Today Tirumala Darshan Information:

1) 300 Rupess Darshan Tickets for Month of December will be availble for Booking 11-11-2022 Morning 10 am **డిసెంబ‌రు నెల‌కు సంబంధించిన‌ రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను న‌వంబ‌రు 11న ఉద‌యం 10 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.** తిరుమలలో అంగ ప్రదక్షిణ , వృద్దల వికలాంగుల దర్శన టికెట్స్ ఇప్పుడు ఆన్లైన్ లో మాత్రమే ఇస్తున్నారు **. అంగ ప్రదక్షిణ నవంబర్ నెలకు టికెట్స్ అన్ని బుక్ అయ్యాయి డిసెంబర్ నెలకు నవంబర్ 20వ తేదీ తరువాత విడుదల చేస్తారు .** వృద్దల టికెట్స్ నవంబర్ నెలకు అక్టోబర్ 26వ తేదీన విడుదల చేశారు.  *** కళ్యాణం టికెట్స్ ఏ ఇద్దరైనా బుక్ చేస్కోవచ్చు దంపతులే కాకుండా   ఇద్దరు మగవాళ్ళు , ఇద్దరు ఆడవాళ్లు కూడా బుక్ చేస్కోవచ్చు . *** 12 సంవత్సరాల లోపు పిల్లలకు అన్ని సేవలకు టికెట్ లేకుండానే తీస్కుని వెళ్ళవచ్చు age proof కోసం  ఆధార్ కార్డు చూపించాలి

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***అరుణాచలంలో కార్తీక మహా దీపం డిసెంబర్ 6న గురువారం సాయంత్రం 4 గంటలకు వెలిగిస్తారు.**చార్ ధామ్ యాత్ర 2022 సమాచారం : అక్టోబర్ 26న గంగోత్రి , 27న కేదార్నాథ్ మరియు గంగోత్రి ఆలయాలు మూసివేస్తారు . చివరిగా బద్రీనాథ్ ఆలయాన్ని నవంబర్ 19న మూసివేస్తారు మరల 6 నెలల తరువాత అక్షయ తృతీయ నాడు చార్ ధామ్ యాత్ర ప్రారంభం అవుతుంది. ** కాణిపాకం ఆలయ నిర్మాణం పూర్తీ అయింది దర్శనాలు జరుగుతున్నాయి.** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు . ** అరుణాచలంలో కార్తీక దీపోత్సవం 10 రోజులు జరుగుతుంది నవంబర్ 27వ తేదీ నుంచి డిసెంబర్ 6వ వరకు. మహాదీపం డిసెంబర్ 6న పెడతారు** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారు శివరాత్రి నాడు భక్తుల రద్దీ అధికంగా ఉండటం వలన ఆ రోజు చెయ్యరు. రాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

ఉద్యోగ ప్రాప్తికి, ఉద్యోగంలో ప్రమోషన్లు లబించడానికి, క్రింది పరిహారాలను పాటించండి | To get promotions on the job, follow the following remedies

ఉద్యోగ ప్రాప్తికి, ఉద్యోగంలో ప్రమోషన్లు లబించడానికి, ఉద్యోగ ఉపాధి రంగాలలో ఎదురవుతున్న ఆటంకాలు తొలగి పోవడానికి క్రింది పరిహారాలను పాటించండి.

ఉద్యోగ ప్రయత్నాలు ఎంతకూ ఫలించనప్పుడు, ప్రతి రాత్రి ఒక నిమ్మకాయ నాలుగు ముక్కలు కోసి కూడలిలో నాలుగు దిక్కులా వేసి రండి. శనివారం నుండి మళ్ళీ శనివారం వరకు ఇలా చేయాలి. ఉద్యోగ ప్రయత్నాలలో అవరోధాలు తొలగిపోయి మీ ప్రయత్నాలు ఫలిస్తుంది.

ఉద్యోగ ప్రయత్నాల మీద భయటకు వెళ్ళేముందు, ఎవరైనా కుటుంబ సబ్యులు కోన్ని నల్ల మినుములు తీసుకొని, వెళ్ళే వారి పైనుండి ఐదు సార్లు తిప్పి పక్కన వేయండి. ఉద్యోగ ప్రయత్నాలలో విజయావకాశాలు బాగా మెరుగవుతుంది.

ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసే వారు "ఓం నమో మాతంగేశ్వరీ సర్వరాజ ముఖ రంజని హ్రీం క్లీం శ్రీం| ఉద్యోగం మే సాధయ సాధయ క్లీం హ్రీం హుం ఫట్ స్వాహా||" అన్న ఉద్యోగ మంత్రాన్ని 11 రోజుల పాటు, ఊరి బయట రాగి చెట్టు క్రింద, తూర్పు అభిముఖంగా, రావి చెట్టు ఎదురుగా కూర్చుని, రోజుకు 1008 సార్లు బియ్యం పిండి, చక్కర సమ భాగాలుగా కలిపిన మిశ్రమాన్ని పోస్తూ జపం చేయాలి. ఈ సాధన ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి మంచి ఫలితాలను ఇస్తుంది. ఇది ప్రాచీన తంత్ర గ్రంధాలలో తెలిపిన అత్యంత శక్తివంతమైన సాధన.

ఉద్యోగంలో స్థిరత్వం కోసం మరియు ఉద్యోగం లో ప్రమోషన్లు లబించడం కోసం, లక్ష్మి సరస్వతి లాంటి శాంత స్వరూపి అయిన అమ్మవారి దేవాలయంలో, 9 శుక్రవారాలు పసుపు వత్తులు వేసి, ఆవు నేతితో దీపం వెలిగించాలి. ఇదే సమయంలో అమ్మవారికి పసుపు కొమ్ముల దండను సమర్పించాలి. తొలి రోజు 16 పసుపు కొమ్ములతో మొదలు పెట్టి, క్రమంగా సరి సంఖ్యలో పెంచుతూ చివరి రోజున 64 పసుపు కొమ్ములతో మాల వేయాలి. ఇలా చేయడం వలన ఉద్యోగంలో మంచి స్థిరత్వం, అభివృద్ది లబిస్తుంది.

ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రాకపోతే, హనుమ ఆలయంలోని విగ్రహం యొక్క ఛాతీ పైన సింధూరాన్ని తిలకంలా ధరించి వెళ్ళండి. మీ ఉద్యోగ ప్రయత్నాలలో విజయం సాధిస్తారు.

కార్యాలయాలలో పని దగ్గర తరచూ ఇబ్బందులు ఎదురవుతుంటే, ఆఫీస్ లో అడుగు పెట్టే ముందు "ఓం వషట్కరాయ నమః" మంత్రాన్ని చదువుతూ లోపలికి వెళ్ళండి. మీరేదుర్కొంటున్న ఇబ్బందులన్నీ తొలగి, మీ పనులన్నీ సకాలంలో పూర్తి సంతృప్తికరంగా పూర్తవుతుంది. 

ఉద్యోగాలలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, బదిలీలను పొందడానికి 30 నిమిషాల పరిహారం:  ఈ పరిహారం మీ కార్యాలయంలో మీరు ఎదుర్కొంటున్న సమస్యలను తొలగిస్తుంది, మీ ప్రస్తుత ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, బదిలీలను పొందడానికి మీకు సహాయపడుతుంది మరియు మీ ప్రస్తుత ఉద్యోగం కంటే మెరుగైన ఉద్యోగాన్ని పొందటానికి మీ అవకాశాలను పెంచుతుంది.

మీరు ఈ పరిహారాన్ని ఒక శుభ తిథి వున్న శనివారం రోజు, సూర్యోదయ సమయంలో చేయాలి. మీరు ముందుగా ఒక కిలో నల్ల మినుములు, ఒక కిలో నల్ల బొగ్గు మరియు ఒక మీటర్ నల్ల పత్తి వస్త్రాన్ని కొనుగోలు చేయాలి. మీరు మినుములు మరియు బొగ్గును నల్ల వస్త్రంలో ఉంచి మూట కట్టాలి. మీరు ఈ మూటను మీ శరీరం చుట్టూ సవ్యదిశలో 21 సార్లు తిప్పాలి. మీ చుట్టూ  21 భ్రమణాలను పూర్తి చేసిన తరువాత, మీరు ఈ మూటను ను నది లేదా కాలువ వంటి ప్రవహించే నీటిలో నిమజ్జనం చేయాలి.  మూటను నీటిలో ముంచిన తరువాత, మీరు "ఓం హనుమతే నమః" మంత్రాన్ని 11 సార్లు చెప్పాలి.

మీ ప్రస్తుత ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, బదిలీలను పొందడానికి మీకు సహాయపడవలసిందిగా హనుమంతునికి మీ ప్రార్థనలను అర్పించాలి.  మీరు ఏ హనుమాన్ ఆలయాన్ని సందర్శించాల్సిన అవసరం లేదు, మీరు మూటను నిమజ్జనం చేసిన వెంటనే మీరు మూటను నీట ముంచిన చోటనే మీ ప్రార్థనలను అందించవచ్చు. ఈ పరిహారాన్ని ఒక్క సారి చేస్తే సరిపోతుంది. ఈ పరిహారం చేసినందుకు మీ ఉద్యోగంలో మీరు ఆశిస్తున్న అన్నిరకాల అభివృద్ధిని,  మార్పులను  మీరు అందుకుంటారు.

Famous Posts:

భర్త భార్య మాట వినాలంటే ఏమి చేయాలి ? 

వాస్తు ప్రకారం ఈ మార్పులు చేసుకుంటే సంపదలు పెరుగుతాయి.

శివుడు చెప్పిన ‘ఆదివిద్య’లు

శివ గుణాలు లోకానికి సందేశాలు

భార్యలు భర్తల కాళ్లను వత్తాలట ఎందుకో మీకు తెలుసా ?

కూతురా కోడలా ఎవరు ప్రధానం...? 

సాంబ్రాణి ధూపం వేయడం వల్ల కలిగే లాభాలు?

కాకికి అన్నం ఎందుకు పెట్టడం ?

ఉద్యోగం, ప్రమోషన్లు, promotions on the job, follow the following remedies, jobs remedies telugu

Comments

Popular Posts