Drop Down Menus

Astadasa Puranam Names | Astadasa Puranam Slokam in Telugu


అష్టాదశ పురాణాలూ వాటి పేర్లు పురాణ లక్షణాలు :


పురాణములు ఎన్ని అని తెలియచేసే శ్లోకం :


మద్వయం భద్వయం చైవ బ్రత్రయం వచతుష్టయం
అనాపద్లింగకూస్కాని పురాణాని పృథక్ పృథక్

"మ" ద్వయం -- మత్స్య పురాణం, మార్కండేయ పురాణం

"భ" ద్వయం -- భాగవత పురాణం, భవిష్య పురాణం

"బ్ర" త్రయం -- బ్రహ్మ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, బ్రహ్మాండ పురాణం

"వ" చతుష్టయం -- విష్ణు పురాణం, వరాహ పురాణం, వామన పురాణం, వాయు పురాణం

మిగిలిన వాటి పేర్ల మొదటి అక్షరాలు మాత్రమే తీసుకుని శ్లోకపాదం కూర్చటం జరిగింది:


-- అగ్ని పురాణం

నా -- నారద పురాణం

పద్ -- పద్మ పురాణం

లిం -- లింగ పురాణం

-- గరుడ పురాణం

కూ -- కూర్మ పురాణం

స్క -- స్కంద పురాణం

వైష్ణవ పురాణాలు :


విష్ణు పురాణం, భాగవత పురాణం, నారద పురాణము, గరుడ పురాణం, పద్మ పురాణము, వరాహ పురాణం, వామన పురాణము, కూర్మ పురాణం, మత్స్య పురాణము

బ్రహ్మ పురాణాలు :


బ్రహ్మ పురాణము, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, మార్కండేయ పురాణము, భవిష్య పురాణం

శైవ పురాణాలు:

శివ పురాణము, లింగ పురాణము, స్కంద పురాణం, అగ్ని పురాణం

పురాణ లక్షణాలు :


వ్యాస భాగవతంలో పది మహాపురాణ లక్షణాలున్నాయి:

(1) సర్గము (2) విసర్గము (3) వృత్తి (4) రక్షణము (5) మన్వంతరము (6) వంశము (7) వంశానుచరిత (8) నిరోధము (9) హేతువు (10) అపాశ్రయం.

పురాణం పంచలక్షణం :

సర్గము : గుణముల పరిణామమైన సృష్టి సామాన్యం
ప్రతి సర్గము : భగవంతుడు వరాడ్రూపాన్ని గ్రహించడం
వంశము : దేవతల, రాక్షసుల, మనువుల, ఋషుల, రాజుల వంశావళి
మన్వంతరము : ఆయా కాలాలలో వర్ధిల్లినవారి ధర్మావలంబన
వంశానుచరితం : రాజ వంశాల వర్ణన.



ఇవి కూడా చూడండి :

సనాతన ధర్మ మూలాలు    వేదాలు   రామాయణం   మహాభారతం   1965-2020 వరకు గల పంచాంగాలు   ఆధ్యాత్మిక పుస్తక నిధి.


KeyWords : Astadasa Puranam Names, Astadasa Puranam Slokam , Puranams, Vedas, Hindu Temples Guide
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.