Drop Down Menus

వధూవరుల వివాహ విషయంలో జన్మ నక్షత్ర, నామ నక్షత్ర ప్రాదాన్యత !! Horoscope Matching for Marriage in Telugu

వధూవరుల వివాహ విషయంలో జన్మ నక్షత్ర, నామ నక్షత్ర ప్రాదాన్యత

జాతకాలు చూపించి వివాహం చేసినా లేదా చూపించకుండా వివాహం చేసినా మనకు బ్రహ్మ లిఖితం ప్రకారం రాసి పెట్టి ఉన్న అమ్మాయి, అబ్బాయిలకే వివాహం అవుతుంది. జాతకాలు చూడడం అనే టెక్నాలజీ ద్వారా మనం ప్రతి సంబంధం గురించి వెంట పడకుండా ఉండటం కోసమే ఈ విధానం చెప్పారు. జాతకాలు చూపించాం కదా అని అవగాహనా లోపాలు, విడాకులు వంటి దోషాలు సమసిపోవు.

జాతకాలు చూడటం ద్వారా మనం ఆయా గ్రహాలకు శాంతి చేయించుకొని ముందుకు వెడతాం. ఒకవేళ ఆయుర్దాయం విషయంలో తేడాలు, వైధవ్యాలు వంటివి ఉంటే ‘కదళీ వివాహం’ వంటి శాంతి మార్గాలు అన్వేషిస్తాం. కేవలం పంచాంగంలోని అంశాలను ఆధారం చేసుకొని పొంతనలు చేస్తే వివాహం కావడం కష్టం. పంచాంగాలు ప్రాథమిక అంశాలను మాత్రమే ఇస్తాయి. కేవలం పంచాంగం ఆధారం చేసుకోవడం తప్పు. కేవలం పాయింట్ల పట్టిక, లేదా తారాబలంతో వివాహ పొంతనలు కావు.

ఆయుర్దాయం, కుటుంబ స్థానం, కళత్ర స్థానం, పుత్రస్థానం, ఆర్థికం, ప్రవర్తన, ప్రమాదాలు, రాబోవు దశలలో వచ్చే స్థితిగతుల వంటి విశేషాలు శోధన చేయాలి. కుటుంబ, విద్య, ఉద్యోగ, సాంఘిక, గౌరవం, నడవడి, రూప లావణ్యాలు శోధన చేసి, ఫిల్టర్ చేసి తదనంతరం మీకు నచ్చిన సంబంధం మాత్రమే సిద్ధాంతి దగ్గర పెట్టండి.

జన్మనక్షత్రం తెలిసిన వారి విషయంలో జన్మ నక్షత్రమే ప్రధానము. అంతే కానీ ‘నామము’ అనేది ప్రధానం కాదు. పూర్వం విద్యావంతులు కాని వారి విషయంలో జన్మతేదీ, సమయం వివరములు రాసేవారు కాదు. కావున నామనక్షత్రం ఆధారం చేసుకుని నిర్ణయాలు చేసేవారు. అందుకు వీలుగా పుట్టిన వెంటనే దగ్గర్లోని పండితుని ఆశ్రయించి నక్షత్రం ప్రకారంగా ఉండే లాగ పేర్లు నిర్ణయింపజేసుకొని వెళ్లేవారు. ఇక దాని తరువాత ఎప్పుడు ఏ ముహూర్తం అవసరమైనా? అర్వణాదులు అవసరం అయినా ఆ పేరు చెప్పగానే సిద్ధాంతులు వెంటనే వారి యొక్క జన్మ నక్షత్రాన్ని, నామము యొక్క ఆధారం చేత గణన చేసి వ్యవహారములు చూసేవారు. జన్మనక్షత్రం తెలుసుకొని దానిని ప్రతి ముహూర్త విషయములలో వాడుకునే జ్ఞాపకశక్తి, మేధాసంపత్తి వున్న వారికి నామ నక్షత్రం అక్షరాలు ఆశ్రయించవలసిన అవసరం లేదు. నేడు మనకు ఉత్తరాది రాష్ట్రాలలో జన్మనామం అని విడిగా రాసి చెబుతుంటారు. కారణం నక్షత్రం గుర్తుకు రాకపోయినా కర్మనామం, జన్మనామముల రీత్యా జన్మ నక్షత్రం గ్రహణ చేయవచ్చు.

జన్మనక్షత్రం జీవితాంతం మారదు. పేరు మార్చినా జన్మతేదీ జన్మ నక్షత్రం జన్మరాశి అనేవి జీవితాంతం మారవు. జన్మనక్షత్రం తెలిసినవారు ఆ జన్మ నక్షత్ర ప్రభావమును పేర్లు మార్పు చేసుకున్ననూ అనుభవించవలసినదే. జన్మనక్షత్రము తద్వారా జన్మనామము తెలియనివారు వారివారి పేరు బలాలు మార్పు చేసుకుని వివాహాది పొంతనలు చూసుకోవచ్చు. మరి ఈ సిద్ధాంతాన్ని గ్రంథకర్తలు సమర్థించిన తీరు మనకు గోచరమవుతుంది. జన్మతేదీ జన్మనక్షత్రం వున్నవారికి నామనక్షత్ర ఆధారంగా అర్వణాదులు చూడడం శ్రేష్ఠం కాదు. గమనించగలరు. జన్మతేదీ, నక్షత్రం తెలియనివానికే నామనక్షత్రం, దాని వాడకం విషయాలు పరిగణన చేయాలి. ఉంటే జన్మనక్షత్రం విశేషం.

జాతకాలు చూపించడం అనేది సంబంధం వెదుకులాటకు ఎక్కువ శ్రమ లేకుండా చేయడం కోసం చేసిన ఏర్పాటు. మరి ఒక విషయం ఏమిటంటే జాతకాలు చూపించి వివాహం చేసినా జాతకాలు చూపించకుండా వివాహం చేసినా రాసి పెట్టి వున్న సంబంధంతోనే వివాహం అవుతుంది. కొత్తది అవ్వదు. జాతకంలో వివాహానంతరం భార్యాభర్తలు విడిపోవడం, రెండవ వివాహం వంటివి వ్రాసి వున్నాయి అనుకోండి. జాతకాలు చూపించి వివాహం చేసినా అదే యోగం పడుతుంది. జాతకం చూపించకుండా వివాహం చేసినా అదే యోగం పడుతుంది. 

దీనిని తప్పించలేము. అయితే ‘కదళీ’ వివాహం అనే పేరుతో ఒక శాంతి మార్గం మనవారు ఆచరిస్తూ ఉంటారు. ప్రథమతః వివాహం అయిన సంబంధం వారికి గండం కనుక వుంటే ఆ గండం దాటవేయుటకు గాను అరటి చెట్టుతో వధూవరులలో ఎవరికి దోషం ఉంటే వారికి వివాహం చేసి అరటి చెట్టు నరికివేస్తారు. అలాగ చేయడం వలన దోషం పోతుంది అని భావన. మరి ఇవి పురాణవేత్తలు, వైదీక సంప్రదాయ నిష్ణాతులు చెప్పే సులువైన మార్గములు. ఇలాంటి దోషాలు దోష శాంతులు తెలిసికొని జాగ్రత్త పడటం కోసం జాతకాలు చూపించుకోవాలి.

Famous Posts:

> పెళ్ళికి ముందు ఈ విషయాలని తప్పక తెలుసుకోవాలి.

పెళ్లిలో తాళి కట్టేటప్పుడు మూడు ముళ్ళు విశిష్టత.

వివాహంలో సుముహూర్తం అంటే ఇదే..!!

దేవాలయ దర్శనం ఎలా చేయాలో మీకు తెలుసా?

ఏ రాశి వారు ఏ మంత్రమును పఠించాలి?

వివాహ పొంతన, , marriage jathakam, telugu jathakam, telugu jathakam, matching for marriage, telugu jathakam online, online jathakam for marriage, marriage matching by name in telugu, boy and girl name matching for marriage, kundali matching telugu prokerala

ఇవి కూడా చూడండి
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON