Tirumala Darshan Information:

Tirumala News ***  ఓం నమో వేంకటేశాయ *** నవంబర్ నెలకు సంబంధించిన రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టిక్కెట్ల‌ ఆన్‌లైన్ కోటాను సెప్టెంబరు 21న ఉదయం 9 గంటలకు టీటీడీ వెబ్‌సైట్‌లో విడుదల చేయ‌నుంది.***నవంబర్ నెలలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవతో సహా ఆర్జిత సేవా టిక్కెట్లు సెప్టెంబరు 21 మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. ***నవంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్లు సెప్టెంబర్ 21 నుండి అందుబాటులో ఉంటాయి.***అక్టోబర్ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్‌లు సెప్టెంబర్ 22న ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయబడతాయి.***అక్టోబ‌రు 25న సూర్యగ్రహణం, న‌వంబరు 8న చంద్ర‌గ్ర‌హ‌ణం- ఆయా రోజుల్లో 12 గంట‌ల పాటు శ్రీ‌వారి ఆల‌య త‌లుపులు మూత –అన్ని ర‌కాల ద‌ర్శ‌నాలు ర‌ద్దు – స‌ర్వ‌ద‌ర్శ‌నం భ‌క్తుల‌కు మాత్ర‌మే అనుమ‌తి.** ***ప్రస్తుతం తిరుమలలో ఎటువంటి ఉచిత దర్శనం టికెట్స్ ఇవ్వడం లేదు . అందరు టికెట్ లేకుండా దర్శనం చేసుకోవచ్చు. ***జులై 7న సెప్టెంబరు నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా 9 గంట‌ల‌కు టిటిడి ఆన్ లైన్ లో విడుదల.***తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్‌ నిషేధం. ప్లాస్టిక్ బాటిళ్లు, బ్యాగులు, కవర్ల వినియోగాన్ని తిరుమలలో టీటీడీ పూర్తిగా నిషేధించింది. *** ఆన్లైన్ సేవ తీసుకున్నవారికి కూడా దర్శనం ఉంటుంది సేవ తో పాటు దర్శనం బుక్ చేస్కోవాలి .*** కళ్యాణం టికెట్స్ ఏ ఇద్దరైనా బుక్ చేస్కోవచ్చు దంపతులే కాకుండా   ఇద్దరు మగవాళ్ళు , ఇద్దరు ఆడవాళ్లు కూడా బుక్ చేస్కోవచ్చు . *** .****

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***షిర్డీ ఆలయం ఓపెన్ లోనే ఉంది . ఆన్ లైన్ లో టికెట్స్ బుక్ చేస్కుని దర్శనానికి వెళ్ళాలి . రామేశ్వరం లో బావుల్లో స్నానానికి అనుమతించడం లేదు తమిళనాడు లోని ఆలయాలకు ఆన్లైన్ బుకింగ్ అవసరం లేదు . అరుణాచలం దర్శనానికి ఆన్ లైన్ టికెట్ అవసరం లేదు నేరుగా వెళ్లి దర్శించవచ్చు గిరిప్రదక్షిణ కలదు .  . 

వాస్తు ప్రకారం ఈ మార్పులు చేసుకుంటే సంపదలు పెరుగుతాయి | Vastu Shastra in Telugu | Hindu Temple Guide

వాస్తు ప్రకారం ఈ మార్పులు చేసుకుంటే..సంపద పెరుగుతాయి 
ఆర్థిక ఇబ్బందులున్నాయా? ఎంత డబ్బు సంపాదించినా చేతిలో నిలవట్లేదా..? ఈతిబాధలు తొలగిపోవాలంటే.. వాస్తు ప్రకారం ఇంట్లో కొన్ని చిన్ని చిన్ని మార్పులు చేసి చూడండి. అవేంటంటే..? ఎరుపు, వంకాయ రంగు, పచ్చరంగుల్ని వాస్తు రంగులంటారు. ఈ రంగుల్లో ఇంట్లో వస్తువులును అమర్చుకోండి. సోఫాలు, కర్టెన్లు ఎరుపు రంగుల్లో ఎంచుకోండి. ఇలా చేస్తే ఆర్థిక పరంగా ఇబ్బందులను దూరం చేసుకోవచ్చునని వాస్తు నిపుణులు సలహా ఇస్తున్నారు. 

నీటి ట్యాంక్‌లో శంఖం గుండ్లు, వెండి నాణేలు లేదా వెండి తాబేళ్లు ఉంచండి. ముఖ్యంగా నీటిని వృధా చేయకండి. నీటిని వృధా చేస్తే ఆ ఇంట డబ్బు నిలవదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. మీరెంత నీటిని వృధా చేస్తున్నారో.. అంతగా డబ్బును కూడా వృధా అవుతుందని గమనించాలి. ట్యాప్‌ల్లో ఎప్పుడూ నీటిని వృధా కాకుండా చూడాలి. నీటి వినియోగంలోను పొదుపు పాటించాలి. అశుభ్రమైన నీటిని బకెట్లలో వుంచకుండా అప్పటికప్పుడే పారబోయాలి. ఇంట్లో నీటి ప్రాంతం కూడా ఉత్తరం భాగంలోనే ఉండాలి.
Also Read మీ పుట్టిన తేది ప్రకారం ఈ వస్తువులు మీ ఇంట్లో ఉంచితే శుభం
ఇంటి ఉత్తర భాగంలో నీలం రంగు పిరమిడ్ పెట్టుకోవడం మంచిది. ఇలా పెట్టడం వలన సంపద పెరుగుతుంది. ఇంటీరియర్ వస్తువులు ఈ రంగుల్లో వుంటే అదృష్టం మీ వెంటే వుంటుంది. గోడ రంగులు, ఫర్నీచర్లు వంటివి ఈ రంగులో వుంటే ధనానికి కొరత వుండదు. అలాగే ఇంటిని శుభ్రంగా వుంచుకోవాలి. ప్రధాన ద్వారం అతిథులను ఆకట్టుకునే రీతిలో వుండాలి.

తూర్పు-ఉత్తర మూలలో గణేశ, లక్ష్మీ విగ్రహాలను ఆరాధించండి. బుద్ధుని బొమ్మలు బంగారు వర్ణంలో తెచ్చుకుని ఇంట వుంచితే.. ఆర్థిక ఇబ్బందులు వుండవు. అలాగే కిచెన్‌ను ఎప్పుడూ శుభ్రంగా వుంచుకోవాలి. 
Also Readమంగళ, శుక్రవారాల్లో ఎవరికీ డబ్బు ఇవ్వకూడదా? 
తులసి, ఉసిరి మొక్కను ఇంటికి ఉత్తరం దిక్కు అమర్చుకోవాలి. అలాగే మీ ఇంట మనీ ప్లాంట్‌ను పెంచుకోండి. ఆ మొక్కల సంరక్షణ ద్వారా ఆ ఇంట సంతోషంతో పాటు ఆర్థిక సమస్యలుండవని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. చాలాకాలం పాటు ఉపయోగించే వస్తువులు ఇంట వుండకుండా చూసుకోవాలి. ఉపయోగం లేని వస్తువులు ఇంట వుండకూడదు. ఈ చిట్కాలు పాటిస్తే.. ఆ ఇంట ఈతిబాధలు, ఆర్థిక ఇబ్బందులంటూ వుండవని వాస్తు నిపుణులు సలహా ఇస్తున్నారు.

ఇంటికి ఉత్తరం వైపు నగదు, బంగారం దాచుకుంటే.. వారికి లక్ష్మీదేవి కలిసి వస్తుంది. ఎక్వేరియం, డెకరేటివ్ వస్తువులన్నీ కూడా ఇంటికి ఉత్తరం వైపే ఉండాలి.
Related Posts:
శ్రీలక్ష్మీపూజ ఇలా చేస్తే ధనమే ధనం 

యూట్యూబ్ ద్వారా డబ్బు సంపాదించాలని ఉంటే, ఈ విధంగా చెయ్యండి

బియ్యపు గింజతో ఇలా చేస్తే ధన లాభం కలుగుతుంది ఎలాగో తెలుసా ? 


వాస్తు, వంట గది, వాస్తు టిప్స్ , Vastu Shastra for Home, vastu shastra for home, free vastu tips for home,  vastu tips home telugu, Vastu Shastra In Telugu, vastu sandehalu in telugu, vastu directions in telugu, 

Comments

Popular Posts