Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

Bhagavatam Computations | Virava Village 2019 | Bhagavatam Bhagavadgeeta Drawing Computations

భాగవత పోటీలు 2019
తూర్పుగోదావరి జిల్లాలో పిఠాపురం మండలం లో చిన్న పల్లెటూరు మాది , ఊరు పేరు విరవ.  మా ఇంటికి దగ్గర్లో ఉన్న రామాలయం లో మొదట్లో మా ఇంటికి చుట్టుప్రక్కల ఉన్న పిల్లలకు భాగవత పద్యాలూ నేర్పిస్తూ ఉండేవాణ్ణి తెలుగు భాగవతం వెబ్సైటు లోని ఆడియో ల సహాయం తో , ఇప్పుడు హైందవి వారి ఆడియో లు సహాయం తో భగవద్గీత మొదలుపెట్టాను. 

తెలుగు భాగవతం వెబ్సైటు వారు గత రెండు  సంవత్సరాలు గా  కృష్ణాష్టమి వేడుకలు  మా గ్రామం లో కూడా నిర్వహించి పిల్లలకు డ్రాయింగ్ , పద్యాలు పోటీ పెట్టి బహుమతుల ప్రదానం చేస్తారు .. ఈ సంవత్సరం ఇంకాస్త ఎక్కువగా చేయదలచాను అందుకనే గ్రామం లో ఉన్న అన్ని స్కూల్స్ కి వెళ్లి పిల్లలకు డ్రాయింగ్ పోటీలు , గత రెండు మూడు సంవత్సరాలుగా నేర్పిస్తున్న భాగవతం , కొత్తగా నేర్చుకుంటున్న భగవద్గీత పోటీలు కూడా నిర్వచించి . పోటీలో పాల్గొన్న అందరికి ఉచిత భగవద్గీత పుస్తకాలూ ఇవ్వదలిచాను . భగవద్గీత పుస్తకం తో ఒక పెన్ కూడా అందరికి .. విజేతలకు విడిగా వేరే బహుమతులు ఇవ్వదలిచాను . 

ఈ రోజు (8-9-2019)  ఆదివారం కావడం తో ఉదయం 1వ తరగతి నుంచి 5 వ తరగతి వరకు బొమ్మల పోటీ , వీరికి మనం బొమ్మ ఇస్తాము రంగులు వేయాలి . మధ్యాహ్నం 6వ తరగతి నుంచి 10 వ తరగతి వరకు వీళ్ళు సొంతంగా నచ్చిన శ్రీ కృష్ణుని బొమ్మ వేయాలి . 

14వ తేదీన పోటీలో పాల్గొన్న అందరకి విరవ  ఎలిమెంటరీ స్కూల్ - 1  లో ప్రైజ్ లు ఇవ్వబడును . 

ఈ పోటీలలో మొత్తం 118 మంది పాల్గొన్నారు . కొన్ని ఫొటోస్ ఇక్కడ చూడవచ్చు 








పోటీలో పాల్గొన్న అందరికి ప్రైజ్ లు ఇస్తాం కానీ వారికి తప్పకుండా ప్రార్ధన శ్లోకాలు రావాలని షరతు  :) 

శ్రీధర్ మాన్యాల గారు భగవద్గీత పుస్తకాలు  కొనడానికి 2000 రూపాయలు పంపించారు . 
అపర్ణ కిషోర్ గారు పిల్లలకు 40 పెన్ లు పంపించారు . 


Comments