Drop Down Menus

Varadaraja Perumal Temple Kanchipuram Golden and Silver Lizard history

కాంచీపురం వెళ్ళినప్పుడు అందరు తప్పకుండా బంగారు బల్లి ని తాకి వస్తారు ఆలా ఎందుకు చేస్తారు ఆ స్థలపురాణం ఏమిటో ఇప్పుడు చూద్దాం . ప్రతి ఇంట్లో బల్లులు వుంటాయి. అయితే ఇవి పైన పడితే దోషనివారణకు కంచి క్షేత్రం వరదరాజపెరుమాళ్‌ ఆలయంలోని బంగారుబల్లి, వెండి బల్లిని తాకాలి. వీటిని తాకితే ఆ దోషాలు వెళ్లిపోతాయని పెద్దలు చెబుతారు. దీనికి సంబంధించిన పురాణగాథ‌ ప్రకారం గౌతమ మహర్షి వద్ద ఇద్దరు శిష్యులు వుండేవారు. నదీ తీరానికి వెళ్లి నీటిని తీసుకువచ్చే సమయంలో కుండలో బల్లి పడిన విషయాన్ని గుర్తించలేదు. అనంతరం దీన్ని చూసిన గౌతమమహర్షి వారిని బల్లులుగా మారిపొమ్మని శపించాడు. శాపవిముక్తి కోసం వారు ప్రార్థించగా కాంచీపురంలోని వరదరాజపెరుమాళ్‌ ఆలయంలో లభిస్తుందని ఉపశమనం చెప్పాడు. దీంతో వారు పెరుమాళ్‌ ఆలయంలోనే బల్లుల‌ రూపంలో వుండి స్వామివారిని ప్రార్థించారు. కొన్నాళ్లకు వారికి విముక్తి కలిగి మోక్షం లభించింది. ఈ సమయంలో సూర్య,చంద్రులు సాక్ష్యులుగా ఉన్న  బంగారు, వెండి రూపంలో శిష్యుల శరీరాలు బొమ్మలుగా వుండి భక్తులకు దోషనివారణ చేయమని ఆదేశిస్తాడు. బంగారు అంటే సూర్యుడు, వెండి అంటే చంద్రుడు అని కూడా అర్థం.  సరస్వతీ దేవీ నుంచి శాపవిముక్తి పొందిన ఇంద్రుడు పెరుమాళ్‌ ఆలయంలో దీనికి గుర్తుగా ఈ బల్లి బొమ్మలను ప్రతిష్టించినట్టు మరో కథనం కూడా వ్యాప్తిలో వుంది.


Varadaraja Perumal Temple Timings:
Morning Hours: 6a.m - 12p.m
Evening Hours: 4.30p.m - 8.30p.m

Related Postings:

> Arunachalam/Tiruvannamalai Temple information

> Chidambaram Thilai Nataraja Swamy Temple History

> Jambukeswaram Temple History

> Kanchipuram Temple Information

> Madurai Temple History

> Mahabalipuram Temple Information

> Palani Temple Information

> Rameswaram Temple History


kanchi temple information in telugu, kanchi bangaru balli information in telugu, kanchi golden lizard history, kanchi, varadaraja perumal temple, bangaru balli information in telugu, gold lizard information in telugu, hindu temples guide.
ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments