దశావతారాలు పేర్లు :
అర్జునా! ధర్మమునకు హాని కలిగినప్పుడును, ఆధర్మము పెచ్చుపెరిగి పోవుచున్నప్పుడును (జన్మ కర్మ రహితుడనైనప్పటికిని) నన్ను నేను సృజించు కొందును. సత్పురుషులను పరి రక్షించుటకును, దుష్టులను రూపు మాపుటకును, ధర్మమును సుస్థిర మొనర్చుటకును నేను ప్రతి యుగమునందును అవతరించుచుందును. భగవద్గీతలో శ్రీకృష్ణుని సందేశం.
దశావతారాలు :
మత్స్యావతారము :
మత్స్యం అనగా చేప. ఈ అవతారంలో విష్ణువు రెండు పనులు చేసినట్లుగా పురాణ గాథ (1) ప్రళయకాలంలో జీవరాసులను నావలో జలనిధిని దాటించడం. (2) వేదాలను కాపాడడంకూర్మావతారము :
కూర్మము అనగా తాబేలు. దేవదానవులు అమృతము కోసము పాలసముద్రాన్ని మథించడానికి మందర పర్వతాన్ని కవ్వంగా నిర్ణయించి, పాలసముద్రంలో వేస్తే అది కాస్తా ఆ బరువుకి పాలసముద్రంలో మునిగిపోతుంటే, విష్ణుమూర్తి కూర్మావతారములో దానిని భరిస్తాడు. ఇది కృతయుగం లో సంభవించిన అవతారంవరాహావతారము :
వరాహావతారం హిరణాక్షుడిని చంపి, భూమిని ఉద్ధరించి, వేదములను కాపాడిన అవతారము.నృసింహావతారము :
లేదా నరసింహావతారము : భక్తప్రహ్లదుని తండ్రి హిరణ్యకశిపుని నరసింహ అవతారం లో సంహరించాడు.వామనావతారము :
వామనుడు లేదా త్రివిక్రముడు, బలిచక్రవర్తి దగ్గర ముడగుల నేల అడిగి రెండగులతోనే విశ్వానంత కొలిచిన అవతారమే వామన అవతారము.పరశురామావతారము :
అధికార బల మదాంధులైన క్షత్రియులను శిక్షించిన అవతారమిది. పరశురాముని భార్గవరాముడు, జామదగ్ని అని కూడా అంటారురామావతారము :
ఒక్క రావణ సంహారం కోసమే కాకుండా మానవుడు ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా ధర్మాన్ని ఎలా అనుసరించాలో, స్వయానా తాను నడిచి చూపించిన అవతారమే రామావతారం .కృష్ణావతారము :
జగద్గురువుగా భగవద్గీత భోదించి ధర్మాన్ని నమ్ముకున్న వారికే తానే దగ్గరుండి వారి కష్ట సుఖాలు తనవిగా భావిస్తానని చూపించిన అవతారమే కృష్ణావతారం.వేంకటేశ్వరావతారము :
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి. వేం = పాపాలు, కట=తొలగించే, ఈశ్వరుడు=దేవుడుకల్కివతారము :
కలియుగాంతములో విష్ణువు కల్కిగా అవతరించనున్నట్లు భావిస్తారు. ఇతను "శంభల" అను గ్రామములో విష్ణుయశస్సు అను బ్రాహ్మణుని ఇంటిలో జన్మిస్తాడు. వీర ఖడ్గం ధరించి, తెల్ల గుర్రంపై స్వారీ చేస్తూ, దోపిడీ దొంగలుగా మారిన అందరు నాయకులను సంహరించి తిరిగి సత్య యుగమును ధరణి పై స్థాపిస్తాడు.ఇవి కూడా చూడండి :
అష్టాదశ పురాణాలూ సనాతన ధర్మ మూలాలు మహాభారతం రామాయణం వేదాలు 1965-2020 వరకు గల పంచాంగాలు.
Keywords : Dashavataralu , Hindu Temples Guide, Sanathana Dharmam, Vedas, Puranas,
Tags
Sanathana Dharma