Tri Gaya Kshetras information | Tri Gaya Temples History Route Map | Travel Route Gaya Trip

మనం త్రిగయా క్షేత్రాల గురించి  తెల్సుకుందాం .. మనలో చాలామందికి శక్తి పీఠాలు , జ్యోతిర్లింగాలు , పంచారామాలు , పంచభూత లింగ క్షేత్రాలకోసం పూర్తిగా కాకపోయినా కాస్తో కూస్తో తెలుసు .. ఒకటో రెండు క్షేత్రాలను అందరం దర్శించనవాళ్ళమే . మనం చిన్నపట్నుంచి కాశి రామేశ్వరం క్షేత్రాల పేరును వింటూనే ఉంటాం . కాశి వెళ్ళినవాళ్ళు గయా క్షేత్రం కూడా వెళ్తారు . కాశి క్షేత్రం నుంచి గయా సుమారు 200 కిమీ పైనే ఉంటుంది. గయా క్షేత్రం పితృకర్మలకు ప్రసిద్ధి .. గయా లో పితృకర్మలు చేయించి కాశి క్షేత్రం చేరుకుంటారు . ఇంతకీ గయా క్షేత్రం ఎలా ఏర్పడింది ? మనకి ఆంధ్ర ప్రదేశ్ లో తూర్పుగోదావరి జిల్లాలో గల పిఠాపురం లో పాదగయ క్షేత్రం ఉంది .. ఈ క్షేత్రం పేరులో కూడా గయా ఉంది .. ఈ రెండు క్షేత్రాలకు ఏమైనా సంబంధం ఉందా ? పిఠాపురం పాద గయా క్షేత్రం కూడా పితృకర్మలు ప్రసిద్ధి .. ఇప్పటికి రెండు క్షేత్రాలు చెప్పుకున్నాం మరొక గయా క్షేత్రం కూడా ఉంది ఆ క్షేత్రం ఇప్పటి ఒడిశా లో జాజిపూర్ లో ఈ క్షేత్రం పేరు నాభి గయా . 
మనం ఈ క్షేత్రాల పేర్లు ఒకసారి పరిశీలిస్తే పాదగయా , నాభి గయా , శిరోగయ . పాదాలనుంచి శిరస్సు వరకు . గయా సుర వృత్తంతో కూడినది ఈ ఆలయాల స్థలపురాణం . 
గయాసురునకు త్రిమూర్తులకు జరిగిన చివరిసంభాషణ ఈ విధంగా ఉంది ... 
నేను చనిపోవుచున్నప్పుడు నాకు కోరికలు ఏమి ఉంటాయి .. అయినా మీరు కోరుకోమంటున్నారు కాబట్టి నేను చనిపోయిన తరువాత నా శరీరం లో ముఖ్యమైన భాగాలూ నా పేరున త్రిగయా క్షేత్రాలు అనునట్లును , ఆ క్షేత్రాలలో మీరు అనగా బ్రహ్మ , విష్ణు , మహేశ్వరులు ఆ క్షేత్రం వసించునట్లునూ , ఆ మూడు క్షేత్రాలు శక్తి పీఠములుగా విరాజిల్లునట్లునూ , ముఖ్యముగా మానవులు చనిపోయిన తమ పితరులను ఉద్దేశించి చేయు కర్మకాండ, పిండప్రదాన తర్పణాదులు ఈ క్షేత్రములలో చేయువారికి వారి పితరులకు పునరావృత్తి రహితమైన బ్రహ్మపదము కలుగునట్లునూ , ఎక్కడైనా గయా నామోచ్ఛారణ పూర్వకముగా చేయు పితృకర్మలు వలన మాత్రమే గయా శ్రాద్ధ ఫలితము ద్వారా పితృముక్తి  కలుగునట్లుగా కోరెను . 

ఆ కారణంగా మనకి త్రిగాయ క్షేత్రాలు ఏర్పడినవి 
శిరోగయ లో విష్ణుమూర్తి , నాభి గయ లో బ్రహ్మ , పాదగయ లో పరమశివుడు కొలువైయున్నారు . 

శిరోగయ లో విష్ణుమూర్తి పాదాలు గల ఆలయము , మంగళగౌరి దేవి శక్తి పీఠం కలదు . 

నాభి గయా లో యజ్ఞవేదికా స్వరూపమున బ్రహ్మదేవుడు ఉన్నాడు .. ఇక్కడ గిరిజ దేవి శక్తి పీఠం కలదు . 

పాదగయ లో పరమశివుడు కుక్కుట రూపాయం లో కొలువైయున్నాడు .. ఈ ఆలయ ప్రాంగణం లోనే పురుహూతికా దేవి శక్తి పీఠం కలదు . 
తూర్పుగోదావరి జిల్లాలో గల పిఠాపురం చేరుకోవడం చాల సులభం .. విజయవాడ వైపు నుంచి వచ్చేవారు సామర్లకోట చేరుకుంటే సామర్లకోట నుంచి 10 కిమీ దూరం లోనే పిఠాపురం కలదు . వైజాగ్ వైపునుంచి వచ్చేవారు కూడా సామర్లకోట చేరుకోవచ్చు .. పిఠాపురం లో కూడా రైల్వే స్టేషన్ ఉంది తిరుమల ఎక్ష్ప్రెస్స్ ఈ స్టెయిన్ లో ఆగుతుంది . అన్నవరం నుంచి కాకినాడ వెళ్ళేటప్పుడు మార్గ మధ్యలో పిఠాపురం కనిపిస్తుంది . అన్నవరం నుంచి ఈ క్షేత్రం 20 కిమీ దూరం ఉంటుంది . కాకినాడ నుంచి కేవలం 15 కిమీ దూరం లోనే పిఠాపురం ఉంటుంది. 

సామర్లకోట లో పంచారామ క్షేత్రాలలో ఒకటైన భీమేశ్వర క్షేత్రం ఉందని తెలుసు కదా .. ద్రాక్షారామం వెళ్లేవారు కూడా కాకినాడ వచ్చి కాకినాడ నుంచి పిఠాపురం వెళ్ళవచ్చు .. రవాణాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు .. బస్సు లు ఆటో లకు లోటు ఉండదు . 

Related Postings :
Keywords :
Tri gaya , Trigaya, Trigaya Tour Guide, History of Tri Gaya Temples, Varanasi Tour, Kashi Tour, Andhra Tourist Places, Odisha State Famous Places, Temple Packages and Online Room Booking, Temples History Famous Temples in India, India Tour Plan

1 Comments

  1. puruhutika devi aalayam kukkuteswara alayam vunnadhi kothaga kattindhi, asalu puruhutika devi gudi pitapuram patha busstand eduruga vuntundhi

    ReplyDelete
Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS