Drop Down Menus

India's Tallest Top Ten Temple Gopurams

మనం చూసిన 5 ఎత్తైన గోపురాలు కూడా తమిళనాడు లోనే ఉన్నాయని గుర్తించారా ? తరువాత చూడబోయే 5 ఆలయాల్లో 4 తమిళ నాడు లోనివే. మీరు తమిళనాడు లోని ఆలయాలు అన్ని ఒక వరసలో చూసి వచ్చే విధంగా త్వరలో పోస్ట్ లు రాసి మీకు వివరిస్తాను. ఎలాగో facebook లో లైక్ చేశారు కదా ! లేదా పోస్ట్ లు అప్ డేట్స్ కావాలంటే hindutemplesguide@gmail.com కి మైల్ చేస్తే మీకు కొత్తగా పోస్ట్ లు చేసినప్పుడు మీకు మైల్ చేస్తాను. 
ఇంతక ముందు పోస్ట్ లో కూడా చెప్పాను. పూర్తి సమాచారం కావాలంటే హీడింగ్ పైన క్లిక్ చేస్తే దేవాలయాల పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. 

5th Tallest Gopuram in India
Ulagalantha Perumal Temple,Tirukoilur, Tamil Nadu, India
ఉలగలంతా పెరుమాళ్ అంటే మీకు అర్థమైందా ? వామన మూర్తిని తమిళం లో ఉలగలంతా పెరుమాళ్ అని పిలుస్తారు. కాంచీపురం లో అమ్మవారి గుడికి ఎదురుగా వామనమూర్తి గుడి ఉంటుంది. చూడకపోయి ఉంటే ఈ సారి వెళ్ళినప్పుడు స్వామి వారిని దర్శించి రండి. ఇక్కడ 17 అడుగుల వామనమూర్తి విగ్రహం మనం దర్శించవచ్చును. తమిళనాడు లో ఉన్న ఎత్తైన గోపురాల్లో నాల్గవది ఈ క్షేత్రం లోనే కలదు. ఇక్కడ గోపురం ఎత్తు 192 అడుగులు. ఇక్కడ నుంచి అరుణాచలం 35 కిలోమీటర్ల దూరం లో కలదు. 108 దివ్య క్షేత్రాలలో మరియు పంచ కన్నయ్య క్షేత్రాలలో ఈ క్షేత్రం ఒకటి. 
 4th Tallest Gopuram in India


తమిళనాడు రాష్ట్రా రాజముద్ర లో కనిపించే గోపురం శ్రీవిల్లిపుత్తూర్ ఆలయ గోపురమే. ఈ గోపురం ఎత్తు 193.5 అడుగులు.ఈ ఆలయం కోసం మీరు ఇక్కడ క్లిక్ చెయ్యండి. 
3rd  Tallest Gopuram in India


9వ శతాబ్దం లో శ్రీ కృష్ణ దేవయారాలు 216.5 అడుగుల ఎత్తైన గోపురాన్ని నిర్మించారు. ఈ ఆలయం లో ఉత్తర గోపురాన్ని అమ్మణి అమ్మాళ్ గోపురం అని పిలుస్తారు. అమ్మణి అమ్మాళ్ అనే ఆవిడ ఇంటింటా తిరిగి విరాళాలు సేకరించి  ఆలయ గోపురాన్ని నిర్మించింది. ఎవరైనా విరాళం ఇవ్వకపోతే బయట నిలబడి వారింటిలో ఏమూలన ఎంత డబ్బు ఉందో చెప్పేదట. ఆవిడ శక్తిని తెల్సుకుని విరాళం ఇచ్చారని చెబుతారు.అరుణాచలం సమాచారం తెల్సుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి

2nd Tallest Gopuram in India
మనమందరం మురుడేశ్వర ఆలయం ఎత్తైన గోపురం అనుకుంటాం. కానీ రెండవది 237.5 అడుగులు, 2008 లో నిర్మించారు. మురుడేశ్వర ఆలయ విశేషాలు కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
Tallest Gopuram in India
భారతదేశం లో ఎత్తైన గోపురాల్లో మొదటి స్థానం శ్రీరంగం లో ఉన్న శ్రీ రంగనాథస్వామి ఆలయ గోపురం. ఈ గోపురం ఎత్తు 239.5 అడుగులు. ఈ ఆలయ విశేషాలు ఇంతకుముందే పోస్ట్ చేసాను. ఒకేసారి మీ వేలుచూస్కుని చూడండి. ఇప్పుడే చదవాలానుకుంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి
మీరు మొదటి 10-6 ఆలయాల సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.  
మీకో అనుమానం రాలేదా ? తంజావూర్ ఆలయం, కోణార్క్ దేవాలయం కనిపించలేదేమిటాని .. గోపురం అంటే మనం దేవాలయం లోకి ప్రవేశించే ముందు కనిపించేవి. అదే ప్రధాన దేవాలయం ఐతే విమానం అని పిలుస్తాం. అర్ధమైంది కదా .. ఎత్తైన విమానాలు కలిగిన దేవాలయాలు త్వరలోనే పోస్ట్ చేస్తాను. ఒక్కరైనా కామెంట్ చేస్తే సంతోషం.

India Tallest Temple Information in telugu, Best Tempels information in hindu temples guide, Temple Accommodation details, Temple Timings, India Tallest Gopuram Temples list, hindu temples guide.
ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

Post a Comment