Today Tirumala Darshan Information:

నమస్కారం హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం. టెంపుల్స్ గైడ్ కాల్ సెంటర్. కాల్ సెంటర్ వారికి జీతాలు ఇవ్వాలి కాబట్టి టెంపుల్స్ గైడ్ సభ్యత్వం ఉన్న వారికి మాత్రమే కాల్ చేసే అవకాశం ఉంటుంది. జీవితకాల సభ్యత్వం 100 రూపాయలు మాత్రమే. 8247325819 ఈ నంబర్ కు gpay లేదా ఫోన్ పే చేయగలరు.

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***అరుణాచలంలో కార్తీక మహా దీపం డిసెంబర్ 6న గురువారం సాయంత్రం 4 గంటలకు వెలిగిస్తారు.**చార్ ధామ్ యాత్ర 2022 సమాచారం : అక్టోబర్ 26న గంగోత్రి , 27న కేదార్నాథ్ మరియు గంగోత్రి ఆలయాలు మూసివేస్తారు . చివరిగా బద్రీనాథ్ ఆలయాన్ని నవంబర్ 19న మూసివేస్తారు మరల 6 నెలల తరువాత అక్షయ తృతీయ నాడు చార్ ధామ్ యాత్ర ప్రారంభం అవుతుంది. ** కాణిపాకం ఆలయ నిర్మాణం పూర్తీ అయింది దర్శనాలు జరుగుతున్నాయి.** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు . ** అరుణాచలంలో కార్తీక దీపోత్సవం 10 రోజులు జరుగుతుంది నవంబర్ 27వ తేదీ నుంచి డిసెంబర్ 6వ వరకు. మహాదీపం డిసెంబర్ 6న పెడతారు** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారు శివరాత్రి నాడు భక్తుల రద్దీ అధికంగా ఉండటం వలన ఆ రోజు చెయ్యరు. రాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

Ajanta Ellora Caves in India - Buddhist Pilgrimage Site in Maharashtra

అజంతా ఎల్లోరా అందాలు :
అజంతా, ఎల్లోర గుహలు భారతీయ చరిత్రకు, సంస్కతి, సంప్రదాయాలకు నిలువుటద్దాలు. అందువల్లే అవి ప్రపంచ నలుమూలల నుంచి పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఈ అజంతా ఎల్లోరా గుహలు కొండను తొలచి నిర్మించిన గుహాలయాలు. ఇవి ఔరంగాబాద్ కు దగ్గరగా ఉన్నాయి. కనులు తిప్పుకోనీయని అందాలు అజంతా సొంతం. అజంతా, ఎల్లోరా గుహలు భారతీయ శిల్పకళలకు తార్కాణం. హిందూ, బౌద్ధ, జైన మతాలకు సంబంధించిన శిల్పకళారీతులు ఒకే చోట కనువిందు చేస్తాయి. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఘృష్ణేశ్వరుడు ఇక్కడ కొలువుతీరి ఉన్నాడు.మరోవైపు ఎల్లోరా గుహలు 5 నుంచి 10 శతాబ్దాల మధ్య నిర్మించారు. అంటే అజంతా గుహలే పురాతనమైనవని నిపుణులు చెబుతున్నారు. ఈ ఎల్లోరా గుహలను మరో మూడు ఉప గుహాలయాలుగా విభజించారు.

అందులో ఒకటి హిందు దేవుళ్ల విగ్రహాలు ఉంటే మరో రెండింటిలో వరుసగా జైన, బుద్ధ విగ్రహాలు ఉన్నాయి. ఇలా అన్ని ముఖ్యమైన ధర్మాలకు సంబంధించిన విగ్రహాలను ఇక్కడ మనం చూడవచ్చు. అందువల్లే ఇక్కడకు అన్ని ధర్మాలకు చెందిన పర్యాటకులు వస్తుంటారు.

ఇందులో బౌద్ధ చైత్యాలు, ప్రార్థనా మందిరాలు, విహారాలు, ఆరామాలు, హిందూ, జైన దేవాలయాలు ఉన్నాయి. మూడు మతాల భావ సంగమం ఇది. ఎల్లోరాని అక్కడి స్థానికులు వేరులిని అని పిలుస్తారు. ఎల్లోరాను దర్శించడానికి ఆగస్టు-అక్టోబరు మధ్య కాలం అనువైనది. కాని విద్యార్థులకు వేసవి సెలవుల కారణంగా మే-జూన్ నెలలలో పర్యాటకులు అధికంగా వస్తారు.

పెయింటింగులతో నిండి ఉండే ఈ గుహలు సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తాయి. గుహల పైకప్పు, పక్కభాగాలలో బుద్ధుని జీవిత విషయాలను చిత్రీకరించారు. గోడలపై బుద్ధుని జీవిత విషయాలను వర్ణించే చిత్రాలు ఉంటాయి. ఈ చావడికి ఎడమవైపున ఉన్న హాలులో వేటగాడు పన్నిన వలనుంచి పావురాన్ని రక్షిస్తున్న శిబిచక్రవర్తి చిత్రం, జాతక కథలు ఉన్నాయి.

రెండో గుహలో బుద్ధుని పుట్టుకను చిత్రించారు. దాని పైకప్పు మీద హంసలు బారులు తీరిన దృశ్యం ఎంతో బాగుంటుంది. ఇంకా అప్పట్లో వారు వాడిన మఫ్లర్లు, పర్సులు, చెప్పులు వంటి వాటిని కూడా చిత్రించారు. 16వ నెంబరు గుహలో బుద్ధుని జీవితంలో ఎదురైన అనేక సంఘటనలను మనం చూడొచ్చు. క్రీస్తు పూర్వం 2-7 శతాబ్దాల మధ్య కాలంలో వీటిని చిత్రీకరించినట్టు చారిత్రక ఆధారాలు చెపుతున్నాయి. అప్పుడు వేసిన చిత్రాలకు గల రంగులు ఇప్పటికీ ఉండడం చిత్రంగానే ఉంటుంది.

అజంతా గుహలు ఉదయం 9 నుంచి రాత్రి 9.30 వరకూ అజంతా గుహలను సందర్శించుకోవచ్చు. సోమవారం సెలవు. ప్రవేశరుసుం చిన్నపిల్లలకు లేదు. పెద్దలకు రూ.10. కెమరాకు రూ.25 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. విదేశీయులకు రూ.250.


ఎల్లోరా గుహలు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకూ వారంలో ఏడు రోజులూ సందర్శించవచ్చు. పిల్లలకు ప్రవేశ రుసుం లేదు. పెద్దలకు రూ.10 కెమరాకు రూ.25. విదేశీయులకు రూ.250. సాధారణంగా అజంతా గుహలను చూసిన వారు ఎల్లోరా గుహలను చూడకుండా వెనుతిరగరు.


ఔరంగాబాద్ నుంచి అజంతా గుహలు 104 కిలోమీటర్ల దూరంలో ఉంటే ఎల్లో గుహలు కేవలం 29 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. ఇక ఈ రెండింటి మధ్య దూరం 100 కిలోమీటర్లు. భారత దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఔరంగాబాద్ చేరుకోవడానికి బస్సులు, రైళ్లు, విమానాలు నిత్యం అందుబాటులో ఉంటాయి

ఎల్లోరా గుహల్లో మొత్తం 34 గుహాలయాలు ఉన్నాయి. వీటిలో వేటికదే ప్రత్యేకమైనది. ఇందులో 1, 2, 16 గుహాలయాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎక్కడా లేనట్లు ఇక్కడ బుద్దుడు సింహం పై గుర్చొన్నట్లు విగ్రహాన్ని చెక్కారు. అదే విధంగా బుద్ధుడు ఒక పద్మాన్ని పట్టుకొన్నట్లు చిత్రించిన పెయింటింగ్, విగ్రహాలు కూడా చూడదగినవే.

ajanta ellora caves best time to visit, ajanta ellora caves from mumbai, ajanta ellora caves images, ajanta caves painting, ajanta ellora caves from pune, ajanta caves timings, ajanta caves photos, project on buddhist caves ajanta, ajanta ellora caves telugu history, ajanta ellora caves images,

Comments

Popular Posts