దేవునికి ఎదురుగా నిలబడి నమస్కారం పెట్టొచ్చా?
దేవాలయాలలొ పండితులు,పూజారులు,పెద్దవారు ఒక్క మాట చెప్పుతూంటారు గుడిలో దేవునికి ఎదురుగా నిలబడి నమస్కారం పెట్టకోకూడదని. నిజమే దానికి కారణం దేవుడికి ఓ పక్కగా నిలబడి నమస్కరించాలి. దేవాలయాలలొ స్వామికి ప్రాణ ప్రతిష్ఠ చేసే క్రమంలో ఎన్నో శక్తుల్ని స్వామి ప్రతిమలోకి ఆహ్వానిస్తారు. ఆ శక్తిని మనం తట్టుకోలేం.
స్వామివారికి ఎదురుగా ఉండే ఆయన వాహనానికి మధ్యలో కూడా నిలబడకూడదు.కనుక ఎదురుగా నిలబడకూడదన్న నియమం ఏర్పడింది.
ప్రతిదేవాలయంలో అద్వితీయమైన శక్తి ఉంటుంది. ప్రధానంగా మూలవిరాట్‌ను ప్రతిష్టించే సమయంలో వేదపండితులు వేదమంత్రాలను పఠిస్తారు. గర్భగుడిలో మహాశక్తులను నిక్షిప్తం చేస్తారు. మందిరంలో యంత్రబలంతో పాటు మంత్రబలం ఉంటాయి. పరమేశ్వరుడు, కాళీమాత ఆలయాల్లో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. శివలింగ దర్శనాన్ని నంది కొమ్ముల నుంచి చూసిన తరువాతనే దర్శనం చేసుకోవాలని పురాణగ్రంథాలు వెల్లడిస్తున్నాయి.
ఇంకా కొన్ని ఆలయాల్లో సూర్యకిరణాలు నేరుగా గర్భగుడిలోకి ప్రవేశిస్తాయి. మనం అడ్డంగా నిలిస్తే కిరణాలు మూలవిరాట్ దగ్గరకు వెళ్లలేవు. ఇలా పలుకారణాలతో ఆలయంలో దేవుడికీ ఎదురుగా నిల్చోని నమస్కరించకూడదు. మన పెద్దలు ధర్మబద్ధమైన జీవితాన్ని గడిపేందుకు అనేక నియమ నిబంధనలు ప్రవేశపెట్టారు. వీటిని ఆచరించడంతో మన సంప్రదాయాన్ని పరిరక్షించినవాళ్లమవుతాం. అందుకనే ఒక వైపుగా నిలబడి దర్శనం చేసుకోవాలి.
Related Postings:
keywords:
దేవునికి ఎదురుగా నిలబడి నమస్కారం పెట్టుకోకూడదా? ,Do not stand in front of God and worship it?,దేవునికి ఎదురుగా నిలబడి నమస్కారం పెట్టొచ్చా?,Can you stand up and stand up to God?,Can you stand up against God and pray?,Dharmasandehalu,Nandi,lord Shiva Temples,Temples,Hindu Temples,Sanatana Dharmam,
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment