Drop Down Menus

Karnataka Sringeri Sharada Mutt Information

Karnataka Sringeri Sharada Mutt

ఆది శంకరాచార్యులు వారు దేశ సంచారం చేస్తున్న సమయంలో తొలి మఠాన్ని ఇక్కడ స్థాపించడంతో ఈ శృంగేరి చారిత్రకంగా ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. శృంగేరిలో ఉన్న ఈశంకర మఠాన్నిదక్షిణామ్నాయ మఠం అని కూడా అంటారు. శృంగేరి కర్ణాటక రాష్ట్రం చిక్ మంగళూరు జిల్లాలోని తుంగభద్ర నది ఒడ్డున కలదు. 

శృంగేరి అనే పేరు ఋష్య శృంగగిరి నుండి వచ్చిందని చెబుతారు.శృంగేరి మఠం బారతదేశంలో  ఆర్థికంగా మిక్కిలి ఎక్కువ భాగ్యవంతమైనది.మఠాధికారిని జగద్గురువు అంటారు. ప్రత్యేకమైన సమయాలలో వారు అమూల్యమైన వజ్రాలతోను,ముత్యాలతోను పొదిగిన కిరీటాన్ని ధరిస్తారు. దీనిని పూర్వం మహారాష్ట్ర రాజుల వద్ద ముఖ్య మంత్రులైన పీష్వాలు బహుకరించారు పచ్చని పతకంతో ముత్యాలహారం కూడా ఇచ్చారు. మఠానికి చెందిన గ్రంధాలయంలో అచ్చుకాని సంస్కృతం వ్రాత గ్రంధాలు అనేకం ఉన్నాయి. ఇవి చాలా అమూల్యమైన గ్రంధాలు. నేడు పీఠాధిపతిగా ఉన్న జగద్గురువు శ్రీ అభినవ విద్య తీర్థ మహా స్వామి వారు ఈ గ్రంధాలను ప్రచురించడానికి తగిన ఆర్థిక సహాయం చేస్తున్నారు. పవిత్రమైన తుంగానది తీరం మీద శ్రీ శారదాదేవి విగ్రహాం ప్రతిష్టాపించిన ప్రదేశంలో ఒక త్రాచుపాము పడగ విప్పి సూర్యుని వేడి తగలకుండ పిల్లలను పెడుతున్న ఒక కప్పను సంరక్షిస్తుంది. పరస్పర వైరుధ్యం ఉండవలసిన చోట అత్యంత ఆదరాభిమానాలు వర్ధిల్లుచున్న ఆ పవిత్ర ప్రదేశమే అనువైన చోటని శ్రీ శంకరాచార్యులు వారు శారదాదేవి పీఠాన్ని శృంగేరిలో స్థాపించారు. తుంగానది తీరమును శ్రీ చక్రాన్ని చెక్కి దానిపై శారదాదేవి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ శృంగేరి శారదా పీఠానికి మొట్ట మొదటి  అధిపతిగా నియమింపబడిన శ్రీ సురేశ్వర చార్యులు వారు శంకరా చార్యులు వారి శిష్యుడు. శంకరా చార్యులు వారు శిష్యుడైన సురేశ్వరా చార్యులకు  చంద్రమౌళీశ్వర లింగాన్ని,ఒక గణపతి విగ్రహాన్ని ఇచ్చారు. ఆనాటి నుండి ఏళ్ల తరబడి నేటి దాకా  పవిత్రమైన ఆధ్యాత్మిక ప్రగతిలో ఈ వేదాంత సామ్రాజ్యం వర్థిల్లుతుంది.


Sringeri Address:
Sringeri Mutt,
Sringeri,
Chickmagalur District,
Karnataka,
Pin -577139.

Sringeri Google Map.

Click Here.

ఈ లింక్స్ పై క్లిక్ చేయండి :

Places To Visit In Sringeri:
> Adi shankhara Temple
> Rishyasringa Maharshi Temple
> Vidya Shankara Temple
> Sri Balasubrahmanya Temple
> Chittemakki Mallikarjuna Temple


sringeri mutt details, telugu information in sringeri mutt, sringeri matham information, saradadevi peetham information, telugu information in saradadevi peetam, history of sringeri, sringeri mutt pdf file, famous temples in sringeri.
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

ఎక్కువమంది చదివినవి

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.