Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

Shani Shingnapur Temple Information History Pooja Timings Shirdi To Shani Shingnapur Route Map



మహారాష్ట్ర లోని ప్రసిద్ధ దేవాలయాలలో శని శింగణాపూర్ ఒకటి. ఈ ఆలయం షిర్డీకి సుమారు 90 కిమీ దూరం లో ఉంది. షిర్డీ యాత్ర లో భాగంగా షిర్డీ వెళ్లిన భక్తులు శని శింగణాపూర్ కూడా వెళ్తుంటారు. ఈ ఆలయం లో పూజలు ఆడవాళ్లు చేయకూడదు అని చెబుతుంటారు. నేను వెళ్ళినప్పుడు (9 -3-2019) అక్కడ చాలామంది ఆడవారు పూజలు చేయడం చూసాను . మాతో వచ్చిన ఆడవారు కూడా ఆ క్షేత్రానికి రాలేదు. షిర్డీ నుంచి 2 గంటల ప్రయాణం. మనకి షిర్డీ సాయిబాబా ఆలయం దగ్గర నుంచి మరియు సాయి భక్త నివాస్ రూమ్స్ దగ్గర నుంచి కూడా లోకల్ ట్రావెల్స్ వారు శని శింగణాపూర్ తీస్కుని వెళ్తున్నారు. 

మీరు షిర్డీ లో రూమ్స్ బయట తీసుకున్న మెయిన్ రోడ్ లోకి వస్తే చాలామంది ( వ్యా న్ , జీప్ ) శని శింగణాపూర్ అంటూ పిలుస్తున్నారు. మీకు వెళ్లిరావడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. సాయంత్రం 4 గంటలకు బయలుదేరిన దర్శనం చేస్కుని రావచ్చు.  షిర్డీ నుంచి శని శింగణాపూర్ తీస్కుని వెళ్లిరావడానికి మనిషికి 140 రూపాయలు తీసుకుంటున్నారు. 

స్థలపురాణం : 
ఇక్కడ శనీశ్వరునకు ప్రత్యేకంగా ఆలయం అంటూ ఏమి లేదు. ఇక్కడ స్వామి వారు స్వయంభు అని చెబుతారు .  ఒక నల్లటి  పొడవైన రాయి మాత్రమే ఉంటుంది. పూర్వం మేకలను మేపుకునే వారు శనీశ్వరుని రాయి అనుకుని పదునైన చువ్వతో రాయిని తాకగా ఆ రాయిలోంచి రక్తం రావడం చూసి వారు భయపడిపోయారు. ఈ అద్భుతాన్ని చూడ్డానికి చుట్టుప్రక్కల వారందరు వచ్చారు. ఆ రోజు రాత్రి మేకల కాపరి కలలో శనీశ్వరుడు కనిపించి నేను శనీశ్వరుడును అని చెప్పుకుంటూ అద్వితీయంగా కనిపిస్తున్న ఆ నల్లరాయి తనరూపమేనని చెప్పేను , కాపరి శనీశ్వరునితో దేవాలయం నిర్మించమంటారా అని అడగగా నాకు ఆకాశమే పై కప్పుయై నాకు నీడగా ఉంది  తాను బాహాటముగా ఉండుటకు ఇష్టపడతానని చెప్పెను. ప్రతిరోజూ పూజ చేస్తూ శనివారాలలో తప్పకుండా 'తైలాభిషేకం' చేయమని ఆయన గొర్రెల కాపరికి చెప్పెను. అంతేకాక మొత్తం పల్లెకి బందిపోటుల లేదా కన్నములు వేసే వారు లేదా దొంగల భయం ఉండదని మాట ఇచ్చెను.

యాత్రికులను ఎలా మోసం చేస్తారంటే :
శని దేవునకు ఉన్న  ప్రత్యేకత వేరు కదా .. భక్తి కంటే శనీశ్వరుడు అంటే భయమే ఎక్కువ. మనం షిర్డీ లో క్యాబ్ మాట్లాడుకుని శని శింగణాపూర్ చేరగానే మన కార్ డ్రైవర్ ఏదొక షాప్ దగ్గర కార్ ఆపుతాడు . అయన కావాలని ఆపినట్టు మనకు అనిపించదు. ఈ లోపు షాప్ లో నుంచి ఒక అతను వచ్చి తెలుగు లో రండి రండి ఇలా రండి నేను చెప్పేది వినండి అంటూ మన దగ్గరకు వస్తాడు. శనీశ్వరుని పూజ కొరకు తీస్కుని వెళ్లవలిసిన పూజ సామాగ్రి గురించి వివరంగా చెప్పి కనీసం 250 /- అడుగుతారు. ఆ సమయం లో మనకి పెద్ద అమౌంట్ ల కనిపించదు . 

మన పూజ సామాగ్రి బుట్ట లాంటిదే వేరొకరి చేతిలో చూసి మీకు ఎంత తీసుకున్నారు అని ఉండబట్టలేక అడిగితె 70 రూపాయలు అని చెబుతారు. అదేమిటి ఇంత తేడానా అని మోసపోయిన విషయాన్నీ మనం గ్రహిస్తాం . 
పూజ సామాగ్రి అంటే ఏముంటాయి ?:
పూజ సామాగ్రి లో మనకు ఒక పూల దండ , ఒక కొబ్బరికాయ ,  రెండు నల్లని గుడ్డలు , ఒక ఇనుప తో చేసిన చిన్న ముక్క, రెండు అగరొత్తులు , కొద్దిగా ఉప్పు , మంచి నూనె తో పాటు జిల్లేడు ఆకులతో చేసిన దండ , ఒక కాశి దాడు ఉంటుంది . 

వీటిని ఏమి చేయాలి ?
మనం ముందుగా చెప్పుకున్నట్టు ఇక్కడ శనీశ్వరునికి ప్రత్యేకంగా గుడి ఏమి ఉండదు. ఇంతక ముందు ఏమో కానీ ఇప్పుడు శనీశ్వరుని దగ్గరకు వెళ్లనివ్వడం లేదు. మనం దర్శనానికి వెళ్లే సమయం లో క్యూ ఉంటుంది . అక్కడ త్రిసూలం కనిపిస్తుంది అక్కడ వారు త్రిసూలానికి నల్లటి గుడ్డలను గుచ్చుతున్నారు . మనకి ఇచ్చిన జిల్లేడు ఆకుల దండను త్రిసూలానికి వేస్తున్నారు . ఆ రెండు వేసి ముందుకు వెళ్తే కొబ్బరికాయలు వేయడానికి బుట్టలు ఉంచారు . కొబ్బరి కాయ కొట్టడం లేదు . ఆ బుట్టలో వేసి మనం ముందుకు కదలాలి . ఆ తరువాత అగరవత్తులు వేయడానికి ఒక బాక్స్ ల ఉంది .. మనం వెలిగించి గుచ్చడానికి లేదు ఆ మంటలో వెయ్యడమే . కాస్త ముందుకు జరిగితే మనం దగ్గర ఉన్న నూనె , ఉప్పు , ఐరన్ ప్లేట్ , వీటిని వేయడానికి టేబుల్ లాంటిది ఐరన్ ఉంది వాటి లో నుంచి నూనె క్రిందకి వెళ్ళడానికి చిన్న రంధ్రాలు ఉన్నాయి. మనం ఉప్పు ప్యాకెట్  దానిపైన ఐరన్ ప్లేట్ పెట్టి ఆయిల్ పొయ్యాలి . వీటితో పాటు నల్లటి గుడ్డను చుట్టుని ఒక బొమ్మల ఉంటుంది అది స్వామి వారి దగ్గర ఉంచుతున్నారు . కొందరు కాశి తాడును చేతికి కట్టుకుంటుంటే మరీకొందరు శనీశ్వరుని చుట్టూ ఉన్న ఐరన్ రోడ్ లకు కడుతున్నారు . 

జాగ్రత్తలు : 
శనీశ్వరుని దర్శనం అయినా తరువాత తిరిగి వెనక్కి చూడకూడదు . కానీ అక్కడ జనాలు సెల్ఫీల లు తీసుకుంటున్నారు . మీరు పూజ సామాన్లు టెంపుల్ దగ్గర్లో తీస్కోండి . కరెక్ట్ గా చెప్పాలంటే శనీశ్వర దేవాలయం అని బోర్డు ఉంటుంది . ఆ బోర్డు కి ఎదురుగా చిన్న షాప్ లో ఆయిల్ మాత్రమే అమ్ముతారు. మేము అక్కడ ఆయిల్ కొనబోతుంటే ఒక అతను వచ్చి పూజ సామాన్లు మొత్తం 50 రూపాయలకు ఇస్తాను అని తనతో రమ్మన్నాడు . ఆ షాప్ నుంచి కాస్త వెనకాల ఉంది ఈ షాప్ . కార్ వాడు తీస్కుని వెళ్లిన షాప్ లో  మీకు 200 - 300 చెబుతుంటే వద్దు అని చెప్పండి . 

Shani Shingnapur Temple Address :
Shanishingnapur, Post: Sonai,
Taluka: Nevasa, 
Dist.: Ahamadnagar Pin. 414 105.
Maharashtra, India.

Phone Numbers : 02427 238110 , 02427 238108


KEYWORDS : Maharasthra Famous Temples, Shani Singanapure , Shani Shingnapure Pooja Details, Shirdi To Shani Shingnapur Distance , Rooms Booking Online Shani Shingnapure, how to plan shani singnapur , shani singnapure temple information in telugu.

Comments

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు