Drop Down Menus

Kukke Subramanya Swamy Temple Information | Accommodation Festivals


మట్టిని ప్రసాదంగా ఇచ్చే ఆలయం 

మృత్తికా ప్రసాదం.అంటే దేవాలయంల్లో ప్రసాదరూపంగా మట్టిని ఇస్తారు .ఇది వింటే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. అన్ని దేవాలయాల్లో ప్రసాదంగా భక్తులకు విభూది, కుంకుమ, చందనం తదితరాలను ఇస్తే నుదిటికి పెట్టుకోవచ్చు.

ఒక వేళా పండ్లు లేదా తినే పదార్ద్దాన్ని ఇస్తే తినవచ్చు. అయితే ప్రసాద రూపంగా వచ్చే మన్ను  తినేoదుకు అవకాశం  ఉండదు . అలా అని దాన్ని పడేసేందుకు మనస్సు ఒప్పుకోదు. అటువంటి సందర్భంలో ఎం చేయాలో మనస్సుకు తోచదు. మృత్తికా ప్రసాదంతో మనకు ప్రయోజనం ఏమిటి . ఆ ప్రసాదాలను ఎం చేయాలి అనేది . ఇక్కడ చూద్దాం

మీరు ఎప్పుడైనా కర్నాటక లోని  కుక్కే సుబ్రమణ్యస్వామి  దేవాలయానికి వెళ్ళితే అక్కడి  దేవాలయంలో భక్తులకు" వల్మీక మృత్తికా" అంటే పుట్ట మన్ను ప్రసాదరూపంలో అందిస్తారు.

ఉడిపి సమీపంలో ఉన్న నాగబనగహళ్లి పట్టణంలో  ఉండే  శ్రీ సుబ్రమణ్య దేవాలయంలో  మీకు పుట్ట మన్నును ప్రసాదరూపంలో ఇస్తారు. ఈ ప్రసాదాలను ఏమి చేయాలో యోచించేoతలోనే చేసే పనులతో ఈ విషయాన్నీ మీరు మరచి పోతారు.

 * మృత్తికా ప్రసాదం అత్యంత పవిత్రమైంది .ఈ ప్రసాదాన్ని ఎలా వినియోగించుకోవాలో..దాని వల్ల  ఉపయోగం ఏమిటో  తెలుసుకుందాం. 

01. మృత్తికా ప్రసాదాన్ని ఎవరు ధరిస్తారో వారికీ నాగుల భయం ఉండదు. నాగ దేవతల అనుగ్రహం ఉంటుంది.

02. ఎవరైతే పాములను చూసి చాలా భయపడతారో, ఎవరికైతే కలలో పాములు ఎక్కువుగా కనబడుతుంటయో అటువంటి వారు మృత్తికా ప్రసాదాన్ని ధరిస్తే సర్పాల భీతి తొలగిపోతుంది.

03. ఆడ పిల్లలు ఎవరైతే ఎంత మంది పెళ్లి కొడుకులు వచ్చిన వివాహానికి ఒప్పుకోరో అటువంటి ఆడ పిల్లలు లేదా అబ్బాయులు పెళ్లి చూపులకు వెళ్ళే సమయంలో శ్రీ సుబ్రమణ్య స్వామిని ధ్యానించి ఒక చిటిక మృత్తికాను మరో చిటిక పసుపును స్నానం చేసే సమయంలో వేడినీరు కాచే పాత్రలో వేసి తరువాత స్నానం  చేయాలి. తరువాత శుబ్రమైన వస్త్రాన్ని కట్టుకొని దేవునికి నేతి దీపాన్ని వెలిగించి ప్రార్ధన  చేస్తే వివాహం త్వరగా అవుతుంది.

04. ఎవరైతే అర్ధం పర్ధం లేకుండా ఎక్కువగా మాట్లడుతుంటారో అటువంటి వారికీ కొబ్బరి నూనెలో ఒక చిటికె మృత్తికాను వేసి తల దువ్వుకొంటె ఎక్కువ మాట్లాడకుండా ఉంటారు. అలాగే సమాజంలో మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకొంటారు.

05. ఏ పిల్లలకైతే బాలగ్రహ దోషాలు ఉంటాయో చాల ఎక్కువుగా పళ్ళను కోరుకుతుండటం, కింద పడి కొట్టుకోవడం, ఒకే వైపు తదేకంగా చూస్తూ ఉండడం, అదే పనిగా ఏడుస్తూ ఉండడం, సన్నబడుతూ ఉండడం తదితరాలు ఉంటె మృత్తికాను తీసుకొని శ్రీ సుబ్రమణ్య స్వామిని ధ్యానించి పిల్లల నుదిటికి పెడితే వారు ఆరోగ్యంగా ఎదుగుతారు.

06. పిల్లలు ఆరోగ్యం సరిగా లేకుండా పదే పదే అనారోగ్యానికి గురి అవుతుంటారో .అటువంటి పిల్లలకు స్నానం  చేయిoచే సమయంలో   వేడి నీటిలో మృత్తికాను కలిపి   దేవునికి నేతి దీపాన్ని వెలిగించి  ప్రార్ధించి   ఆ నీటితో పిల్లలకు స్తానం చేయిస్తే అట్టి వారికీ ఆరోగ్యం మెరుగు పడుతుంది .

07. ఎవరికైతే ఋతు సమయంలో కడుపు నొప్పి ఎక్కువుగా వస్తుoటుoదో అటువంటి వారు ఋతు కాలానికి ముందు ఒక చిటిక మృత్తికాను బాగా పొడి చేసుకొని, కొబ్బరి నూనే లేదా అముదంలో వేసి పొట్టకు పూసుకుంటే ఋతుకాలంలో పొట్టనొప్పి ఉండదు.

08. ఎవరైతే పరీక్షా కాలంలో చదివిందంతా మరచిపోతుంటారో  అటువంటి వారు ఒక చిటిక మృత్తికాను ఒక గ్లాస్ నీటిలో వేసి రాత్త్రంత్ర  నానబెట్టి ఉదయం ఆ గ్లాస్లో నీటిని వడకట్టి తాగుతూవుంటే ఆపుడు మంచి జ్ఞాపక శక్తీ వస్తుంది. పరీక్షలో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు .

09. వివాహం అయి సంతానభాగ్యం లేనివారు మంగళవారం శ్రీ సుబ్రమణ్య స్వామి పూజ చేసిన తరువాత దేవునికి ప్రసాదంగా పెట్టిన పాలలో  ఒక చిటికెడు  మృత్తికాను  వేసి దేవునికి చూపించిప్రార్ధన చేసుకొని త్రాగితే స్వామి అనుగ్రహంతో ఖచ్చితంగా సంతాన భాగ్యం కలుగుతుంది.

10. ఎవరింట్లో ఐతే తులసి మొక్క తమలపాకు ఆకుల తీగలు ఎంత  వేసిన వడలి పోతుంటాయో అటువంటి వారు బృందావనపు కుండలో ఒక చిటిక మృత్తికాను వేసి మొక్కలను పెంచేతే మొక్కలు బాగా పెరుగుతాయి.

11. ఎవరికి చర్మం పొడి బారుతుందో, నాగఫణి రోగాన్ని అనుభావిస్తుంటారో, ఎవరైతే బాగా నీరసంతో ఇబ్బంది పడుతుంటారో అటువంటి వారు ఒక చిటిక మృత్తికాను నీటిలో వేసి సాయంకాలం స్నానం చేస్తే ఎటువంటి రోగాలు రాకుండా ఆరోగ్యవంతులుగా, భాగ్యవంతులుగా విలసిల్లుతారు.

Temple Address:
Sullia Taluk, 
Dakshina Kannada District, 
Subrahamanya, 
Karnataka 574238

HOW TO REACH:
Kukke Subrahmanya can be reached by road from Mangalore, Bangalore, Dharmastala, Mysore etc. KSRTC operates buses on a daily basis from these and other places. The nearest airport is the Mangalore International Airport, at a distance of 115 km. The nearest railway station is Subrahmanya Road (SBHR) railway station on Mangalore-Bangalore railway route, which is 12 km from Kukke Subrahmanya. There is daily passenger train services from Mangalore, Bangalore. One can catch a local transport from the station for a journey of 15 minutes to the temple (approx Rs. 20 per head)

KSRTC Bus Terminal, Subrahmanyax

Phone : 08257-281212

Subrahmanya Road Railway station(SBHR), Nettana

Ph: 08251-262241

Mangalore International Airport, Bajpe

Phone: 0824-2254252, 245104

Related Postings:

> Sri Murudeswaraswamy Temple Karnataka

> Nellore District Famous Temples List

> Tirumala Tirupati Total Information in Telugu

> Arunachalam Temple Information

> Kashi Yatra Details

> Nava Narasimha Swamy Temple Ahobilam

kukke subrahamanya temple information telugu, kukke temple history, kukke subramanya pooja list, kukke subramanya temple accommodation online booking, kukke subramanya temple timings, kukke subramanya temple ashlesha pooja, kukke subramanya temple histor, kukke subramanya kala sarpa dosha puja, kukke subramanya temple pooja booking contact number, hindu temples information.
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

ఎక్కువమంది చదివినవి

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.