాణం:
పూరీ జగన్నాధ్ ఆలయాన్ని ఓ అద్భుతంగా చెప్పవచ్చు. రోజులో ఏ సమయంలో కూడా ఈ ఆలయం నీడ కనిపించదు. ఇది అప్పటి ఇంజినీరింగ్ అద్భుతమా లేక దైవ శక్తి కారణంగా జరుగుతుందా అనేది అంతుచిక్కని విషయం.

సింఘద్వారం రహస్యం:
జగన్నాధ్ ఆలయానికి నాలుగు ద్వారాలు ఉంటాయి. వీటిలో సింఘ ద్వారం ఆలయ ప్రవేశానికి ప్రధాన మార్గం. ఈ ద్వారం గుండా ఆలయంలో ప్రవేశించినప్పుడు మీరు శబ్ధ తరంగాలను స్పష్టంగా వినవచ్చు. ద్వారం నుంచి కాస్త వెనక్కి నడిచి బయటకు వస్తే ఆ శబ్ధం మీకు వినిపించదు. ఇది భక్తులకు ఓ అద్భుతంలా అనిపిస్తుంది.
సముద్రం రహస్యం:
సాధారణంగా సముద్ర తీరంలో ఉదయం పూట గాలి సముద్రం నుంచి భూమి వైపు, సాయంత్రం వేళ భూమి నుంచి సముద్రం వైపు వెళ్తుంది. కానీ పూరీ సముద్ర తీరంలో మాత్రం దీనికి పూర్తి వ్యతిరేక దిశలో జరగడం విశేషం. ఇది సైన్స్ కు కూడా అంతుచిక్కని మిస్టరీ.
1800 ఏళ్ల నుంచి జరుగుతున్న ఆచారం:
45 అంతస్తుల ఎత్తు గల ఈ ఆలయంపైకి ప్రతి రోజూ ఓ పూజారి ఎక్కి జెండాను క్రమం తప్పకుండా మారుస్తుంటారు. ఈ ఆచారం దాదాపు 1800 ఏళ్ల నుంచి జరుగుతుంది. ఇది ఒక్క రోజు తప్పినా అప్పటి నుంచి 18 ఏళ్ల వరకూ ఆలయం మూతపడుతుందని నమ్ముతారు.
ప్రసాదం రహస్యం:
పూరీ జగన్నాధ్ ఆలయానికి వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి ప్రతి రోజూ 2000 నుంచి 20,000 వరకూ భక్తులు వస్తుంటారు. అయితే ఏడాది పొడవునా ఒకే పరిమాణంలో ప్రసాదాన్ని ఆలయంలో తయారు చేస్తుంటారు. కానీ ఎప్పుడు కూడా ప్రసాదం వృధా కావడం, భక్తులకు సరిపోకపోవడం చోటుచేసుకోకపోవడం ఆశ్చర్యకర విషయం. ఈ ప్రసాదాన్ని ఏడు కుండలు ఒకదానిపై ఒకటి పెట్టి వండుతారు. కానీ కింద ఉన్న కుండల కంటే ముందుగా పై భాగంలో ఉన్న కుండలో ప్రసాదం తయారు కావడం విశేషం.
గుండిజా ఆలయం: 
ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే రథ యాత్రలో విశిష్టత ఏంటంటే..గుండీజా ఆలయానికి ఊరేగింపు రాగానే..రథం తనంతట తానే ఆగిపోతుంది. దాన్ని ఎవ్వరూ ఆపరు.ఇది కూడా ఇప్పటికీ ఓ అంతు చిక్కని రహస్యంగానే ఉండిపోయింది.
రథ యాత్ర :
భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి గాంచినది పూరీ జగన్నాథ రథయాత్ర. పూరీ జగన్నాథ్ ఆలయంలో అతి ముఖ్యమైంది ఇదే. జగన్నాథుని రథ యాత్ర. ఈ రథ యాత్రలో రెండు రథాలుంటాయి. శ్రీమందిరం, గుండిజా ఆలయానికి మధ్యలో ప్రవహిస్తున్న నదిని దాటి వెళ్లాలి. అందుకే రెండు రథాలను ఉపయోగిస్తారు. మొదటి రథం నది ఇవతలి ఒడ్డు వరకు తీసుకెళ్తుంది. అక్కడ మూడు చెక్క పడవల్లో దేవతలు నది దాటుతారు. అక్కడి నుండి మరో రథంలో దేవుళ్ళను గుండిజా ఆలయానికి తీసుకెళతారు. ఈ ఉత్సవం ప్రతీ సంవత్సరం జూన్ లేదా జూలై నెలల్లో నిర్వహిస్తారు. ప్రతి యేటా కొత్త రథాన్ని తయారు చేయడం ఇక్కడి ప్రత్యేకత. ప్రపంచంలో ఏ హిందూ ఆలయంలోనైనా సరే, వూరేగింపు నిమిత్తం మూలవిరాట్టును కదిలించరు. అందుకు ఉత్సవ విగ్రహాలుంటాయి.
రథాలు:
పూరీ వీధుల్లో బలరాముడి విగ్రహాలను రథంలో ఊరేగిస్తారు. ఆ రథం సుమారు 45 అడుగుల ఎత్తు, 35 అడుగుల వెడల్పు ఉంటుంది. ఈ రథానికి 16 చక్రాలుంటాయి. ఊరేగింపు సేవలో ఏటా ఒకే రథాన్ని వినియోగించడం అన్ని చోట్లా చూసేదే. ఈ సంప్రదాయాలన్నింటికీ మినహాయింపు ఒడిశాలోని పూరీ జగన్నాథాలయం. బలభద్ర, సుభద్రలతో సహా ఈ ఆలయంలో కొలువైన జగన్నాథుడిని ఏడాదికొకసారి గుడిలోంచి బయటికి తీసుకువచ్చి భక్తులకు కనువిందు చేస్తారు. వూరేగించేందుకు ఏటా కొత్తరథాలను నిర్మిస్తారు. అందుకే... జగన్నాథుడి రథయాత్రను అత్యంత అపురూపంగా భావిస్తారు భక్తులు.

ప్రయాణం ఇలా: 
ఒడిశాలోని పూరి క్షేత్రానికి దేశంలోని అన్ని ప్రాంతాలతో రవాణా సదుపాయం ఉంది. భువనేశ్వర్‌లోని బిజూపట్నాయక్‌ విమానాశ్రయం పూరికి 60 కి.మీ. దూరంలో ఉంది. దేశంలోని ప్రధాన నగరాల నుంచి పూరీకి రైలు సర్వీసులు నడుస్తున్నాయి. కోల్‌కతా-చెన్నై ప్రధాన రైలుమార్గంలోని ఖుర్ధారోడ్‌ రైల్వేస్టేషన్‌ ఇక్కడ నుంచి 44 కి.మీ. దూరంలో ఉంది. భువనేశ్వర్‌, కోల్‌కతా, విశాఖపట్నం నుంచి బస్సు సౌకర్యముంది.



puri jagannath temple mysteries, skeleton found in jagannath temple, why do birds and planes not fly above the jagannath temple of puri?, why there is no shadow of puri jagannath temple, interesting facts about jagannath temple puri in hindi, jagannath puri flag burning, jagannath puri flag fire, puri jagannath temple quotes, new puri jagannath temple, puri temple, puri temple address, puri jaganath temple.
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.