Swaminathaswamy Temple,Swamimalai | Tamil Nadu Famous Temples | స్వామిమలై క్షేత్రం


సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరుపడైవీడు క్షేత్రాలను దర్శించినట్లైతే జాతకం లో ఉన్న కుజదోషం , నాగ సంబంధ దోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఆరుపడైవీడు క్షేత్రాలలో 5వ ది స్వామిమలై క్షేత్రము . ఆరుపడైవీడు క్షేత్రాలు వరసగా  పళని స్వామిమలై తిరుత్తణి పజ్హముదిర్చోలై  తిరుచెందూర్ తిరుపరంకున్రం . స్వామిమలై క్షేత్రం లో స్వామి వారిని స్వామినాథ స్వామి అని కొలుస్తారు . స్వామినాథ అంటే గురు స్వరూపం. అసలు స్వామి అనే మాట అమరకోశం ప్రకారం ఒక్క సుబ్రహ్మణ్యుడిదే. ఎందుచేతనంటే “దేవసేనాపతీ, శూరః, స్వామీ, గజముఖానుజః “ అని అర్ధంగా ఇవ్వబడింది. తరువాత స్వామి అనే పేరు వేరే స్వరూపాలు కూడా తీసుకున్నా, అన్నీ సుబ్రహ్మణ్య స్వరూపాలే అని అనుకోవాలి. అందుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని పిలిచినా, కేవలం స్వామీ అని పిలిచినా అది సుబ్రహ్మణ్యుడికే చెందుతుంది అని చెప్పింది అమరకోశం.

స్వామిమలై క్షేత్రం తమిళనాడు లో గల కుంభకోణం క్షేత్రానికి 8 కిమీ దూరం లో ఉంది. మరియు తంజావూరు బ్రహదీశ్వర క్షేత్రానికి 35 కిమీ దూరం ఉంది. చిదంబరం క్షేత్రం నుంచి 76 కిమీ దూరం ఉంది. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే స్వామి మలై క్షేత్రం నుంచి త్యాగరాజ స్వామి ఆరాధన ఉత్సవాలు జరిగే ప్రదేశం తిరువైయారు క్షేత్రం ఇక్కడ 25 కిమీ దూరం లో ఉంది. త్యాగరాజ స్వామి వారి బృందావనం ( సమాధి ) ఇక్కడుంది. 

స్వామిమలైలో సుబ్రహ్మణ్య స్వామి వారి మందిరం పైన ఉంటంది, క్రింద, మీనాక్షీ, సుందరేశ్వరుల మందిరములు ఉంటాయి. ఇక్కడే అగస్త్య మహర్షికి ద్రవిడ వ్యాకరణం బోధించారు సుబ్రహ్మణ్యుడు.  ఈ క్షేత్రము అరవై మెట్లు ఉన్న ఒక కొండ మీద ఉంటుంది. ఈ అరవై మెట్లు మన అరవై సంవత్సరాలకు సంకేతము. కొండ పైన సుబ్రహ్మణ్యుని మందిరం వెలుపల విఘ్నేశ్వర స్వామి వారి మందిరం ఉంటుంది.
ఎవరైనా స్వామి వారి యొక్క ఆర్జిత సేవలు చేసుకోవడానికి లోపలి వెళ్ళే ముందు, విఘ్నేశ్వరుని వద్ద సంకల్పము చేసుకుని లోపలకి వెడతారు. స్వామినాథ స్వామి వారిని కీర్తిస్తూ శ్రీ నక్కీరన్ ఆయన చేసిన “ తిరుమురుకాట్రుపడై “లో ఎన్నో కీర్తనలు చేశారు. అంతే కాక అరుణగిరినాథర్ “తిరుప్పుగళ్”లో కూడా స్వామినాథ స్వామిని కీర్తించారు.

స్వామిమలై క్షేత్రం కుంభకోణం నుండి చాలా దగ్గరలో ఉండడం వల్ల, వసతి కుంభకోణంలో చూసుకోవడమే ఉత్తమం. స్వామిమలైలో అంత ఎక్కువగా వసతి సదుపాయాలూ లేవు. కుంభకోణం కూడా ప్రఖ్యాత పుణ్య క్షేత్రము అవడం వల్ల ఇక్కడ ఎన్నో హోటళ్ళు ఉన్నాయి.
ఆరుపడైవీడు క్షేత్రాలపై క్లిక్ చేసి ఆ క్షేత్రాల గురించి తెలుసుకోండి : 
1 . పళని 
2. తిరుత్తణి
3. స్వామిమలై
4. పళముదిర్చోళై 
5. తిరుప్పరంకుండ్రం

6. తిరుచెందూర్

Keywords : swamymalai , swamymalai kshetram , swamymalai temple , swamymalai timings, swamy malai temple direction, swamymalai temple route map , swamymalai temple history. arupadaiveedu kshetras list. 

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS