Drop Down Menus

Puri Jagannath Temple History In Telugu | Puri Jagannath Temple in Telugu Secrets

మన భారతదేశంలో ఎన్నో ప్రాముఖ్యం,విశిష్టత,అద్భుతం కలిగిన దేవాలయాలు ఎన్నో వున్నాయి. అలాంటి దేవాలయాలు జీవితంలో ఒక్కసారైనా ఖచ్చితంగా దర్శించాలని అంటుంటారు.అలాంటి మహా అద్భుత ఆలయాలలో ఎంతో ప్రసిద్ధిచెందిన పూరీ జగన్నాథ్ స్వామి ఆలయం ఒక్కటి.పూరీ జగన్నాథ స్వామి దేవాలయం భారతదేశంలోన బంగాళాఖాతం తీరాన ఒరిస్సారాష్ట్రం రాజధాని భువనేశ్వర్ నుండి 60 కిమీ దూరంలో ఉంది.
ఈ ఆలయాన్ని 1078సంలో పూరీలో నిర్మించారు.పూరీ పట్టణంలో గల ఒక ప్రాచీన మరియు ప్రముఖమైన హిందూ దేవాలయము. కృష్ణ భక్తులకు లేదా విష్ణు భక్తులకు ఈ దేవాలయం ఎంతో ప్రియమైనది. ఆలయ విగ్రహాలు చెక్కతో తయారు చేసి ఉండటం ఇక్కడి ప్రత్యేకత. ఆలయంలో శ్రీకృష్ణుడు, సుభద్ర మరియు బలరామ సమేతంగా దర్శనమిస్తాడు. జగన్నాథుడు (విశ్వానికి ప్రభువు) పేరుతో ఆలయ దైవం యుంటుంది. 

సంస్కృత భాషలో జగత్ (విశ్వం) మరియు నాథ్ (ప్రభువు) అని అర్థం. హిందూ ఆచారాల ప్రకారం, భక్తులకు ముఖ్యంగా విష్ణువు మరియు కృష్ణుడిని ఆరాధించు వాళ్లకు ఈ గుడి ప్రముఖమైన పుణ్యక్షేత్రం. ప్రతి హిందువు తన జీవితకాలంలో తప్పక దర్శించవలసిన "ఛార్ థాం" పుణ్యక్షేత్రాలలో ఈ దేవాలయం కూడా ఉంది.
జగన్నాథ ఆలయం భారతదేశంలో ఉన్న దేవాలయాలల్లో  చాలా ప్రాముఖ్య కలిగి ఉన్నది. ఇక్కడ రాధా, దుర్గ, లక్ష్మి, పార్వతి, సతి, మరియు కృష్ణ తో శక్తి నిలయాలు ఉన్నాయి. జగన్నాథుని యొక్క పవిత్ర భూమిగా భావిస్తారు. ప్రస్తుతం ఉన్న పూరీని ఒకప్పుడు పురుషోత్తమ పురి, పురుషోత్తమ క్షేత్ర, శంఖక్షేత్ర వంటి అనేక పేర్లతో పిలేచేవారు.   ఇక్కడ ప్రతి సంవత్సరం చేసే రథయాత్ర ఎంతో ప్రఖ్యాతమైనది.ప్రపంచ ప్రసిద్ధిచెందింది.
ఈ ఆలయంలో కృష్ణుడి జీవితాన్ని కళ్ళకుకట్టినట్లు చూపించే గోడలు, స్థంభాలు ఈ ఆలయానికి మరింత శోభను తీస్కోస్తాయి.అన్ని ఆలయాలలో వున్నట్లే గోపురం, దేవతలు, గంటలు, ప్రసాదం అన్నీ వున్నా ప్రతీదానికీ ఒక విశిష్టత అద్భుతం కలిగి వుంది.ఇక్కడ ఇంకా ఎన్నో అద్భుతాలు ఈ ఆలయానికున్నాయి. బహుశా అవి ప్రపంచంలో ఇంకెక్కడా వుండవు అని చెప్పడంలో అతిశయోక్తి లేదేమో ఇప్పటికి కూడా సైన్స్ కి అంతు చిక్కకుండా ఉండడం ఒక్క విశేషంగా చెప్పవచ్చు.అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం...

ముందుగా పిరమిడ్ గురించి తెలుసుందాం.గణ గణ మోగే బ్రహ్మాండమైన 65 అడుగుల ఎత్తైన పిరమిడ్ నిర్మాణం, అద్భుతమైన ఆలయం లో చెక్కిన నిర్మాణాలలో కృషుడి జీవిత విశేషాలు చెక్కబడి ఉన్నాయి 
1.గోపురం:
ప్రతి ఆలయంలో గోపురం నీడని మనం చూడొచ్చు గానీ ఈ పూరీ జగన్నాథ ఆలయంలో గోపురం నీడ కన్పించదు. పగలైనా రాత్రైనా అస్సలు కన్పించదు. మరి నిర్మాణ లోని కౌశల్యమో తెలియదు కానీ ఇప్పటికి ఇదొక వింతనే
2.రెపరెపలాడే జెండా:
గోపురం పైన ఎగిరే జెండా..ఈ ఆలయ గోపురానికి కట్టిన జెండా చాలా ఆశ్చర్యం గా ఉంటుంది.  సాధారణం గా ఏ గుడి కైనా కట్టిన జెండా గాలి ఎటు వైపు వీస్తుందో అటు వైపు మాత్రమే ఎగురుతుంది కానీ ఇక్కడ మాత్రం బిన్నంగా గాలి వీచే దిక్కున కాకుండా వ్యతిరేక దిశాలో జెండా రెప రెపలాడుతుంది.ఇలా ఎందుకు జరుగుతుంది అన్నది ఎవరు కనిపెట్టలేకపోయారు.అద్భుతమైన నిర్మాణకౌశల్యానికి ఇది ఒక  మచ్చుతునక. 
ఇక్కడ ఇంకో ముఖ్యమైనది ఏంటంటే ఆ జెండాను తరచుగా ఆలయప్రత్యేక పూజారులు మారుస్తుంటారు. 
ఒక వేళ మార్చడం మరిచిపోతే ఆలయాన్ని దాదాపు 18 సం//లు మూసివేయాలని భావిస్తారు. ఇలా పురాణాలు  చెప్పుతున్నాయంటా .
3.పక్షులు,విమానాలు ఎగరావు:
గోపురం పైన నుంచి పక్షులు ఎగురుతూ ఉంటాయి.కానీ ఈ పూరి జగన్నాధ్ ఆలయంలో ఎక్కడ కూడా పక్షులుగుడి చుట్టుపక్కల కనిపించవు,ఈ ఆలయం పై నుంచి ఎలాంటి పక్షులు విమానాలు, హెలికాప్టర్లు కూడా ఎగరావు అంట. అలా ఎందుకో ఇప్పటికి అంతు చిక్కడం లేదు. 
4.సముద్రపు అలలు:
సాధారణంగా తీర ప్రాంతాలలో గాలి సముద్రపు వైపు నుంచి భూమి వైపుకి  వీస్తుంటుంది.సాయంత్రపు పూట గాలి నేలవైపు నుంచి సముద్రం వైపుకు వీస్తుంది.కానీ పూరీలో అంతా విభిన్నం.సముద్రపు అలలు దీనికి వ్యతిరేకంగా గాలి వీస్తుండటం ఇక్కడి ప్రత్యేకత.
5. సుదర్శన చక్రం:
 గోపురం పైన వుండే ఈ సుదర్శన చక్రం పరమ పవిత్ర మైనది. మీరు పూరి పట్టణం లో ఎక్కడ నుంచి చూసినా కూడా ఈ సుదర్శన చక్రం మీ వైపు తిరిగినట్టు, మీ వైపునే చూస్తునట్లుకనిపిస్తుంది ఇదొక అద్భుతం ఇలా ఎలా నిర్మాణం చేశారో ఇప్పటికి ఎవరు చెప్పలేకపోయారు. 
6.సముద్ర అలల శబ్దం:
సాధారణంగా మనం సముద్రతీరాన ఆలయానికి వెళ్ళినప్పుడు మనం బయటవున్నంతసేపు సముద్రపు అలలు,వాటి శాభ్దాలు మనకు వినిపిస్తాయి. లోపలికి వెళ్ళినాకూడా ఆ శాభ్దాలు స్పష్టంగా వినిపిస్తాయి.
కానీ ఈ పూరీ జగన్నాధ ఆలయంలో సముద్రపు అలలు అలా వుండదు. సింహద్వారం గుండా ఆలయంలో ప్రవేశిస్తూ ఒక్క అడుగు గుడి లోపలికి పెట్టగానే సముద్రంలో నుంచి వచ్చే శబ్దం ఏ మాత్రం వినిపించదు. 

కానీ ఎప్పుడైతే బయటకు అడుగు పెడతారో వెంటనే చాలా క్లియర్ గా వినపడుతుంది.అయితే సాయంత్రం అయితే ఈ శబ్దాన్ని గమనించలేరు .కారణం ఇద్దరి దేవుళ్ళ సోదరి సుభద్రాదేవి ఆలయం లోపల ప్రశాంతత కోరటం వలన ఇలా జరుగుతుంది అని ఆలయ పూజారులు చెప్తారు.అంతే కానీ దీని వెనుక ఎలాంటి సైన్టిఫిక్ రీసన్ లేదని చెప్తారు.
7.ప్రసాదం:
మరొక ప్రత్యేకత జగన్నాధ్ ఆలయం లో దేవుడికి నివేదన చేసిన ప్రసాదాన్ని “మహా ప్రసాదం ” గా పిలుస్తారు. పూరీ జగన్నాధ ఆలయంలో 56 రకాల పిండివంటలని దేవుడికి నైవేద్యంగా పెడతారు.ప్రసాదాలు కేవలం ఆలయ వంటశాలలో మట్టికుండలో మాత్రమే తయారుచేస్తారు.ఎలాంటి ఇత్తడి గాని, ఇనుము కానీ మారె ఇతర లోహ పాత్రలని ఉపయోగించక పోవడం ఇంకొక విశేషం.ఈ ప్రసాదాలు చేసి దేవుడికి సమర్పించే ముందు వరకు ఎలాంటి రుచి,వాసన వుండదు. 
మరొక ప్రత్యేకత ఎప్పుడైతే దేవుడికి సమర్పిస్తారో వెంటనే ఘుమఘుమలతో పాటు రుచి,వాసనా కూడా వుంటుంది.ఇదంతా దేవుడి లీలనే అని చెప్తారు.మరొక ప్రత్యేకత ఏంటంటే ఇది ఒక సంవత్సరం వరకు పాడవకుండా వుంటుందట.ఈ ప్రసాదాన్ని దాదాపు 2000మంది దగ్గర నుంచి 2 లక్షల వరకు భక్తులకు ఇవ్వొచ్చుఅంట.
8.7మట్టి కుండలలో:
మరొక ప్రత్యేకత ఇంకా దేవుడికి పెట్టె నైవేద్యం 7మట్టి కుండలలో ఒకదాని పైన ఒకటి పెట్టి వండుతారు.అందులో విశేషం ఏమిటి అంటే వరసగా పెట్టిన కుండలో ఉన్న ఆహారం  ఒక్క అద్భుతం మరియు వింతను కలిగిస్తుంది . సాధారణంగా క్రింద (అడుగున )ఉన్న కుండకి  వేడి తగిలి ముందుగా ఆహారం పదార్థం వుడుకుతుంది.కానీ ఎక్కడా మాత్రం ముందుగా  చివరి అనగా ఏడవ కుండ  తొందరగా ఆహారం వుడుకుతుంది,చివరిగా క్రిందా మంట పైన వున్న కుండలోని ఆహారం చివరిగా వుడుకుతుంది. 
అదే ఇక్కడి ప్రత్యేకత.ఇన్ని విశేషాలు, అద్భుతాలు కలిగిన పూరీ జగన్నాథ్ ఆలయాన్ని ప్రతీ ఏడాది లక్షలమంది భక్తులు సందర్శిస్తారు.మీరు కూడా జీవితంలో ఒక్కసారైనా ఈ అద్భుతాన్ని చూసి తరించండి.తప్పకుండా పూరీ జగన్నాధఆలయాన్ని దర్శించండి.

Related Postings:
1.Odisha Temples
2.Puri Jagannath Temples-2
3.1000 Years Old Tmples
4.Lord Shiva Temples
5.Lord Vishnu Temple

Transport
1. Puri's farm in Odisha has access to all parts of the country.
2. The Bijapunnayak Airport in Bhubaneswar is 60 km away from Puri. It's away. 
3. Train services from Puri to major cities in the country are running. 
4. The Khurrodod Railway Station in Kolkata-Chennai Main Railway is 44 km from here. It's away. 
5. Bus facilities are available from Bhubaneswar, Kolkata and Visakhapatnam.
Contact Details Of Puri Jagannath Temple
Puri,Puri District
Odisha ,India
Pin:752001
Phone : 06752222051

Keywords:
11 Astonishing Facts About Jagannath Swamy Temple,Puri Jagannath Swamy Temple,Puri Jagannath Temple History,Puri Jagannath Swamy Temple Story,Odisha Temple,Puri Jagannath Swamy Temple Odisha,Puri Jagannath Swamy Temple Accommondation,Puri Jagannath Temples Timings and Poja,Phone No,Puri Jagannath Swamy Temple in Telugu,Puri Jagannath Temple History In Telugu,Top Secrets about Puri Jagannath Temple in Telugu,Puri Jagannath Temple History,About Lord Puri jagannath YouTube,Mystery of Jagannath Puri Temple in Telugu Secrets,jagannath puri temple facts,konark temple history in telugu language,puri jagannath temple story in telugu pdf,jagannath puri temple images,treasures in jagannath temple,puri jagannath temple news in telugu,flag changing in jagannath temple video,jagannath temple flag length,Puri Jagannath Temple Address,

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

Post a Comment

FAQ'S

తిరుమల దర్శనం టికెట్స్ ఇతర సేవ టికెట్స్ ప్రస్తుతం ఆగస్టు నెల వరకు బుక్ అయ్యాయి . సెప్టెంబర్ నెలకు జూన్ నెలలో 18వ తేదీన విడుదల చేసే అవకాశం ఉంది

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.