Drop Down Menus

Scientific Reason Behind Hanging mango Leaves on Doorstep? | Thoranam


గుమ్మాలకు  మామిడి తోరణాలు ఎందుకు కడతారు ?
సాధారణంగా పండగలు, వేడుకలకు తోరణాలు కడుతుంటాం. ఇంటి గుమ్మాలకు తోరణాలు కట్టకుండా శుభకార్యాలు, పండుగలు నిర్వహించరు. మామిడి, రావి, జువ్వి, మర్రి, ఉత్తరేణి ఆకులను పంచపల్లవాలంటారు. శుభకార్యాల్లో వీటిని విరివిగా ఉపయోగిస్తారు. తోరణాలుగా మాత్రం మామిడి ఆకులను మాత్రమే వినియోగిస్తారు. మామిడి నిద్రలేమిని పోగొడుతుంది.
పండుగల వేళ పని ఒత్తిడిని, శ్రమను పోగొట్టేది మామిడాకు తోరణమే. మామిడి కోరికలను తీరుస్తుందని భావిస్తారు. పర్వదినాల్లో, యజ్ఞయాగాల్లో ధ్వజారోహణం చేయడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. దీనిని అనుసరించి తోరణాలు కట్టే ఆచారం వచ్చింది.
మామిడి చెట్టు పండ్లే కాదు ఆకులు కూడా మ‌న‌కు ఉప‌యోగ‌క‌ర‌మే. వాటిని ప‌లు అనారోగ్యాలు తొల‌గించుకునేందుకు ఆయుర్వేదంలో వాడుతారు. అయితే పండుగ‌ల స‌మ‌యంలో, శుభ కార్యాలు నిర్వ‌హించిన‌ప్పుడు హిందువులు త‌మ త‌మ ఇండ్ల‌కు మామిడి ఆకులతో త‌యారు చేసిన తోర‌ణాలు క‌డుతారు క‌దా. దీని గురించి అంద‌రికీ తెలుసు. అయితే దీని వెనుక ఉన్న అస‌లైన కార‌ణం ఏంటో తెలుసా..? దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఇంట్లో ఉండే గాలి శుభ్ర‌మ‌వుతుంద‌ట‌. త‌ద్వారా చ‌క్క‌ని ఆరోగ్యం క‌లుగుతుంద‌ట‌. ఇంట్లో ఉండే ఆక్సిజ‌న్ శాతం పెరిగి స్వ‌చ్ఛమైన గాలి మ‌న‌కు లభిస్తుంది.
2. సాధారణంగా మామిడి ఆకుల్లో ల‌క్ష్మీదేవి కొలువైవుంటుందని పెద్దలు చెపుతారు. అందుకే ఆ ఆకుల‌తో చేసిన తోరణాలు క‌డితే ఆ ఇంట్లోకి ధనం వ‌చ్చి చేరుతుంద‌ట‌. ఆర్థిక స‌మ‌స్య‌లు పోతాయ‌ట‌.
3. ఇంటి ప్రధాన గుమ్మానికి, ఇంటి ఆవరణంలోని ద్వారానికి మామిడి ఆకుల తోర‌ణాలు క‌డితే ఆ ఇంట్లోని వాస్తు దోషం పోతుంద‌ట‌. అంటే ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ పోయి.. పాజిటివ్ ఎనర్జీ ప్రసారమవుతుందట. ఈ కారణంగా అన్నీ శుభాలే క‌లుగుతాయి.
4. మామిడి ఆకులు శుభానికి చిహ్నాలు. అందుకే వాటి తోర‌ణాల‌ను ఆల‌యాల్లో కూడా క‌డుతుంటారు. అలాంటిది ఆ తోర‌ణాలు గృహాల్లో కూడా క‌డితే అంతామంచే జ‌రుగుతుంద‌ని మ‌న పూర్వీకుల న‌మ్మ‌కం. పురాణాలు కూడా ఇదే విష‌యాన్ని చెబుతున్నాయి.
5. ఇంట్లో ఏవేని దుష్టశక్తులు ఉండివున్నట్టయితే ఆ శక్తులన్నీ వెళ్లిపోయి.. దేవ‌త‌లు అనుగ్ర‌హిస్తార‌ట‌. అలాగే, మామిడి ఆకులు ప్ర‌శాంత‌త‌కు చిహ్నాలు. మామిడి ఆకుల తోర‌ణాల‌ను చూస్తే ఎవ‌రికైనా మ‌న‌స్సు ప్ర‌శాంతంగా మారుతుంద‌ట‌.

మామిడి ఆకులు శుభానికి చిహ్నాలు. అందుకే వాటి తోర‌ణాల‌ను ఆల‌యాల్లో కూడా క‌డుతుంటారు. అలాంటిది ఆ తోర‌ణాలు ఇండ్ల‌లో కూడా క‌డితే అంతా మంచే జ‌రుగుతుంద‌ని మ‌న పూర్వీకుల న‌మ్మ‌కం. పురాణాలు కూడా ఇదే విష‌యాన్ని చెబుతున్నాయి.
Related Postings:

Keywords:
గుమ్మాలకు తోరణాలు ఎందుకు కట్టాలి?,Thoranam,Mango leaves thoranam, మామిడి ఆకులతోనే తోరణాలు ఎందుకు కట్టాలి ?,Mango leaves to Doors on festivals,పండగ రోజున గుమ్మాలకు మామిడి తోరణాలు ఎందుకు కడతారు ?Scientific Reason Behind Hanging Leaves on Doorstep, Tying Of Mango Leaves At The Entrance Of House,పండుగలు, శుభ కార్యాల‌ప్పుడు ఇండ్ల‌కు మామిడి తోర‌ణాలు ఎందుకు క‌డ‌తారో తెలుసా..?మామిడి ఆకులతోనే తోరణాలు ఎందుకు కట్టాలి?Dharmasandehalu,sandehalu,Temples,Reason Behind Hanging mango Leaves on Doorstep
Why are mango fencing stuffed?,Why do mango arches be made to the doorways?
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON