Drop Down Menus

Kailasa Manasa Sarovara Yatra | 11 Days Trip Cost Accommodation Route Details


మలుపు మలుపుకో అందం-హిమాలయాలలో శివలీలామృతం
కైలాస మానస సరోవరం:

కైలాస పర్వత పాదపీఠంలో మానస సరోవరం మరో అపురూప సృష్టి, స్వచ్ఛతకు ఈ సరస్సు నిలువుటద్దం. మానస సరోవరం నుండి కైలాస పర్వతాన్ని దర్శించుకోవచ్చు . మానస్ అంటే మనస్సు,  బ్రహ్మ తన మనస్సు తో ఈ సరోవరాన్ని ఆది దంపతులకోసం సృష్టించాడని పురాణకథనం. 
మంచు కొండల్లో వెండి వెన్నెల అతీంద్రియ మహాశక్తులు అంతుపట్టని వెలుగు దివ్వెలు సముద్రమట్టానికి 22,672 అడుగుల ఎత్తులో సైన్స్ కు అందని అసాధారణ వ్యవస్థ పరమశివుని ఆవాసం ఈ భూమి మీదే ఉంది.  టిబెట్ భూభాగం లో ఉన్న హిమాలయ పర్వత శ్రేణుల్లో ఈ కైలాస పర్వతం ఉంది. ఆసియాలో పొడవైన నదులుగా పేరుగాంచిన బ్రహ్మపుత్ర , సట్లెజ్ మూలాలు ఇక్కడే ఉన్నాయి. 

కైలాసం మాములు పర్వతం కాదు. హిమాలయాల్లో ఏ పర్వతానికి లేని అద్భుతాలు ఇక్కడ ఇక్కడ కనిపిస్తాయి.  కైలాస పర్వతం నాలుగువైపులా నాలుగు రూపాల్లో దర్శనం ఇస్తుంది. కైలాసపర్వతాన్ని దర్శించే ప్రతి భక్తునకు ఒక విచిత్రమైన అనుభూతి కలుగుతుంది. 


లయకారుడైన శివుడు ఈ కైలాస పర్వత శిఖర భాగాన నివసిస్తాడు. పార్వతీ సమీతుడై నిరంతరం  ధాన్యముద్రలో ఉంటాడు. విష్ణుపురాణం ప్రకారం కైలాస పర్వతం ప్రపంచానికి పునాది వంటిది. తామరపువ్వు ఆకారం లో గల ఆరు పర్వతాల మధ్యలో కైలాసం ఉంటుంది. కైలాస పర్వత నాలుగు ముఖాలు స్పటిక, బంగారం , రుబి , నీలం రాయలతో రూపొందించినట్లు విష్ణు పురాణం చెబుతుంది. అందుకే పర్వత  నాలుగు వైపులా  నాలుగు రూపాలలో గోచరిస్తుంది. 

మంచుతో పూర్తిగా కప్పబడిన పూర్ణమి నాటి రాత్రి వెండి కొండలా మిలమిల మెరిసే కైలాస దర్శనం అత్యద్భుతం, అమోఘం , రమణీయం. 

యాత్రకు బయలుదేరేముందు : 

1) యాత్రకు బయలుదేరే 30 రోజులు ముందు physical fitness certificate పొందాలి. 
2) ఆస్తమా గుండె జబ్బులు మరియు బైపాస్ సర్జరీ చేయించుకున్నవారు ఈ యాత్రకు అనుమతించారు. 
3) పాసుపోర్టు తప్పనిసరిగా ఉండాలి
4) యాత్రకు వీసా కంపెనీ వారు ఏర్పాటు చేస్తారు .. ( మిమ్మల్ని తీస్కుని వెళ్లే ట్రావెల్స్ వారు )

మానస సరోవర యాత్ర అనుకూల  సమయం :
ప్రతిసంవత్సరం మే నుంచి సెప్టెంబర్ వరకు 

Touch Kailash  ట్రావెల్స్ ఆధ్వర్యం లో  మే 1 నుంచి 11 వరకు మానస సరోవర యాత్ర వివరాలు :   
11 Days Trip : Kailasa Yatra By  Helicopter  VIA Lucknow. 

Route:
Lucknow- Nepalgunj- Simikot- Hilsa- Taklakot- Lake Manasarovar- Kailash return the same way.

11 days trip Details : 

01/05/2017: LUCKNOW ARRIVAL THEN DRIVE TO NEPALGUNJ
02/05/2017: FLY TO SIMIKOT OVERNIGHT STAY
03/05/2017: SIMIKOT - HILSA (BY HELICOPTER) THEN ENTRY TAKLAKOT (TIBET)
04/05/2017: REST IN TAKLA KOT FOR ACCLIMATIZATION
05/05/2017: TAKLAKOT TO LAKE MANSAROVAR
06/05/2017: DRIVE, MANASAROVAR TO YAMA DWARA- THEN TREK TO DERAPHUK:
07/05/2017: DERAPHUK TO ZUTUPHUK
08/05/2017: END TREK THEN DRIVE BACK TO PURANG/ TAKLAKOT
09/05/2017: TAKLAKOT- HILSA- SIMIKOT
10/05/2017: FLY TO NEPALGUNJ
11/05/2017: Drive Nepalgunj TO Lucknow
లక్నో నుంచి బయలుదేరే  ఒక్కొక్కరికి  1,60,000 / - , హైద్రాబాద్ లేదా వైజాగ్ నుంచి వెళ్లే వారికీ 1,75,000 ఖర్చు అవుతుంది. 

అదనపు  సమాచారం కోసం ట్రావెల్స్ వారిని సంప్రదించండి :
Touch Kailash ,
M . V. Ramana,  
Cell Number :  9000701888 , 9948208195
Office Address :
Touch Kailash,
Plot no 148, 1st floor ,
TKR "X" Road,
Mytripuram, Karmanghat,
Hydrabad - 79. 

kailasa yatra details , kailasa tour details , manasa sarovara yatra details in telugu , famous lord shiva temples , touch kailash details , temple information in telugu , telugu travel blog , 
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.