హంపి నుండి మా ప్రయాణం నేరుగా త్రిశైవ క్షేత్రాలో ఒకటి అయిన ఆత్మలింగ క్షేత్రం గోకర్ణంకు. (మిగతా రెండు కాశీ, రామేశ్వరం ) 2వ రోజు ఉదయం 4 గంటల కల్లా చేరిన మేము హోటల్ రూం తీసుకుని , స్నానాదులు ముగించుకొని 8గంటలకు ఆలయాని బయలుదేరి వెళ్ళిన మాకు ముందుగా వినాయకుడిని దర్శించుకోవాలని చెప్పడంతో బాలగణేశుడిని దర్శించుకొని ప్రధానాలయంలోకి వెళ్లే సరికికాస్త రద్దీగా ఉన్నప్పటికీ 1గంటలోనే అభిషేకం పూర్తి చేసుకొని బయటకు రావడంతోనే పూజారుల ద్వారా క్షేత్రం లో పిండప్రదాన ప్రాధాన్యత తెలుసుకొని మిత్రులతో కోటితీర్థం వెళ్ళాము. (గుడి నుండి అరకిలోమీటర్) ఇక్కడ గడిలోనూ, కోటితీర్థం దగ్గర తెలుగు మాట్లాడే పూజారులు ఉన్నారు, కాబట్టి ఇబ్బంది పడలేదు. మా పిల్లలు మాత్రం సరదాగా బీచ్ వైపు వెళ్ళారు. ఇక్కడ నుండి మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరిన మేము సమయాబావం వలన కొల్లూరు మూకాంబిక ఆలయానికి వెళ్ళగలమా లేదా అనుకుంటూనే మురుడేశ్వర్ బాట పట్టాము.
Gokarnam Temple Information in Telugu
Comments
Post a Comment