ఆలయ దర్శించే సమయం : 6.00AM TO 12.00PM - 3.00PM TO 7.30PM.
4. శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం , బుగ్గ :
ఈ ఆలయం 500 క్రితం ఆలయం . శివ లింగం క్రింద ఉద్భవించి, ఏడాది పొడవునా నిరతరంగా ప్రవహిస్తుంది . ఆలయం సమీపంలో ఒక చెరువులో సేకరించిన నీరు హైదరాబాద్ గుండా ప్రవహించే నది మూసి. ఈ ప్రదేశంలో నుండి పుట్టినది.
ఆలయ దర్శించే సమయం : 6.00AM TO 12.00PM - 2.00PM TO 8.00PM.
5. శ్రీ అనంత పద్మనాభ స్వామి , అనంతగిరి :
ఈ ఆలయానికి 400 సం || చరిత్ర కలిగి ఉన్నది. నిజం నవాబ్ వారు వేటకు ఈ అనంత గిరి కొండకి వచ్చే వారు. హైదరాబాద్ నుంచి 75 కి.మీ దూరంలో కలదు. ఏకాదశి పుణ్య తిధులలో రద్దీ అధికంగా ఉంటుంది. ఈ ఆలయంలో స్వామి వారు కొండ క్రింద కొలువై ఉంటారు. వైకుంఠ ఏకాదశి రోజు భారీ ఎత్తున భక్తులు వస్తారు.
ఆలయ దర్శించే సమయం : 7.00AM TO 1.00PM - 3.00PM TO 8.00PM.
6. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం , అల్వాల్ :
ఈ ఆలయం 18 వ శతాబ్ధం కి చెందినది. ఈ ఆలయం సికింద్రాబాద్ స్టేషన్ నుంచి 8 కి. మీ దూరంలో కలదు. ఆల్వాల్ తమిళ కవులు అయినా భగావతి మరియు భక్తుల యొక్క ప్రతిపాదకులు మరియు వేంకటేశ్వర స్వామి యొక్క భక్తుల అయినా ఆళ్వార్ ల నుంచి ఆల్వాల్ గా ఈ ప్రాంతానికి పేరు వచ్చింది.
ఆలయ దర్శించే సమయం : 6.00AM TO 12.00PM - 4.00PM TO 8.00PM.
7. శ్రీ వేంకటేశ్వర ఆలయం , జిల్లెల గూడ :
ఈ ఆలయంలో వేంకటేశ్వర స్వామి స్వయంభూ మూర్తి. ఈ ఆలయంలో ధనుర్మాసం , వైకుంఠ ఏకాదశి పండుగలని వైభవంగా నిర్వహిస్తారు. మిదాని, దిల్ సుఖ్ నగర్ నుంచి బస్ లు కలవు.
ఆలయ దర్శించే సమయం : 6.00AM TO 12.00PM - 3.00PM TO 9.00PM.
8. రత్న ఆలయం , శామీర్ పేట్ :
ఈ ఆలయంలో శ్రీ పద్మావతి & అళివేలు మంగమ్మ శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్నారు. ఈ ఆలయం 26 ఏప్రిల్ 2001 లో ప్రారంభించారు. కేవలం 22 నెలలో 19 ఫిబ్రవరి 2003 లో శ్రీ చిన్న జీయర్ స్వామి వారిచే ప్రారంభించబడినది. ప్రతి నెల అభిషేకం , కైకర్యం శవై వారికి వైభవంగా జరుగుతాయి. ఈ ఆలయం రాజీవ్ గాంధీ హైవేకి దగ్గరలో , సికింద్రాబాద్ నుంచి 25 కి.మీ దూరంలో కలదు. ఈ ఆలయంలో యజ్ఞశాల, కళ్యాణ కట్ట , ప్రవచనం హాల్ , గోశాల , కూడా ఉన్నాయి. ప్రతి రోజు 8 గంటలకి ప్రత్యేక హారతి ఉంటుంది.
ఆలయ దర్శించే సమయం : 6.00AM TO 12.00PM - 4.00PM TO 8.00PM.
9. భవీగి భద్రేశ్వర స్వామి , తాండూర్ :
ఈ ఆలయం 1940 లో ప్రారంభించారు. ఈ ఆలయంలో భద్రప్ప ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ప్రతి ఏటా చైత్ర పూర్ణిమ , చైత్ర అష్టమి ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఆలయంలో శివరాత్రి మరియు నవరాత్రి ఉత్సవాలు కూడా చేస్తారు. సంగారెడ్డి నుంచి 50 కి. మీ వికారాబాద్ నుంచి 40 కి. మీ దూరంలో కలదు.
ఆలయ దర్శించే సమయం : 6.00AM TO 12.00PM - 2.00PM TO 7.30PM.
10. శ్రీ రంగనాయక స్వామి ఆలయం :
హయాత్ నగర్ నుంచి 8 కి. మీ దూరంలో గండి చెరువు వద్ద కలదు. ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయానికి 500 సం || చరిత్ర కలదు. నీరు సరిగా లేని ఈ ప్రదేశం లో ఈ రంగనాధుని కృప వల్ల పంటలు బాగా పండుతునాయి అని ఆధారాలు కలవు. ధనుర్మాసం , శ్రీ రామ నవమి ఉత్సవాలు కూడా జరుగుతాయి. హైదరాబాద్ నుంచి 32 కి. మీ దూరంలో మరియు హయాత్ నగర్ నుంచి ప్రైవేట్ ఆటో లు కూడా ఈ ఆలయనికి వెలుతాయి.
ఆలయ దర్శించే సమయం : 6.00AM TO 12.00PM - 3.00PM TO 7.00PM.
రంగారెడ్డి జిల్లాలోని కొత్తగా చేర్చిన ఆలయాల వివరాల కొరకు ఇక్కడ చేయండి.
Telangana Temples District Wise
KeyWords : RangaReddy Famous Temples List, RangaReddy Surrounding Temples, Telangana Famous Temples List, Hindu Temples Guide
Comments
Post a Comment