Drop Down Menus

Kadiri Sri Lakshmi Narasimha Swamy Temple | Narasimha Swamy Temples

కదిరి లక్ష్మినరసింహ స్వామి ఆలయం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురంజిల్లాలో ఉంది.కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుపతిలో వేంచేసియున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయము తర్వాత అతి ప్రాచీనమైనదిగా శ్రీమత్ కదిరి లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయం ప్రసిద్ధిచెందింది.
Temple Timings
6.30 am to 12.45 pm
4.30 am to 8.30 pm

హిందూ పురాణాల ప్రకారం నరసింహ స్వామి హిరణ్యకశిపుని చంపడానికి కదిరి చెట్టు యొక్క మూలాల నుండి స్వయంభుగా ఉద్భవించారు.
హిరణ్యకస్యపుని సంహరించిన అనంతరము ఉగ్రస్వరూపులైన శ్రీ నరసింహస్వామి వారిని కదిరి పట్టణమునందు గల "స్తోత్రాద్రి" పర్వతవము వద్ద ముక్కోటి దేవతలు, భక్తప్రహ్లదుడు శాంతియింపచేసిరి. అందువలన ఈ క్షేయత్రము ప్రహ్లద సమితి నరసింహస్వామి దేవాలయము వెలిసినది స్థలపురాణ ప్రకారం కదిరి పట్టణముకు ఆ పేరు వచ్చుటకు అనేక గాధలు ఉన్నవి.
ఖా" అనగా విష్ణు పాదమనియు "అద్రి" అనగా పర్వతము అనియు అర్ధము. ఈ ప్రాంతములో స్వామి వారు పాదము మోపినందున ఈ పట్టణము "ఖాద్రీ" (కదిరి) అని పిలవబడుచున్నది. 

ఒరిస్సా రాష్ట్రములో పుట్టిపట్టణములో వెలసియున్న కొయ్య జగన్నాధునివలే ఈ క్షేత్రమున నరసింహస్వామి వారు చండ్రవృక్ష (ఖదరి వృక్షము ) కొమ్మపై చాలాకాలము వెలసి ఉన్నారు అని ప్రతీతి.
దేవాలయంలోని నరసింహ స్వామి యొక్క విగ్రహం ఎనిమిది చేతులు మరియు సింహం ముఖం కలిగి ఉంది. స్వామివారు హిరణ్యకశిపుని సంహరిస్తుండగా ప్రహ్లాదుడు చేతులు కట్టుకుని స్వామివారి వెనుక నిలబడి ఉంటాడు.ఈ విగ్రహం మొత్తం పౌరాణిక కథను తెలుపుతున్నట్లుంటుంది.
స్వామి వారు స్వప్నమున ఆదేశించిన విధముగా విజయనగర రాజైన వీరబుక్కరాయలు 1274 - 1275 సంవత్సరములో ఖదిరి వృక్షము క్రింద పుట్టలో ఉన్న సాల గ్రామములను బయటకు తీసి ఈ దేవాలయములో ప్రతిష్టించారు. ఈ సాలగ్రామములు కాల గతిలో అదృశ్యమైనందున 1545 లో విజయనగర రాజు అయిన అచ్యుత దేవరాయలు శ్రీవారి స్వప్న ఆదేశముల మేరకు ప్రస్తుతము ఈ క్షేత్రమున అష్టబాహువులతో హిరణ్యకస్యుపుని 
సంహరించు ఉన్న రాతివిగ్రహముగ విరాజిల్లుతున్న మూలవిరాట్లను స్తోత్రాద్రి పర్వత గ్రామాల నుండి (స్వామి వారి ఆదేశముల మేరకు) తీసుకొని వచ్చి ఈ దేవాలయములో ప్రతిష్టించారు.
శ్రీనరసింహ స్వామి వారు శ్రీ భృగు మహర్షికి అర్చనార్థం వసంత వల్లభుల విగ్రహములను ఒక పేటికలతో ఇచ్చారు. ప్రసాదించిన ఆ విగ్రహములను స్వామి వారి ఆదేశముల మేరకు భృగుతీర్థము నుండి బయటకు తీసిన వసంతవల్లబుల ఉత్సవ విగ్రహములును, స్వామి వారి ప్రస్తుత 

మూలావిరాట్నును అత్యంత వైభోగముగా, రాజసం ఉట్టిపడురీతిన ఆడంబరముగా వసంతరుతుల్లో ఈ దేవాలయాలుములో ప్రతిష్టించినందున ఉత్సవవిగ్రహములు వసంతవల్లభులుగా నామంతరము చెందినారు. ఈ పట్టణం ఖదరి వృక్షములతో నింపి ఇచ్చట ఈ దేవాలయాలయమును నిర్మించారని ప్రతీతి.
బ్రహ్మాండ  పురాణములో, ఖాద్రిస్థలపురాణాల్లో ఎంతో విపులంగా చర్చించబడింది. కదిరి పరిసరప్రాంతంములన్నియు. వేదవ్యాస మహర్షి వారు తన శిష్యలు ఉనికిని రాక్షసులుకు తెలియకుండా వారికి విద్యా బుద్ధులు ఇచ్చట నేర్పించుట వలన ఇది కేంద్రమైనది. 
అర్జునుడు తపస్సు చేసిన మద్దిలేరు (అర్జున నది ) ఈ ప్రాంతములో ఈ నదీ తీరం 6 తీర్థామాల ద్వారా వరుసగా ఉంటుంది.శ్వేతపుష్కరిణి , భృగుతీర్థము , కుంతితీర్థము, లక్ష్మితీర్థము , గంగతీర్థము, గరుడతీర్థము , భావనాశిని తీర్థములను తాకుతూ ప్రవహిస్తూ ఈ నది విరాజిల్లుతుంది.
విజయనగర రాజు అయిన వీరబుక్కరాయలు 1274 - 1275 మధ్యలో స్వప్నమున నరసింహస్వామి వారు ఆదేశించిన విధంగా స్వామి వారి సాలాగ్రములను కదరి వృక్షం క్రిందయున్న పుట్టలో నుంచి బయటకు తీసి దుర్గాదేవి దేవాలయానముకు దక్షిణమున అమ్మవారి దేవాలయమును సుందరశిల్పములతో ఈ నరసింహ క్షేత్రము నందు నిర్మించి ఇందులో ప్రతిష్టించారు. 
ద్వారపాలాకుల, గరుడరాయములు , అనేక మండపములును నిర్మించి 1953 లో దూరంగా దేవి విగ్రహముకు బదులు లక్ష్మీ అమ్మవారిని ప్రతిష్టించటం జరిగింది దుర్గాదేవి మూలవిగ్రహమును ఇప్పటికి అమ్మవారి దేవాలయములో చూడవచ్చు.ఈ తీర్ధయాత్ర హిందూ భక్తులకు కేంద్రంగా ఉంది. కదిరిలో ప్రతి సంవత్సరం గొప్ప విందు మరియు ప్రదర్శనలు పండుగగా జరుపుకుంటారు. 

Related Postings:
1.Anthapur District Temples
2.A.P Famous Temples
3.Narasimhaswamy Temple
4.Lord Vishnu Temples
5.Nava narasimha swamy Temple

Near By famous Temples:
1.Thimmamma Marrimanu

Transport
By Road:
There are number of buses provide by APSRTC to reach the temple and it is near from Ananthapur.
90KM from Ananthapur.
200KM From Tirupathi.
150KMs from YSR Kadapa.
By Train:
Major Railway Station is Kadiri.
By Air:
Nearest Airports is Puttaparthi (40 Kms).
Bangalore Airport (130 Kms).

Contact Details Of Sreemath Kadiri Lakshmi Narasimha Swamy Temple
Kadiri (Town)
Ananthapuram District
A.P- 515591
Office : 08494 221066 & 221366
Enquiry: 08494 223218

Keywords:

kadiri narasimha swamy temple history in telugu,kadiri lakshmi narasimha swamy temple,Kadiri Lakshmi Narasimha Swamy Temple - Timings, History, Website,History - kadiri lakshmi narasimha swamy temple,Images for kadiri narasimha swamy temple history,Teerthayatra - Sri Lakshmi Narasimha Swamy Temple in Kadiri,kadiri narasimha swamy temple sevas,kadiri narasimha swamy temple Rooms And Online Booking,bangalore to kadiri narasimha swamy temple,kadiri lakshmi narasimha swamy brahmotsavam,kadiri lakshmi narasimha swamy temple photos,kadiri lakshmi narasimha swamy temple contact number,kadiri lakshmi narasimha swamy temple Accommondation, Rooms And Address,Lakshmi Narasimhaswamy Temple,Nava Narasimha Swamy Temple
ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments