Drop Down Menus

Murari Sri Lakshmi Durgammavari Temple | Murari Jathara Celebrations

శ్రీ లక్ష్మి కనక దుర్గ  అమ్మవారి దేవాలయం చాలా ప్రసిద్ధి చెందిన ఆలయం,ఇది తూర్పుగోదావరి జిల్లాలో  రాజమండ్రికి 26 కిలో మీటర్ల దూరంలో గండేపల్లి మండలం మురారి గ్రామంలో ఉన్నది. 

ఇక్కడశ్రీ లక్ష్మి కనక దుర్గ  అమ్మవారు వేప చెట్టు రూపములో కొలువైయున్నారు. 
ఈ ఆలయం తూర్పుగోదావరి జిల్లాలో ప్రసిద్ధి చెందిన ఆలయంలో ఒక్కటి. పౌర్ణమి తరువాత మూడోవ రోజున ఇక్కడ జరిగే జాతర ఉత్సవం చాల ప్రాముఖ్యమైనది. ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది. అంతే కాకుండా సంవత్సరం అంత భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారు. 
ఊరికి దూరంగా పచ్చని  పొలాల మధ్య  శ్రీ లక్ష్మి కనక దుర్గ  అమ్మవారు (వేప చెట్టు) దేవాలయం ఉంది .కోరిన కోర్కెలు తీర్చే ఇలవేల్పుగా వెలుగొందుతున్న అమ్మవారు భక్తులపాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. 
రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు నిత్యం పెద్దసంఖ్యలో అమ్మవారిని  దర్శించుకుంటారు. తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న తలుపులమ్మ లోవ ఎంత విశిష్టత పొందిందో అంతే విధంగా ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. ఇక్కడి అమ్మవారు వేప చెట్టు రూపంలో భక్తులకు దర్శనం ఇస్తుంది .ఎక్కడి అమ్మవారిని శ్రీ లక్ష్మి కనక దుర్గ  అమ్మ అని కూడా పిలుస్తుంటారు.
చరిత్ర ప్రకారం:
అందుబాటులో ఉన్న చరిత్ర ప్రకారం ఈ అమ్మవారు 58 సంవత్సరాల నుండి ఉన్నట్టు తెలుస్తుంది.ఈ ఆలయం మురారి గ్రామానికి చెందిన అమ్మవారి భక్తురాలైన వేగుళ్ళ శేషమ్మగారికి కలలో కనిపించి నేను పొలాల మధ్య ఒక్క చిన్న వేప మొక్క రూపంలో వెలసెను అని చెప్పి అమ్మవారు అదృశ్యం అయ్యాను. 

నిద్ర నుండి మెలుకున్ని ఈ అమ్మవారు చెప్పిన విషయాన్ని కుటుంబ సభ్యులకు , గ్రామస్తులకు తెలిపింది. 
గ్రామస్తులు అందరూ కలిసి అమ్మవారు వెలిసిన చిన్న వేపమొక్కకు పూజలు చేయడం మొదలు పెట్టారు. ఆనాటి నుండి నేటి వరకు వేలాది భక్తులు ఈ దేవతని పూజించి దర్శించుకుంటున్నారు . వేప మొక్క దగ్గిర ఉన్న అమ్మ వారి విగ్రహం నేడు పూజలు అందుకుంటుంది. ఈ అమ్మ వారి విగ్రహాన్ని ఈ మధ్యకాలంలోనే అనగా 12 సంవత్సరల క్రితం. ఒక్క అమ్మవారి భక్తులురాలు  దేవత  విగ్రహాన్ని తలపైన పెట్టుకుని కాలినడకన మురారి వచ్చి అమ్మవారి చెట్టు వద్ద. ఈ విగ్రహ రూపంలో ఉన్న అమ్మవారిని ప్రతిష్టించడం జరిగింది.
నేటికీ  వేగుళ్ళ శేషమ్మగారి  కుటుంబ సభ్యులే  ఈ దేవాలయాన్ని పరిరక్షిస్తు ఉన్నారు. ఎక్కడ  సంతానం లేనివారు సంతానం కొరకు ఎక్కడ అమ్మవారి వేప చెట్టుకు ఉయ్యాలు కడితే పిల్లలు లేనివారికి సంతానం కలుగుతుంది అని భక్తుల నమ్మకం. 
మురారి జాతర సంవత్సరానికి ఒక్కరి జరుగుతుంది. అది కూడా పౌర్ణమి వెళ్లిన మూడోరోజున అ సమయంలోని వేలాది మంది  భక్తులు అమ్మవారిని దర్శించుకుని  మోక్కులు చెలిస్తారు. 

ఒక్కపుడు సంవత్సరానికి మురారి అమ్మవారిని కేవలం ఒక్కటి నుండి మూడు రోజులు మాత్రమే అమ్మవారి దర్శించుకునే వారు. నేడు సంవత్సరం పొడవునా అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఇక్కడ  సాయంత్రం చీకటి పడినతరువాత ఎవరు ఈ గుడి చుట్టుపక్కల ఉండరు. చీకటి పడిన తరువాత అమ్మవారు ఆ పచ్చని పొలాలలో తిరుగు ఉంటారు అని గ్రామస్తులు విశ్వ హిస్తారు .  
ఈ గుడి కుటుంబ సమేతంగా ,బంధు మిత్రులతో కలిసి వచ్చి అక్కడే వంట వార్పు చేసుకుని ఇక్కడ వచ్చిన భక్తులు వారి ఆహార (ప్రసాదం )దేవతకు సమర్పించుకుంటారు,భక్తులు వారి  వేడుకలో ఆహారాన్ని వండుకొనవచ్చును మరియు వారి వంట కోసం అవసరమైన ప్రతి వస్తువు అందుబాటులో ఉండును .ఆహార (ప్రసాదం )దేవతకు సమర్పించ్చి వారి మెక్కును చెల్లించుకుంటారు. 
పూజ మరియు ఆహార కార్యక్రమాలు మూగిన తర్వాత ,సాయంత్రంకాలంలో అయ్యే ముందు బయటకి వెళ్లవలెను. ఈ ఆలయం సాయంత్రం ఆరు గంటలకి మూసివేస్తారు.ఆదివారాలు,మంగళవారాలు,పండుగసందర్భాలలోను, ఆషాడ మాసంలో చాల రద్దీగా ఉండును . 
అత్యంత రద్దీగా ఉన్న ఆలయంలలో ఒక్కటిగా పేరుగాంచింది, ఇక్కడ  ఈమె అవతారం ధరించిన తరువాత నుండి గ్రామం సువిశాల సుసంపన్నమైనదని నమ్ముతారు.
క్రమంగా రోజు రోజుకి అమ్మవారి మహిమను తెలుసుని  ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం తరలి వస్తారు .ప్రతి ఒక్కరు అమ్మ చల్లని దీవెనలతో , సుఖశాంతులతో ఆహ్లాదకరమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. దేవత అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంది. 
ఈ అమ్మ వారిని వ్యాపారం అభివృద్ధి కొరకు ,సంతానం కొరకు ,వారి కష్టాలు తీరి సుఖ జీవితం కొరకు ,ఆపదలు తొలగడం కొరకు ,ముఖ్యంగా వ్యాపారం వృద్ధి కొరకు. భక్తులు వారి నమ్మకాలను మరియు కోరికలు నెరవేర్చుకోవడానికి వారిని చల్లగా కాచి కాపాడమని అమ్మవారిని పూజిస్తారు.

Related Postings:
1.East godavari Temples
2.A.P Famous Temples
3.Pancharamalu
4.Ammavari Sakthi Pitalu
5.Jyothirlingas 

Near By famous Temples:
1.Satyadevudi Temple (Annavaram )
2.kumara bhimeswara temple(Samalkot)
3.Rajahmundry Godavari

Contact Details Of Sri Lakshmi Kanaka Durga Temple
Murari,Gandepalli Mandal
East Godavari District ,
A.P- 533297

                       

keywords:
Murari Temple,Murari Village,Gandepalli Mandal east godavari ,Murari Jathara,Murari Thirtam,Murari Thirdham,Murari Pandaga,Murari Ammavari Story In Telugu,Sri Lakshmi Kanaka Durga History In Telugu,Sri Lakshmi Kanaka Durga History,Murari Sri Lakshmi Kanaka Durga History,
ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.