Drop Down Menus

KANCHIPURAM VARADARAJA PERUMAL Temple

VARADARAJA PERUMAL TEMPLE AT  KANCHIPURAM

VARADARAJA SWAMY TEMPLE HISTORY

విష్ణు కంచి:
కాంచీపురం అనగానే మనకు కామాక్షి అమ్మవారి ఆలయం, బంగారు బల్లి గుర్తుకు వస్తాయి. కాంచీపురం లో పృద్వి లింగం, అమ్మవారి గుడి ఆ ప్రదేశాన్ని శివ కంచి అని పిలుస్తారు. బంగారు బల్లి ఉన్న ప్రదేశాన్ని విష్ణు కంచి అని అంటారు. 
శిల్పకళ:
కాంచీపురం లో ఎత్తైన గోపురాలు, విశాలమైన ఆలయ ఆవరణాలు.. ఎత్తైన ప్రహరీలు మనల్ని కట్టిపడేస్తాయి. వరదరాజ స్వామి ఆలయం లో శిల్పకళను వర్ణించడం కష్టం. మనం ఆలయం లోకి ప్రవేశించగానే ఎడమచేతి వైపు ఒక మండపం కనిపిస్తుంది. ఈ మధ్య కాలం లో ఆ మండపాన్ని చూడ్డానికి 2/- టిక్కెట్ కూడా పెట్టారు. ఒకసారి వెళ్లి చూడండి జీవకళ ఒట్టిపడుతున్నా శిల్పాలను మీరు చూడవచ్చు. ఈ మండపం బయట రాతితో చేసిన గొలుసులు మనల్ని ఒక్కసారిగా తమవైపు తిప్పుకుని మనల్ని ఆలోచించేలా చేస్తాయి. ఇనపు గొలుసులు ఐతే విడివిడిగా చక్రాల్లా చేసి వాటిని వరసగా అమరుస్తారు. కానీ రాయిని గొలుసులా ఎలా చేసిఉంటారు?
వరదరాజు:
ఈ ఆలయం లో విష్ణుమూర్తి వరదరాజు గా పూజలు అందుకుంటున్నాడు. మీకు విష్ణుమూర్తి ని కళ్లారా చూడాలి అనుకుంటే ఈ ఆలయం లో చూడవచ్చు. ఆజానుబాహుడు .. మందహాసం చేస్తూ.. అంత ఎత్తులో ఉంటే మనం ఒక్కో మెట్టు ఎక్కుతూ స్వామివారి దగ్గరకు చేరుకుంటే.. మనం అంత దగ్గర స్వామి వారిని చూస్తుంటే ఒళ్ళు పులకరిస్తుంది. పూజారి గారు తీర్ధం అని మనల్ని పిలిస్తే గాని తల తిప్పుకోలేము. మీకు మీరుగా చూస్తే ఆ అనుభూతి మీకు తెలుస్తుంది. 

బంగారు బల్లి చరిత్ర: 


బంగారు బల్లి దర్శనం స్వామి వారి దర్శనం తరువాత ఉంటుంది. పూర్వం బ్రహ్మదేవుడు విష్ణు మూర్తి కోసం యాగం చేయగా యాగగుండం నుంచి వరదరాజ స్వామి ప్రత్యక్షం అయినట్లు స్థలపురాణం. ఆసమయంలో బల్లి కూడా స్వామి వారిని చూడ్డం వల్ల మనం బంగారు బల్లిని ముట్టుకోవడం జరుగుతుంది. 
మరొక ఇతిహాసం ప్రకారం స్వామి వారి పూజకు  ఋషి కుమారుడు నీళ్లు తీస్కుని రాగా ఆ నీళ్లలో బల్లి ఉండటాన్ని గమనించిన ఋషి, కుమారుడ్ని బల్లిగా మారమని శపిస్తాడు. ఈ బల్లిని ముట్టుకున్నా వారికి  బల్లి పడిన దోషం తొలగుతుందని ఆశ్వీరదీస్తాడు.

వైష్ణవ క్షేత్రం :
108 వైష్ణవ క్షేత్రాలలో ఈ క్షేత్రం మూడవది గా చెబుతారు. 
పేరుందేవి:
ఈ ఆలయం లో ఉన్న లక్ష్మీ దేవి పేరు పేరుందేవి. అమ్మవారు ఎప్పుడు ఆలయం విడిచి వెళ్లారట.. అందుకనే అమ్మవారికి జరిగే ఉత్సవాలు,ఊరెరిగింపు కూడా ఆలయం లోపలే జరుగుతాయి. 

ఆనందపుష్కరిణి :
పుష్కరిణి అంటే కోనేరు ప్రత్యేకంగా చెప్పడానికి అనుకుంటున్నారా? స్వామి వారి మూల విగ్రహన్ని  ఈ కోనేరులోనే ఉందటా.. ప్రతి నలభై సంవత్సరాలకు ఒకసారి బయటకు తీసి 40 రోజులు  దర్శనం చేస్కోవడానికి ఉంచుతారు. 2019 సంవత్సరం జూన్  లో బయటకు తీస్తారు. మనం అప్పుడు కాంచీపురం లో కలుసుకుందాం.
Click Here :
   
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

ఎక్కువమంది చదివినవి

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.