Drop Down Menus

Sri Talupulamma Thalli Temple Information | Timings Accommodation


తలుపులమ్మ లోవ... తూర్పు గోదావరి జిల్లా, తుని పట్టణానికి సమీపాన ఉన్న ప్రాచీన దేవస్థానం. తీగ కొండ, ధార కొండ...అనే రెండు గిరుల నడుమ రాతినే ఆలయంగా చేసుకుని అమ్మ కొలువైంది. మధ్యలో తలుపులమ్మ, ఒకవైపు సోదరుడు పోతురాజు...మరోవైపు అమ్మవారి ప్రతిరూపం! ఇలా భక్తులకు కనులవిందుగా దర్శనమిస్తారు. 

Temple History: 
లలితాంబికాదేవి మరో రూపమే తలుపులమ్మ తల్లి అని భావిస్తారు. కృతయుగంలో అగస్త్య మహర్షి అమ్మవారిని ఇక్కడ పూజించినట్టు పురాణ కథనం. పర్వతరూపుడైన మేరువు తన శరీరాన్ని పెంచుకుంటూ పొతాడు. అలా, సూర్యభగవానుడి రథ మార్గానికి అడ్డుతగిలేంతగా పెరుగుతాడు. అదే కనుక జరిగితే అల్లకల్లోలమే. మహర్షులూ దేవతలూ ఆ పరిస్థితిని గమనిస్తారు. అగస్త్య మహాముని అంటే మేరువుకు మహాగౌరవం. దీంతో రుషులంతా అగస్త్యుడిని అశ్రయిస్తారు. ఎలాగైనా మేరువు రూపాన్ని తగ్గించమని మొరపెట్టుకుంటారు. అగస్త్యుడు ఆ కోరికను మన్నిస్తాడు. మహర్షిని చూడగానే మేరువు శిరసు వంచి నమస్కరిస్తాడు. ‘ఓ మేరునగధీరుడా! నేను తీర్థయాత్రలకు వెళ్తున్నా. తిరిగి వచ్చేంతవరకూ అలానే శిరసు వంచుకుని ఉండగలవా...’ అని అడిగాడు అగస్త్యుడు. మేరువు కాదంటాడా? ‘శిరోధార్యం!’ అంటూ దించిన తల ఎత్తలేదు. అతనిపై నుంచి నడుచుకుంటూ అగస్త్యుడు యాత్రలకు బయల్దేరతాడు. మహర్షి మార్గశిర బహుళ అమావాస్యనాడు కీకారణ్యంలోంచి ప్రయాణిస్తుండగా... సంధ్యాసమయం సమీపిస్తుంది.

 ఆహ్నిక విధుల కోసం జలవనరులేమైనా ఉన్నాయేమో అని వెదుకుతాడు. ఆ జాడే కనిపించదు. వెంటనే పాతాళ గంగను ప్రార్థిస్తాడు. గంగ పర్వత శిఖరాల మీద పెల్లుబికి ఒక లోయగుండా ప్రవహిస్తుంది. అగస్త్యుడు నిర్విఘ్నంగా సంధ్యావందనాన్ని పూర్తిచేసుకుంటాడు. అమాస చీకటి కమ్ముకోవడంతో, రాత్రికి అక్కడే విశ్రమిస్తాడు. గాఢనిద్రలో ఉండగా...కొండలోయలో దివ్య కాంతి ప్రసరిస్తుంది. వెనువెంటనే, జగజ్జనని లలితాంబికాదేవి ప్రత్యక్షం అవుతుంది. శిష్టరక్షణే ధ్యేయంగా తానీ ప్రాంతంలో సంచరిస్తున్నానని చెబుతుంది. ఆయురారోగ్యాలు ప్రసాదించే తల్లిగా ఇక్కడే కొలువుదీరమని వేడుకుంటాడు అగస్త్యుడు. కాలక్రమంలో ‘లోయ’ అన్నమాట ‘లోవ’గా మారింది. తలంపులను తీర్చే తల్లిగా, తలుపులమ్మగా అమ్మవారు పేరుతెచ్చుకున్నారు. ఇదీ స్థల పురాణం.



భక్తుల నమ్మకం:
తలుపులమ్మను ప్రయాణ అధిదేవతగా భావిస్తారు. ఆలయానికి కిలోమీటరు దూరం నుంచే వాహనాల రిజిస్ట్రేషన్‌ నంబర్లు రాళ్ల మీదా పరిసర నిర్మాణాల గోడల మీదా కనిపిస్తూ ఉంటాయి. ఎవరైనా కొత్త వాహనం కొంటే అమ్మవారి సన్నిధిలో బండి పూజ చేయించాల్సిందే. లారీ డ్రైవర్లకైతే మరింత నమ్మకం. పలు లారీలమీద అమ్మవారి పేరు కనిపిస్తూ ఉంటుంది. ప్రమాదాల నుంచి వాహనాల్నీ వాహన చోదకుల్నీ తలుపులమ్మ తల్లి కంటికి రెప్పలా కాపాడుతుందని ఓ నమ్మకం. కొందరైతే కొండ మీద ఎత్తయిన ప్రాంతాల్లో వాహనాల నంబర్లు రాయిస్తుంటారు. ఎంత ఎత్తున రాస్తే, తల్లి అంత ఎత్తుకు తీసుకెళ్తుందని విశ్వాసం. మరో విశేషం ఏమిటంటే, తీగ కొండ-ధార కొండల మధ్య నిత్యం పాతాళం నుంచి వచ్చే నీరే భక్తుల దాహార్తిని తీరుస్తుంది. ఏటా పది నుంచి పదిహేను లక్షల మంది ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటారు. దేవస్థానం దగ్గర ఏర్పాటు చేసిన సుమారు 50 అడుగుల అమ్మవారి విగ్రహం భక్తుల్ని ఆకర్షిస్తుంది. ప్రధాన ఆలయం దగ్గరున్న సుమారు 40 అడుగుల ఈశ్వరుని విగ్రహమూ చూపు తిప్పుకోనివ్వదు. ప్రసాదంగా ఇచ్చే గోధుమ రవ్వ లడ్డూ ఇక్కడి ప్రత్యేకత.



Contact us:
The Executive Officer
Sri Talupulamma Ammavari Temple, Lova,
Tuni Mandal
East Godavari District
Andhra Pradesh
Pincode : 533401
Phone No:9492671091
Click here: Accommodation Details

HOW TO REACH:
Sri Talupulamma Ammavari Devasthamam is located 70 Km from Kakinada, 106 Km from Rajahmundry, and 176 Km from Amalapuram (via Rajahmundry) and 8 km from Tuni. The temple is situated about 6 Km adjacent to NH-5 and about 8 Km from Tuni Railway station. And from there only bus transportation is available and that too special. The nearest railway stations are Tuni and Annavaram. One must make sure that the trains stop here as this is a two way broad gauge route and most of the trains are super fast. Though one can travel by road with a lot of options available. 

Surrounding Temples:

> Annavaram Temple History

> Draksharamam Temple Information

> Sri Kumararama Bhimeswara swamy Temple History in Telugu

> Tholi Tirupathi Sri Srungaravallabhaswamy Temple

> Sri Nookambhika Ammavari Temple Anakapalli

             


Talupulamma love temple information in telugu, talupulamma temple, lova, talupulamma lova temple history in telugu, talupulamma lova temple timings, accommodation lova temple, Talupulamma lova temple, Lova temple, tuni temples, tuni temple talupulamma lova, hindu temples guide.
ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

Post a Comment

FAQ'S

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.