Drop Down Menus

Famous Temples In West Bengal | HINDU TEMPLES GUIDE

నేటి బెంగాల్ ఆలోచన రేపటి భారత్ ఆలోచన అనే నానుడి కలదు . బెంగాల్ రాష్ట్రము నుంచి ఎందరో ప్రముఖులకు జన్మస్థానం . వారు రామకృష్ణ పరమహంస , స్వామి వివేకానంద , భక్తివేదాంత ప్రభుపాద , చైతన్య మహాప్రభూ , అమర్త్యసేన్ , రవీంద్రనాధ టాగూరు, బి.సి రాయ్ , జగదీశ్ చంద్రబోస్ ,  నేతాజీ సుభాస్‌చంద్ర బోస్ , గంగూలీ , సత్యజిత్ రే , లియాండర్ పేస్ మొదలైన వారు . పశ్చిమ బెంగాలీల ప్రధాన భాష బెంగాలీ .  

డార్జిలింగ్ , హుగ్లీ, కోల్‌కత ప్రధానమైన జిల్లాలు . 
కోల్ కత ( kolkata ) లో చూడాల్సినవి : 
కాళీ మాత ఆలయం , దక్షిణేశ్వర కాళీ మాత ఆలయం , శాంతినికేతన్ , బిర్లా మందిరం . 

మనకి శక్తి పీఠాలు 18,51,108 గా చెబుతారు . పశ్చిమ బెంగాల్ లో 51 శక్తి పీఠాల్లో 13 శక్తి పీఠాలు ఇక్కడ కలవు . అవి వరసగా క్రింద ఇవ్వడం జరిగింది. ఆ ఆలయాల గురించి విడివిడిగా తరువాత తెల్సుకుందాం . 
 పశ్చిమ బెంగాల్ రాష్ట్రము లో  శక్తి పీఠాలు  
1) భ్రామరీ ఆలయం ( 51 శక్తి పీఠాల్లో ఒకటి , జల్పాయ్ గురి - సాల్ బాది గ్రామం ) 
2) కుమారీదేవి ఆలయం ( 51 శక్తి పీఠాల్లో ఒకటి , హుగ్లీ జిల్లా ఖానాకుల్ లో ఉంది )
3) మహిషాసుర మర్ధిని ( 51 శక్తి పీఠాల్లో ఒకటి, బీర్భూమి జిల్లా  బక్రేశ్వర్ లో కలదు. బ్రహ్మగుండం కలదు వేడి నీటి బుగ్గలు కలవు  )  
4) తారాదేమి ఆలయం ( 51 శక్తి పీఠాల్లో ఒకటి అమ్మవారి కళ్ళు పడిన ప్రదేశం , బిర్బమ్ జిల్లాలో తారాపిత్ లో ఉంది )
5 ) యోగాధ్యాదేవి ( 51 శక్తి పీఠాల్లో ఒకటి బార్ధ్వాన్ జిల్లాలో ఖీర్ గాం దగ్గర కలదు )
6) మంగళచండిక ( 51 శక్తి పీఠాల్లో ఒకటి ,  బార్ధ్వాన్ జిల్లాలో ఉచానీ దగ్గర కలదు ) 
7 ) నతాటేశ్వరి ఆలయం ( 51 శక్తి పీఠాల్లో ఒకటి , భీర్భూమ్ జిల్లాలో నల్హోటి లో కలదు ) 
8 ) విమలాదేవి ( 51 శక్తి పీఠాల్లో ఒకటి, మార్షిదాబాద్ జిల్లాలో కిరీటకోన లో ఉంది ) 
9 ) కాపాలినీ దేవి ( 51 శక్తి పీఠాల్లో ఒకటి , మిడ్నపూర్ దగ్గర తాంలుక్ సమీపాన విభాస దగ్గర ఉంది ) 
10 ) బహుళ దేవి ఆలయం ( 51 శక్తి పీఠాల్లో ఒకటి , బర్ధ్వాన్ జిల్లా కటువా లో కలదు )
11)  గర్భాదేవి ఆలయం ( 51 శక్తి పీఠాల్లో ఒకటి , భీర్భూమ్ జిల్లా భోల్పూర్ దగ్గర కలదు )
12 ) నందికేశ్వరి దేవి ఆలయం ( 51 శక్తి పీఠాల్లో ఒకటి , భీర్భూమ్ జిల్లా లో నందీపూర్ దగ్గర కలదు ) 
13 ) పుల్లారాదేవి (51 శక్తి పీఠాల్లో ఒకటి , బర్దవాన్ జిల్లాలో అట్టహాస్ దగ్గర కలదు ) 

 పశ్చిమ బెంగాల్ లో ప్రసిద్ధ ఆలయాలు :  
1) రామకృష్ణ మఠం బేలూరు 
2) విష్ణుపూర్ లో కృష్ణభగవానుని ఆలయం , లాల్ జి ( రాధా కృష్ణులు ) ఆలయం . 
3) డైమండ్ హార్బర్ ( గంగ సాగర సంగమ ప్రదేశం )
4) బారక్ నాధ్ (శివాలయం , వేడి నీటి బుగ్గలు కలవు ) 
5) త్రిపుర సుందరీదేవి ఆలయం ( పరగణాల జిల్లా బోరల్ లో ఉంది . ఇక్కడ అమ్మవారి పాదాల చెంత బ్రహ్మ , విష్ణు , మహేశ్వరుల విగ్రహాలు ఉన్నాయి )

6 ) శ్రీ ఏకపాదేశ్వర్ ( శివుడు ఒక్క పాదం తోనే ఉంటాడు . ఈ ఆలయం బంకురా జిల్లాలో బంకురా కు దగ్గర్లో కలదు )
7 ) తారకేశ్వర్ ( హూగ్లీ జిల్లాలో పండాలే గ్రామం లో ఉంది . ఈ ఆలయం శివాలయం గుండె జబ్బులు తగ్గుతాయని విశ్వాసం ) 
8 ) వైద్యనాథ ధామ్ - ( జ్యోతిర్లింగ క్షేత్రం పర్లీ లో ఉంది ) 
9) హూగ్లీ ( ప్రాచీన రాధా కృష్ణ ఆలయాలు కలవు )

10 ) టెర్రాకోట్ ఆలయాలు ( మట్టితో చేసిన గోడలను కాల్చడం తో ఇటుకల స్వభావం వచ్చాయి . , బంకురా జిల్లాలో టెర్రాకోట్ లో కలవు )
11 ) ధర్మరాజు ఆలయం ( బరద్వాన్ జిల్లాలో బరద్వాన్ లో కలదు ) 

12) ముక్త త్రివేణి ( నాదియ జిల్లా లో బన్సూ బేరియా లో కలదు )

13 ) అదితి దేవి ( దేవతల తల్లి  , మిడ్నపూర్ జిల్లాలో తామ్ లుక్ లో ఆలయం కలదు ) 


14 ) చండనేశ్వర ఆలయం ( శివాలయం , డిఘాకు 8 కిమీ దూరం లో ఉంది )


15 ) ధిర్ ధామ్ ఆలయం ( శివాలయం , పుశుపతి నాధ ఆలయాన్ని పోలి ఉంటుంది . డార్జిలింగ్ లోని టాయ్ రైల్వేస్టేషన్ దగ్గర ఉంటుంది ) 

108 Shiva Temple Kalna

Baps Toronto Mandir
Belur Math Temple Built by Swami Vivekananda

Dakshineswar Kali Temple kolkata

West Bengal  Kolkata  Kalighat Kali Temple

Mahakal-Mandir-Temple

Kiriteswari Hindu Temple.

Ramakrishna Mission Ashrama, Asanso

Tamluk Bargabhima Temple

Taraknath Temple in Tarakeshwar

Related Postings :
Famous Temples in West Bengal State, Top famous Temples in West bengal, Famous temples in Westbengal, Temple tour, Tours in temple Guide, Temples Information in Telugu, State wise Famous Temple list, 108-shiva-temple-kalna, BAPS Toronto_Mandir, Belur math temple built by Swami Vivekananda honouring his Master , Dakshineswar-Kali-Temple-kolkata, India  West Bengal  Kolkata  Kalighat Kali Temple, Mahakal-Mandir-DarjeelingRamakrishna Mission Ashrama, Asanso, Tamluk Bargabhima Temple Faomus Indian Temple  Shiva., Taraknath Temple in Tarakeshwar, West Bengal Kiriteswari Temple is a Famous Hindu Temple, Temples Details information in Hindu temples guide.com
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.