Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

ఈ వారం రాశిఫలాలు | This Week Horoscope in Telugu | Horoscope PDF Downloadమేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)

శుభకాలమిది. చేపట్టిన పనుల్లో పురోగతి ఉంటుంది. మీలోని నైపుణ్యంతో పెద్దలను ఆకట్టుకుంటారు. కీలక వ్యవహారాల్లో మిత్రుల సహకారం లభిస్తుంది. మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. మీ అధికార పరిధి పెరుగుతుంది. బంధుమిత్రులను కలుస్తారు. ఎన్నాళ్ళ నుండో ఎదురుచూస్తున్న ఒక ఫలితం ఇప్పుడు వస్తుంది. స్థిరాస్తికి సంబంధించిన పనుల్లో ముందడుగు వేస్తారు. పనితీరుకు ప్రశంసలు అందుతాయి. కుటుంబంలో కొన్ని సమస్యలు వస్తాయి. ఇష్టదైవ ధ్యానం శుభప్రదం.


వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)

చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆరోగ్యపరంగా కొంత చికాకులు. నిరుద్యోగులు కోరుకున్న ఉద్యోగాలు సాధిస్తారు. శుభవార్తా శ్రవణం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్య ఒకటి పరిష్కరించుకుంటారు. ఆస్తుల కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. వాహనాలు కొంటారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయవర్గాలకు చిక్కులు తొలగుతాయి. వారం మధ్యలో శ్రమాధిక్యం. బంధువులతో వివాదాలు. గులాబీ, ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.


మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)

చేపట్టే పనుల్లో అవరోధాలు అధికమవుతాయి. కీలక విషయాల్లో ఆచితూచి ముందుకు సాగాలి. సందేహం వచ్చినప్పుడు అనుభవజ్ఞులను సంప్రదించడం ఉత్తమం, సొంత నిర్ణయాలు వద్దు. చేపట్టే పనుల్లో ఆటంకాలు అధికమవుతాయి. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోకండి. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. పెద్దలు మీకు అనుకూలముగా వ్యవహరించి, అనుకూల నిర్ణయం తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో వాదనకు దిగకపోవడమే మంచిది. అవసరానికి మించి ఖర్చులు జరిగే సూచనలు ఉన్నాయి. ఇష్టదైవాన్ని స్మరించండి.


కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)

ఎంతటి పనినైనా అవలీలగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఒక సమస్య నుంచి బయటపడతారు. భూములు, వాహనాలు కొంటారు. ఆనుకోని ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఉన్నతహోదాలు దక్కే అవకాశం. పారిశ్రామిక, కళారంగాల వారికి విదేశీ పర్యటనలు. వారం చివరిలో స్వల్ప అనారోగ్యం. ధనవ్యయం. ఆకుపచ్చ, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.
సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)

ఆర్థికంగా మంచి ఫలితాలుంటాయి. వృత్తి, వ్యాపార రంగాల్లో మీ పనికి తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. అవరోధాలు తొలుగుతాయి. ముఖ్య విషయాల్లో పెద్దల సలహాలు తప్పనిసరి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. సున్నితమైన అంశాల్లో ఎదుటివారి మనోభావాలు దెబ్బతినకుండా మాట్లాడాలి. అనవసర ధనవ్యయం జరిగే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో అభిప్రాయ బేదాలు రాకుండా చూసుకోవాలి. గణపతి ధ్యానం శుభప్రదం.


కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)

దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. భూములు, వాహనాలు కొంటారు. అనుకోని ఇంటర్వ్యూలు అందుతాయి. మీ శక్తిసామర్థ్యాలు వెలుగులోకి వస్తాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆస్తుల వివాదాలు కొలిక్కి వస్తాయి.  వ్యాపారాలలో కొన్ని సమస్యలు అధిగమిస్తారు, పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో చికాకులు తొలగి ఊరట చెందుతారు. రాజకీయ, కళారంగాల వారికి విదేశీ పర్యటనలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. నీలం, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.


తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)

మధ్యమ ఫలితాలున్నాయి. ధైర్యంగా పనులను ప్రారంభించండి, మంచి ఫలితాలు సాధిస్తారు. ఆశించిన ఫలితాలు రావటానికి ఎక్కువగా కష్టపడాలి. ముఖ్య విషయాల్లో సందర్భోచిత నిర్ణయాలు తీసుకోండి, మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. చేపట్టిన పనుల్లో కొన్ని సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. ఒత్తిడి పెరగటం వల్ల మనశ్శాంతి తగ్గుతుంది. వారాంతంలో మేలైన ఫలితాలు సిద్ధిస్తాయి. ఆరోగ్యం ఫరవాలేదనిపిస్తుంది. లక్ష్మీ ఆరాధన శుభప్రదం.


వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)

అనుకున్న పనులు కాస్త నెమ్మదిస్తాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. కోర్టు వివాదాలు కొలిక్కి వస్తాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. సభలు ,సమావేశాలలో పాల్గొంటారు. తీర్థయాత్రలు చేస్తారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో చికాకులు తొలగుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు శ్రమానంతరం ఫలితం కనిపిస్తుంది. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్య సూచనలు. గులాబీ, పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.


ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)

మిశ్రమ ఫలాలున్నాయి. చేపట్టే పనిలో శ్రమ పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. ముఖ్యమైన కార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి. బాధ్యతలు పెరుగుతాయి. అనవసర విషయాల్లో తల దూర్చకండి. ఎవ్వరితోనూ వాదోపవాదాలు చేయకండి. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని ముందుకు సాగుతారు. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ప్రతి చిన్న విషయాన్ని లోతుగా చూడకూడదు. కలహ సూచన ఉంది, కాబట్టి మాటను అదుపులో పెట్టుకోవాలి. మనశ్శాంతి తగ్గకుండా చూసుకోవాలి. నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదవాలి.


మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)

పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. సంఘంలో విశేష గౌరవం పొందుతారు. చిన్ననాటి మిత్రులతో వివాదాలు పరిష్కారమవుతాయి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. ఆప్తుల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది. వివాహాది వేడుకలలో పాల్గొంటారు. ఆస్తుల వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు దక్కుతాయి. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు శుభవార్తలు అందుతాయి. వారం చివరిలో అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. ధవవ్యయం. నీలం, ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)

అదృష్ట యోగాలున్నాయి. భవిష్యత్తు లాభదాయకంగా ఉంది. మీ మీ రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. కుటుంబ సభ్యుల సహకారం సంపూర్ణంగా ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాల్లో పురోగతి ఉంటుంది. సమాజంలో తోటివారికి ఉపయోగపడే పనులు చేస్తారు. తోటివారికి ఆదర్శంగా నిలుస్తారు. స్వస్థాన ప్రాప్తి ఉంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. విష్ణు సహస్రనామం చదివితే మంచిది.


మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)

పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటారు. శ్రమకు ఫలితం కనిపిస్తుంది. ఆర్థిక విషయాలు కొంత కలసివస్తాయి. సభలు,సమావేశాలలో పాల్గొంటారు. ఎంతటి వారినైనా ఆకట్టుకుంటారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకున్న హోదాలు దక్కించుకుంటారు. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. మిత్రులతో వివాదాలు. ఎరుపు, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. అంగారక స్తోత్రాలు పఠించండి.Keywords : Horoscope , Weekly Horoscope , Favorite Horoscope,  Horoscope PDF Download


Comments

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు