Drop Down Menus

భూలోక వైకుంఠం శ్రీ రంగనాథస్వామి ఆలయం, శ్రీరంగం - Srirangam Temple Guide | Tamil Nadu Famous Temples | Tamil Nadu Tour Guide


శ్రీరంగం 108 వైష్ణవ దివ్య క్షేత్రాలలో ఒకటి, కావేరి నది రెండుగా చీలగా కావేరి నది మధ్య ప్రదేశం లో ఉన్న క్షేత్రమే శ్రీరంగం. ఒకసారి ఈ క్రింది ఫోటో చూడండి. ఎత్తైన గోపురాలు మనకి అక్కడో పవిత్ర పుణ్యక్షేత్రం ఉందని.. మనల్ని ఆ గోపురాలు అయస్కాంతం లా లాగితే.. స్వామి వారు తన పాద పద్మములవైపు మనస్సును లాగుతారు. చుట్టూ పచ్చటి వాతావరణం .. చూడ్డానికి రెండు కళ్ళు సరిపోనట్టి ఎత్తైన గోపురాలు.. స్వామి వారి తేజస్సు..  ఉభయ కావేరి నది.. శ్రీరంగం నుంచి వదిలి రావాలంటే మనస్సు ఒప్పుకోదు. 



Sriranganadha Temple is located in Srirangam State of Tamilandu. 9 km From Tirucharapalli Junction ( Tiruchi ).
ఈ క్షేత్రం ఎలా వేళ్ళలో కాస్త వివరంగా చెప్తే బాగుణ్ణు అనుకుంటున్నారా? చెన్నై నుంచి 330 కిమీ దూరం లో ఉంది, దగ్గర్లో రైల్వే స్టేషన్ తిరుచనాపల్లి. మీరు తిరుచనాపల్లి వచ్చేస్తే అక్కడ నుంచి సుమారు 7కిమీ. 

How to Reach Srirangam Temple ( Tamilandu )?
7 km form Trichy , 330 km from Chennai, 
మీరు చెన్నై నుంచి బయలు దేరితే  తిరుచ్చి కంటే ముందే శ్రీరంగం స్టేషన్ వస్తుంది. తిరుచ్చి పెద్ద స్టేషన్ మీరు ఎక్కిన ట్రైన్ శ్రీరంగం లో ఆగుతుందో లేదో ముందే తెల్సుకోండి. సాదారణంగా అన్ని ట్రైన్ లు ఆగుతాయి.

కాని ఇక్కడ చాల తక్కువ సమయం ఆగుతాయి. మీరు ఫ్యామిలీ తో మరియు ఎక్కువ సామాన్లతో ఉంటే కనుక కంగారు లేకుండా తిరుచ్చి లోనే దిగండి. 
Sriraganm Railway Station Code ( IRCTC ): SGRM
ఈ ఫోటో చూడగానే నేను  చెప్పింది నిజమే అనిపిస్తుందా.. చాల చాల అందంగా ఉంటుంది .. ఈ బ్రిడ్జి అటువైపు శ్రీరంగం. 
అవును మనం శ్రీరంగం రైల్వే స్టేషన్ లోనే ఉన్నాం. 
మీరు గమనించారా ? ఏమిటి గమనించేది అనేగా . మరో సారి చూడండి. శ్రీరంగ నాదుడిని ఇక్కడే దర్శనం చేయిస్తున్నారు వీళ్ళు . చూసారా?
నాకు తెల్సండి.. డబ్బులు డ్రా చెయ్యాల .. ఇదిగో ATM .. స్టేషన్ ఎదురుగా ఏర్పాటు చేశారు. 
ఆ ... అర్ధమైంది .. స్టేషన్ నుంచి ఎలా వెళ్ళేది. ఎంతదూరం అనేగా? సుమారు 1 కిమీ ఉంటుంది. ఆటో కావాలో లేదా నాతో నడిచి వస్తారో మీ ఇష్టం. 


స్టేషన్ నుంచి బయటకు వచ్చి .. కుడివైపు అదేనండి రైట్ సైడ్ తిరిగితే మనకు ఈ బోర్డు కనిపిస్తుంది. మనకు దైర్యం వస్తుంది. సరైన రూట్ లోనే వెళ్తున్నాం అని. 
ఈ రోడ్డు మీదకి వచ్చిన తరువాత .. ఇప్పుడు ఎలా వెళ్ళాలి.. ఎవరినైనా అడుగుదామా అని ,అటు ఇటు చూస్తుంటే .. ఆ చిన్న మొక్క చాటునుంచి ఎత్తైన గోపురం కొద్దిగా కనిపిస్తుంది. ఒక్కసారిగా మనస్సులో ఏదో తెలియని ఫీలింగ్.. ఎస్ ఎస్ .. నేను చూడబోతున్నాను. 239 ( 73 meters  High 13- tiered) అడుగుల ఎత్తైన గోపురాన్ని నేను దగ్గర నుంచి చూడబోతున్నాను అని.. ముందుకి కదులుతాం . 

ఏవండోయ్ .. కాస్త చూస్కోండి .. మెయిన్ రోడ్ కదా .. గోపురాన్ని చూస్కుంటూ నడిస్తే ఎలా .. మీతో వచ్చినవాళ్లు వస్తున్నారా .. వెనకాల .. చూడండి ఒకసారి. 
ఆ గోపురాన్ని చూస్తుంటే మనకు తెలియకుండానే అందంతో ఒళ్ళు పులకరిస్తుంది. అబ్బ మనవాళ్ళు ఏమి కట్టారు. ఇది మనవాళ్ళ గొప్పతనం. ఇది నా దేశం... ఈ కట్టడాలకు వారసులం మనమంతా.. మన కట్టడాలను మన దేవాలయను పడకొట్టి.. నాలుగు కాసులను సంచులో వేస్కుని పోయినవాళ్ళ కోసం10 మార్కుల ప్రశ్నలు కంటస్తాం చేస్తాం.కాని వీటికోసం తెల్సుకోవడం చదువుకోవడం ముసలివాళ్ళ పని అని పక్కన పాడేశం ..
నడుస్తున్న కొద్ది దూరం దూరంగా వెళ్తుంది ఆ గోపురం. గోపురమే అలా వెళ్తుంటే . . ఇంకా నా స్వామి శ్రీరంగ నాధుడు ఎక్కడ ఉన్నాడో . 

తమిళనాడు బస్సు లు అవి.. జంబుకేశ్వరం శ్రీరంగం నుంచి 1 కిమీ దూరం లోనే ఉంది.   ఫోటో దగ్గర నుంచి తీస్కుందామని వస్తే ఇలానే ఉంటుంది. సగం సగమే పడుతుంది. 
శ్రీరంగం గోపురం ఆసియాలో పెద్ద గోపురాల్లో ఒకటి, దీని ఎత్తు 239 అడుగులు , 156 ఎకరాల విస్తీర్ణం లో నిర్మించారు.. 


మనకు వరుసగా గోపురాలు కనిపిస్తుంటాయ్ .. 
ఆ గోపురం తరువాతే గుడి ... 
అనుకుంటూ .. నడుస్తూంటే . .. గోపురాలు వస్తూనే ఉంటాయి. 

గోపురాలు చుట్టూ వీధులన్నీ .. షాప్ లతో నిండి ఉంటాయి.. ముందు దేవుడు కదా .. వచ్చేటప్పుడు వీటికోసం చూద్దాం :)




నేను కూడా ఈయన దగ్గర కొబ్బరికాయ కొన్నాను .. ఆ పువ్వులు తీస్కున్నాను .. కొబ్బరి కాయ మనలా వీళ్ళు కొట్టరు . 

ఆ కనిపించేదే చివరిది ... లోపలికి వచ్చేయండి .. 

అందరు ఒక్కసారిగా గోవింద .. గోవింద .. శ్రీరంగనాద .. గోవింద అంటూ రండి 


అర్ధమైంది అండి ... దర్శనం టికెట్స్ ఎక్కడ తీస్కోవాలి .. టికెట్స్ కంటే ముందు చేతిలోనే బ్యాగ్ .. చెప్పులు వీటిని ఎక్కడ పెట్టాలి అనేగా.. చెప్పులు ఆ ప్రక్కనే కుడివైపు ఇచ్చుకుంటున్నారు చూడండి .. బ్యాగ్ లు లోపలికి వెళ్ళగానే ఎడమ చేతివైపు ఉంటుంది , 5 రూపాయలు తీస్కుని ఉంచుతారు. సెల్ ఫోన్ లోపలికి తీస్కుని వెళ్ళవచ్చును. 




లోపలికి వచ్చాం కదా .. ఇంకా ఈ షాప్ లు ఏమిటి అనుకుంటే ఎలా .. 126 ఎకరాలు .. 
మన అదృష్టం కొద్ది ఇంగ్లీష్ లో బోర్డు లు కూడా పెట్టారు.. 






Aruanachalam To Srirangam :
అరుణాచలం నుంచి శ్రీరంగం సుమారు 190 కిలోమీటర్లు దూరం. అరుణాచలం నుంచి శ్రీరంగం వెళ్ళడానికి విల్లుపురం మీదగా శ్రీరంగం చేరుకోవచ్చును, శ్రీరంగం లో ఉండటానికి  దేవాలయం వారి రూమ్స్ ఉన్నాయి.  శ్రీరంగం ఆలయం వెబ్సైటు క్రింద ఇచ్చాను వారి సైట్ చూడండి. 
Accommodation in Srirangam Temple:
Srirangam Temple Website : http://srirangam.org/
Click Here for Accmmodation : http://srirangam.org/user/login.php?pid=2

"While we stayed at Sri Rangam Devasthanam Cottages;Sri Rangam; Tamilnadu. A very beautiful accommodation by Endowment accommodation and its rent is very normal. Thanks to Sri Jayalalitha"

- Mohan Reddy 
తరువాతి పోస్ట్ లో శ్రీరంగ నాధుడు శ్రీరంగం లో ఎలా వెలిశాడు.. శ్రీలంక వైపు శ్రీ రంగనాధుడు ఎందుకు చూస్తున్నాడు.. తెలుగు భాగవతాన్ని శ్రీరంగం లో ఎక్కడ చూడవచ్చు వాటికోసం తెల్సుకుందాం.
Srirangam Near by Famous Temples: 
ఈ క్రింది వాటిపై క్లిక్ చెయ్యడం ద్వార మీరు ఆయా క్షేత్ర విశేషాలు తెల్సుకోవచ్చును. 

మీ సలహాలను లేదా కావాల్సిన ఇన్ఫర్మేషన్ క్రింద కామెంట్ చెయ్యండి.

Keywords: Telugu Travel blog, Temple Information in telugu, Srirangam Temple Information in Telugu, Srirangam Temple Details, accommodation in sri rangam temple, srirangam surrounding temples information,
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

  1. I need your guid I am staying in Hyderabad
    I have a plan to cover Arunachlam, Srirangam, Janbulingam, chidambaram, madhurai & rameswaram
    how to plan
    my mail ID - akella69@gmail.com
    Pl. support me

    ReplyDelete
  2. 25-11-2016 sabarimala journy ofter i have plan to rameswaram,kanyakumari ext...how to plan

    ReplyDelete
    Replies
    1. from pamba you can take kerala rtc bus to Palani. 6 to 7 hrs journey. From then you can reach madhurai thereafter rameshwaram. We saw like this in previous year

      Delete
  3. The information is very useful while visiting these marvelous temples.

    ReplyDelete
  4. The information is very useful while visiting these marvelous temples.

    ReplyDelete
  5. The information is very useful while visiting these marvelous temples.
    I have plan to Arunachalam temple...how to plan

    ReplyDelete
  6. నాకు బంగారు బల్లి మరుయు వెండి బల్లి ఉన్న ఊరు మరియు గుడి, అక్కడికి ఎలా వేళ్ళలో చెప్పండి.

    ReplyDelete
    Replies
    1. kanchipuram lo untundi... meeru site lo kanchipuram ani search cheyandi information vastundi

      Delete
  7. రాజచంద్ర గారూ

    శ్రీరంగంలో మరి కొన్నాళ్ళు గడపాలి అనుకుంటున్న నాలాంటి వారికి కావలసిన, పనికొచ్చే సమాచారం ఇంత వివరంగా అందజేసినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు.

    శుభం
    రంగనాథ్

    ReplyDelete
  8. యాత్రీకులకు బహు ఉపయుక్తమైన సమాచారాన్ని ఎంతో వివరంగా అందజేస్తున్నందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
  9. చాలా బాగుంది మీ వివరణ. ధన్యవాదాలు.

    ReplyDelete
  10. చాలా ఉపయుక్తమయిన సమాచారము సర్,చాలా సంతోషం జమ్బుకేశ్వరాలయం
    గురించి కూడా ఇందులో ఉంటుందేమో నని చూసాను,కాని చాలా క్లుప్తంగా వుంది

    ReplyDelete
  11. Can I get itenary for all these places

    ReplyDelete
  12. Very nice information it is useful to everyone thank you very much sir

    ReplyDelete
  13. nice...…………….. good...……...thank you

    ReplyDelete
  14. Very nice it is useful to me thank you sir

    ReplyDelete
  15. ఆన్న మేము శ్రీరంగం to chidmbaram to రోజుల్లో అవుతుందా మల్లి మేము విశాఖప్నం వెళ్ళాలి మల్లి మేము ఎక్కడనుంచి ఏకడదనికి వెళ్లడానికి అవుతుందో కాస్త చెప్ప గలరా

    ReplyDelete

Post a Comment

FAQ'S

తిరుమల దర్శనం టికెట్స్ ఇతర సేవ టికెట్స్ ప్రస్తుతం ఆగస్టు నెల వరకు బుక్ అయ్యాయి . సెప్టెంబర్ నెలకు జూన్ నెలలో 18వ తేదీన విడుదల చేసే అవకాశం ఉంది

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.