Drop Down Menus

Do you know why do Pradakshina In Temple | Pradakshina

గుడిలో ఎందుకు ప్రదక్షిణలు చేస్తారు?
ఆలయ సందర్శన ప్రతి హిందువు జీవితంలో అత్యంత ప్రధానమైన ఆధ్మాతిక ఘట్టం. ఇంట్లో దేవుడున్నా.. దేవాలయం వరకూ ఎందుకు వెళ్తామని ప్రశ్నించేవారు లేకపోలేదు. కానీ భగవంతుడు కొలువైన చోటుకే వెళ్లడం ద్వారానే మనం దైవానికి ఇచ్చే ప్రాముఖ్యత ఎంతో ఆ దైవం ఇట్టే గ్రహించగలడు కదా.
అందుకే వీలైనంత తరచుగా ఆలయ సందర్శనం చేయాలి. 
ఆలయ సందర్శనంలో ఆలయ ప్రదక్షిణం, దైవ దర్శనం ప్రధానం కదా. మరి ఆలయంలో ప్రదక్షిణలు ఎలా చేయాలి. ఎన్నిసార్లు దైవం చుట్టూ తిరగాలి.. అనే సందేహాలు కొందరు భక్తులకు కలుగుతాయి. అయితే ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేశామన్నది ముఖ్యం కాదంటారు పెద్దలు. మనం ఎంత నిష్టగా, భక్తిగా ప్రదక్షిణలు చేశామన్నదే అత్యంత ప్రధానమైన అంశం. 
ప్రదక్షిణలు చేసే విధానం గురించి ఓ స్మతి వాక్యం ఇలా చెబుతుంది. నిండు గర్బిణి నీళ్ల బిందె మోసేటప్పుడు ఎంత జాగ్రత్తగా అడుగులు వేస్తుందో అంత జాగ్రత్తగా ప్రదక్షిణలు చేయాలట. అంటే భగవంతుని చుట్టూ ప్రదక్షిణలు చేసేటప్పుడు మన కాళ్ల చప్పుడు కూడా మనకు వినపడకూడదట. ప్రదక్షిణ సమయంలో దైవాన్ని మనస్సులో స్మరిస్తూ సాగిపోవాలి. 
గుడికి వెళ్లిన ప్రతివారూ ప్రదక్షిణలు చేస్తారు. 'ప్రదక్షిణం' లో 'ప్ర' అనే అక్షరం పాపాలకి నాశనము..'' అనగా కోరికలు తీర్చమని, 'క్షి' అన్న అక్షరము మరుజన్మలో మంచి జన్మ ఇవ్వమని. '' అనగా అజ్ఞానము పారద్రోలి ఆత్మజ్ఞానము ఇవ్వమని. గుడిలో భగవంతుడి చుట్టూ తిరిగే ప్రదక్షిణంలో ఎంత అర్థం ఉంది.
పూర్వం ఆదిలో వినాయకుడు పార్వతి, పరమేశ్వరుల చుట్టూ తిరిగి విశ్వానికి ప్రదక్షిణ చేసిన ఫలం పొందాడు. కావున భగవంతుని చుట్టూ చేసే ప్రదక్షిణ విశ్వా ప్రదక్షిణమవుతుంది. ఆత్మ ప్రదక్షిణ అవుతుంది. భగవంతుడా! నేను అన్ని వైపుల నుంచి నిన్నే అనుకరిస్తూ ధ్యానిస్తున్నానని అర్థం.
ప్రదక్షిణలు రెండు రకాలుగా చేస్తాం , ఒకటి ఆత్మ ప్రదక్షిణ అయితే, మరొకటి గర్భగుడి లేదా విగ్రహం చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణ చేస్తాం. అయితే చాలామందికి ఇది ఒక జవాబు దొరకని అంతుచిక్కని ప్రశ్నగా మారవచ్చు. గుడిలో వున్న దేవుడికి నమస్కారం పెడుతూ మనస్సులో మనం ఏదైనా కోరిక కోరుకుంటాం. ఆయనకు నైవేద్యం కింద కొబ్బరికాయలు లేదా పువ్వులను సమర్పిస్తాం. అయితే దేవుడితో నేరుగా సంబంధం లేని మనకు ఈ ప్రదక్షిణలు చేయావలసిన ఏముందని కొంతమందికి సందేహం కలగవచ్చు. దీనికి జవాబుగా పండితులు ఈ విధంగా విశ్లేషిస్తారు. ‘‘మనకు కనిపించే సృష్టికి ఆతిథ్యమిస్తున్న భూమి తన చుట్టూ తాను ప్రదక్షిణలు చేస్తూ వుంటుంది. 
భూమి ఈ విధంగా ప్రదక్షిణలు చేయడం వల్ల తనకు శక్తి వస్తుందా లేక తన శక్తిని నిలబెట్టుకోవడం కోసం ప్రదక్షిణలు చేస్తోందా..? అనే విషయం పక్కన బెడితే, భూమి ప్రదక్షిణ చేయకుండా వుంటే మరుక్షణమే ఏమైనా జరగవచ్చు. సృష్టి మొత్తం నాశనం కావచ్చు. అదేవిధంగా సూర్యుని చుట్టూ భూమి ప్రదక్షిణం చేస్తోంది. ఫలితంగా జీవరాశి మనుగడకు సూర్యునినుంచి శక్తిని పొందుతోంది. 

ఈ విధంగా భూమి ఆత్మప్రదక్షిణలు చేస్తూ, సూర్యుని చుట్టూ ప్రదక్షిణలు చేస్తోంది. అలాగే భక్తులు కూడా ఆత్మప్రదక్షిణలు చేయటం, విగ్రహం చుట్టూ తిరగడం పైన చెప్పిన విషయాలే సూచికగా వుంటాయి. ఇలా భ్రమణం చేయడం వల్ల దేవును నుంచి అతీతమైన జ్ఞానశక్తిని పొందడమే గాక, మనస్సుకు - శరీరానికి కూడా మేలు చేస్తుంది. దీనిని గుర్తించబట్టే కొన్ని తరాల నుండి కేవలం హిందువులు మాత్రమే ఇలా ప్రదక్షిణలు చేసే ఆచారాన్ని పాటిస్తూ వచ్చారు. 
ఎన్నిసార్లు చేయాలి? :
ప్రదక్షిణలు ఎన్నిసార్లు చేయాలనే విషయంపై ఇంతవరకు ఎవ్వరూ ఖచ్చితమైన నిర్ణయం తీసుకోలేదు, చేయలేదు కూడా. కొందరు మూడుసార్లు చేయాలని చెబితే, మరికొందరేమో అయిదు లేదా పదకొండు సార్లు చేయాలని సూచిస్తారు. ఇక్కడ ఒక విషయాన్ని గమనిస్తే.. ఎన్ని ప్రదక్షిణలైనా కానీ అవి బేసిసంఖ్యలో మాత్రమే వుంటాయి. అంటే 3, 5, 11, 108   ఇలా అన్నమాట! ఇలా ఎందుకు నిర్ణయించారనేది ఇంతవరకు జవాబు దొరకని ప్రశ్న! ఏ దేవుడి గుడికెళ్లే, ఆ గుడికి సంబంధించిన స్త్రోత్రం పఠిస్తూ ప్రదక్షిణలు చేయాలి. 
మనస్సు కేంద్రీకరించి ప్రదక్షిణ చేయడం చాలా ముఖ్యం! అలాగే స్త్రోత్రం మొత్తం తెలియాల్సిన అవసరం కూడా లేదు. ఎవరికి వారు తమకు తెలిసినంతవరకు మననం చేసుకుంటూ ప్రదక్షిణ చేస్తే సరిపోతుంది. అలౌకిక విషయాలను పక్కనబెడితే... ప్రదక్షిణ శరీరానికి, మనస్సుకు కూడా ఉపయోగకరంగానే వుంటుంది. 

Related Postings:

1.Dharma Sandehalu
2.Vastusastram
3.Horoscope
4.Astrology
5.Telugu panchangam

Keywords:

devotees, temples, hinduvulu, hindu temples in india, devotees in temples, pradakshina, devotees doing pradakshina, devotees news, temples news, temples latest,why devotees doing pradakshina in temples.bhakti samacharam, devotional information, pradakshinalu, sree sannidhi, ఏదేవుని ఆలయంలో ఎన్నిసార్లు ప్రదక్షణలు చేయాలి, దేవుని పూజ, ప్రదక్షిణలు, భక్తి సమాచారం, శ్రీసన్నిధి,ఏ దేవుని ఆలయంలో ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి?,ప్రదక్షిణలు చేసి దర్శనమా? దర్శనం తర్వాత ప్రదిక్షనలా? Dharma Sandehalu,Importance of Pradakshina in temple? గుడిలో ఎందుకు ప్రదక్షిణలు చేస్తారు?Significance of half pradakshina around Shivlinga,Why do we do Pradakshina in Temple ?,Do you know why do Pradakshina in Temple,దేవాలయంలో ప్రదక్షిణ ఎందుకు చేయాలో మీకు తెలుసా?108 
ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments