నల్గొండ జిల్లాలోని ప్రముఖ దేవాలయాల జాబితా :
1. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం , యాదాద్రి :
యదా మహర్షి తపస్సు కి మెచ్చి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఈ కొండ పై వేలిసారు. స్వామి లక్ష్మీ సమెతంగా ఈ ఆలయంలో దర్శించవచ్చు. ఈ ఆలయంలో 2 ఆలయాలు కలవు. 1. కొత్త ఆలయం ,2 పాత గుట్ట . ఈ పాత గుట్ట ఆలయనికి బస్ స్టాండ్ నుంచి ప్రైవేట్ వాహనాలు బయలుదేరుతాయి. హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ బస్ లు అందుబాటలో ఉన్నాయి. భువనగరిలో ట్రైన్ లో వచ్చి అక్కడి నుంచి ఆటో లో కూడా ఈ ఆలయం కి చేరుకోవచ్చు. ప్రస్తుతం ఈ కొత్త ఆలయం కొత్త రూపురేఖలు దిద్దుకుంటుంది. ఈ క్షేత్ర పాలకుడు శ్రీ ఆంజనేయ స్వామి.
ఆలయ దర్శించే సమయం : 5.00AM TO 2.00PM - 3.30PM TO 9.30PM.
2. ఛాయా సోమేశ్వర ఆలయం , పానగల్లు :
ఈ ఆలయంలో ప్రధాన దేవత మూర్తి శ్రీ శివ స్వామి. ఈ ఆలయంలో శివ అలయంతో పాటు నంది మండపాలు కలవు. దీనికి 66 స్తంభాలు కలవు. ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయంలో మరెక్కడా కనిపించని విశేషం ఉన్నది. ఆలయ గర్భాలయంలోని శివ లింగాన్ని నీడ(ఛాయా) కప్పేయడం విశేషం. కానీ ఆ నీడ ఏ స్తంభం నుంచి వస్తుందో ఇప్పటికీ అంతు చిక్కదు. ఒకనాటి కాకతీయ సమంతులైన కందురు చోళులు క్రీ. శ 10-11 మధ్య శతాబ్ధంలో ఈ ఆలయన్ని నిర్మించినట్టు అక్కడి శాసనాల ఆధారంగా తెలిసింది.
ఆలయ దర్శించే సమయం : 6.00AM TO 12.00PM - 4.00PM TO 8.00PM.
3. సురేంద్రపురి , యాదాద్రి :
కుంద సత్యనారాయణ కళాధమం ఈ ప్రాంతం. హైదరాబాద్ నుంచి 60 కి.మీ దూరంలో కలదు. భారత పురాతన ఇతిహాసాలు , కథలు , ఇక్కడ చాలా చూడవచ్చు. ఇది తన కుమారుడి జ్ఞాపకార్ధంగా కుందా సత్యనారాయణచే నిర్మించారు. భారతదేశంలోని ముఖ్యమైన దేవాలయాల ప్రతిరూపాలు ఇక్కడ చూడవచ్చు. పౌరాణిక దృశ్యాలు , శిల్పాలు , పూర్తిగా చూడవచ్చు. యాదాద్రి శ్రీ నరసింహ స్వామి ఆలయానికి వెళ్ళే దారిలోనే ఈ ప్రాంతం కలదు.
దర్శించే సమయం : 9.30AM TO 5.00PM.
4. శ్రీ హనుమాన్ ఆలయం , భువనగిరి :
ఈ అయం భువనగిరి అనే కొండ పై కలదు. ఈ కొండయే ఈ ప్రాంతానికి ప్రత్యేక ఆకర్షణ. రాజు విక్రమాదిత్య కాలంలో నిర్మించిన కోట కొండ పై చూడవచ్చు. ఈ కొండ పైకి ఎక్కి పట్టణం మరియు చుట్టుపక్కల గ్రామాల పక్షి ఫ=దృశ్యం ద్వారా గొప్ప అనుభవాన్ని పొందవచ్చు.
ఆలయ దర్శించే సమయం : 6.00AM TO 12.00PM - 4.00PM TO 6 .30PM.
5. శ్రీ పార్వతి జడలరామలింగేశ్వర స్వామి ఆలయం , నార్కెట్ పల్లి :
ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆలయం చేరువుగట్టు గ్రామం , నార్కెట్ పల్లి లో కలదు. శివరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. నార్కెట్ పల్లి నుంచి 6 కి. మీ దూరంలో కలదు.
ఆలయ దర్శించే సమయం : 6.00AM TO 12.00PM - 4.00PM TO 8.00PM.
6. లింగమంతుల ఆలయం , దూరజా పల్లి :
ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయానికి 400 సం || చరిత్ర కలదు. ఈ ఆలయం దూరజా పల్లి గ్రామం , సూర్యాపేట లో కలదు. భారత దేశంలో జరిగే పెద్ద జాతరాలలో ఈ జాతర ఒకటి. ప్రతి రెండు సం || ఒకసారి ఫిబ్రవరిలో ఈ ఆలయంలో నిర్వహిస్తారు.
ఆలయ దర్శించే సమయం : 6.00AM TO 12.00PM - 3.30PM TO 7.30PM.
7. శ్రీ పిల్లలమర్రి శివాలయం :
ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం 11 వ శతాబ్దం లో నిర్మించారు. హైదరాబాద్ నుంచి 140 కి. మీ దూరంలో ఈ ఆలయం కలదు. ఈ ఆలయం కాకతీయుల కాలం నాటి ఆలయం. ఈ ప్రాంతంలోనే పిల్లలమర్రి పినవీరభద్రుడు అనే కవి యొక్క జన్మస్థానం. అందువల్లనే ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చినది.
ఆలయ దర్శించే సమయం : 6.00AM TO 12.00PM - 4.00PM TO 7.00PM.
8. శ్రీ రంగనాయక స్వామి ఆలయం , ఎదులాబాద్ :
ఈ ఆలయం ఎదులాబాద్ , ఘటకేసర్ మండలం లో కలదు. ఈ ఆలయం చారిత్రక కట్టడం. మరియు పురాతన ఆలయం . 350 సం || చరిత్ర కలదు. ప్రతి సం || స్వామివారికి భ్రమోత్సవాలు
నిర్వహిస్తారు.
ఆలయ దర్శించే సమయం : 6.00AM TO 12.00PM - 4.00PM TO 7.00PM.
9. శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం , నార్కెట్ పల్లి :
నార్కెట్ పల్లి కి 4 కి. మీ దూరంలో గోపారాయ లో శ్రీ వారిజల వేణుగోపాల స్వామి ఆలయం కలదు. ఈ అలయని 1990లో పునఃనిర్మించారు. ఈ ప్రాంతానికి గోవర్ధన గిరి అనే మారియొక్క పేరు కూడా ఉన్నది. మకర తోరణం , తీరునామంతో ఉత్సవ మూర్తి కూడా ఉన్నది. ఈ క్షేత్ర పాలకుడు ఆంజనేయ స్వామి .
ఆలయ దర్శించే సమయం : 6.00AM TO 12.00PM - 3.00PM TO 8.00PM.
10. శ్రీ నరసింహ స్వామి ఆలయం , పాళ్లెం :
ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. 17 వ శతాబ్దానికి చెందినది. ఈ అలయాలో దేవత మూర్తి తవ్వకాలలో లభిచ్చింది. ఈ ఆలయ పళ్లెం గ్రామం , నకిరేకల్ మండలం లో కలదు. హైదరాబాద్ నుంచి 120 కి. మీ దూరంలో ఉన్నది. ప్రతి సం || స్వామివారి కి కళ్యాణ వేడుకలు జరుగుతాయి.
ఆలయ దర్శించే సమయం : 6.00AM TO 12.00PM - 4.00PM TO 7.00PM.
నల్గొండ జిల్లాలోని కొత్తగా చేర్చిన ఆలయాల వివరాల కొరకు ఇక్కడ చేయండి.
Telangana Temples District Wise
KeyWords : Nalgonda Famous Temples List, Nalgonda District Surrounding Temples, Telangana Famous Temples List, Hindu Temples Guide
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment