Sri Sammakka Saralamma Jatara | MEDARAM Warangal dist Telangana


భారతదేశంలోనే దేవతలుగా పూజాలందుకుంటున్న సమ్మక్క సారక్క ఆసియా ఖండంలోనే 2 వ పెద్ద జాతర . కుంభమేళా తరువాత అంతటి పేరు సాధించిన ఈ గిరిజన జాతర ఈ మేడారం జాతర. ఈ జాతర మెత్తం గిరిజన సంప్రదాయం లోనే జరుగుతుంది. ప్రతి రెండు సం || ఒక సారి ఈ జాతరని నిర్వహిస్తారు .

ఈ ప్రాంతం ఎక్కడ ఉంది :

                     తెలంగాణ రాష్టములోని జయశంకర భూపాలపల్లి జిల్లాలోని తాడ్వాయి మండలం లోని మేడారం గ్రామంలో జరుగుతుంది.  జిల్లా కేంద్రం నుంచి 44 కి. మీ దూరం లో మారుమూల దట్టమైన అటవీప్రాంతంలో  ఒక గిరిజన తెగవారి జాతరనే ఈ సమ్మక్క సారక్క జాతర.
                                     

  ఈ జాతరకు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ , ఆంధ్ర నుంచి మాత్రమే కాకుండా మహారాష్ట్ర , మధ్యప్రదేశ్ ,ఓరిస్సా ,ఛత్తీస్ ఘడ్ , జార్ఖండ్  రాష్ట్రాల నుంచి భక్తులు తండోపతండాలుగా వస్తారు.  1996 ఈ జాతర అప్పటి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించారు.
                                             


అయితె సుమారు 900 సం || చరిత్ర కలిగిన ఈ పండుగ 1940 వరకు చిలకల గుట్ట పై గిరిజనులు మాత్రమే జరుపుకునేవారు.  కానీ 1940 తరువాత  ప్రజలంతా కలిపి జరుపుకుకుంటున్నారు.

మేడారం చరిత్ర : 


          13 వశతాబ్దంలో నేటి జగిత్యాల జిల్లా రూరల్ ప్రాంతంలోని పొలవాస ను పాలించే గిరిజన దొర మేడరాజు ఏకైక కుమార్తె సమ్మక్క . అతని మేనల్లుడు మేడారం పాలకుడు "పడిగి గిద్ద రాజు" కిచ్చి వివాహం జరిగినది. ఈ దంపతులకు సారలమ్మ (కుమార్తె , నాగలమ్మ ) జంపన్న అనే కుమారుడు జన్మించారు.



రాజ్య విస్తరణ కాంక్ష తో కాకతీయ ప్రభువు మొదటి ప్రతాపరుద్రుడు , పొలవాస పై దండయాత్ర చేస్తాడు. ఆయన దాడికి తట్టుకోలేక మేడారాజు , మేడారం వదిలి అజ్ఞాతవాసం లోకి వెళ్ళిపోతాడు.


 మేడారం పాలించే కోయరాజు "పడిగి గిద్ద రాజు" కాకతీయల సమంతునిగా ఉంటూ కరువుకాటక పరిస్తితుల కారణంగా కప్పం (పన్ను ,శిస్తూ ) కట్టలేకపోతాడు. కప్పం కట్టలేకపోవడం తో మెదరాజుకు ఆశ్రయం కల్పించడం , కోయ గిరిజనులలో సార్వభౌమునిగా వ్యతిరేకంగా విప్లవభావాలు నూరిపోసి రాజ్యాధికారాన్ని దిక్కరిస్తున్నాడానే కారణంతో పడిగి గిద్ద రాజు పై ఆగ్రహం చెందిన ప్రతాపరుద్రుడు అతడిని అణిచివేయడానికి తన ప్రధానమంత్రి యుగంధరుడితో కలిసి మాఘ శుద్ద పౌర్ణమి రోజున మేడారం పై దండెత్తాడు.



సంప్రదాయ ఆయుధాలు ధరించి పగిడి గిద్ద రాజు , సమ్మక్క , సారక్క , నాగమ్మ , జంపన్న , గోవిందరాజులు , వేర్వేరు ప్రాంతాల నుంచి యుద్దన్ని ప్రారంభించి వీరోచితంగా పోరాటాని చేస్తారు.


కానీ సుశితులైన అపార కాకతీయుల ధాటికి తట్టుకోలేక మేడరాజు , పగిడి గిద్ద రాజు , సారలమ్మ
, నాగలమ్మ గోవిందరాజులు యుద్దం లో వీర మరణం పొందుతారు. పరాజయ వార్తా విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక సంపెంగ వాగులో దూకి ఆత్మహత్య కు పాల్పడతాడు. అప్పటి నుంచి ఆ సంపెంగ వాగు జంపన్న వాగు గా ప్రసిద్ది చెందింది. భక్తులు తమ పుణ్య సాన్నలు ఈ వాగులోనే చేస్తారు.
ఇక చివరి వరకు సమ్మక్క యుద్ద భూమిలో కాకతీయుల సన్యాన్ని ముప్పుతిప్పలు పెడుతుంది. వీరోచితగా తన ఒంటరి పోరాటాని సాగించింది. ఒక గిరిజన మహిళా అయినా కూడా యుద్ద నైపుణ్యాని చూసి ప్రతాపరుద్రుడు ఆశ్చర్యపోతాడు. చివరకి శత్రువుల చేతిలో దెబ్బతిన
సమ్మక్క రక్తపుధారాలతో యుద్దభూమి నుంచి తన ప్రాణాలు తాను రక్షించుకోవడం కొరకు చిలకల గుట్ట వైపు వెళుతుంది. మార్గ మధ్యలోనే అదృశ్యమైంది.

           

     సమ్మక్క ను వెతుకుంటూ వెళ్ళిన తన అనూచరులకు ఆమె జాడ కనిపించడం లేదు. కానీ  ఆ ప్రాంతంలో ఒక పుట్ట దగ్గర పసుపు , కుంకుమలు గల భరిణే లభించింది . దానిని సమ్మక్కగా భావించి అప్పటి నుంచి ప్రతి రెండేళ్లకు ఒక్కసారి మాఘ శుద్ద పౌర్ణమి రోజున సమ్మక్క జాతరను అత్యంత భక్తి శ్రద్ద లతో నిర్వహిస్తారు.
    ఇంతకు మునుపు కేవలం ఒక వృక్షానికి ఒక పసుపు రంగు గల చీరని ధరింప చేసి అమ్మవారిగా కొలిచే వారు. ఇప్పడు ఆ మహా వృక్షానికి వెనుక ఒక పెద్ద సంభాన్ని కూడా స్థాపించారు. జాతరకి పెరిగే భక్తులకి అనుగుణంగా మార్పులు కూడా చేయడం జరిగినది.

   

 అమ్మవార్ల చిహ్నంగా ఈ ప్రాంతంలో గద్దెలు ఏర్పాటు  చేయబడి  ఉంటాయి. ఈ గద్దెల పైకి జాతర రోజు అమ్మవార్ల ప్రతిరూపాలుగా ఉన్న కుంకుమ భరిణ లను తీసుకువస్తారు. జాతర జరిగిన రోజు భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది.

జాతర విశేషాలు  : 


జాతర మొదటి రోజు కిన్నె పల్లి నుంచి సారలమ్మ గద్దె కు తీసుకొని వస్తారు. రెండవ రోజు చిలకల గుట్ట నుంచి భరిణ రూపం లో ఉన్న సమ్మక్క ను గద్దె లో ప్రతిష్టిస్తారు. మూడవ రోజున గద్దెలపై కొలువై భక్తులకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. నాల్గవ రోజు సాయంత్రం ఆవాహన పలికి దేవతలను ఇద్దరినీ తమ తమ యధార్ధ స్థానానికి తీసుకొని వెల్లుతారు.
ఈ జాతర ప్రత్యేకత ఏమిటానగా ఈ వాన జాతర ఆలయ గద్దెల ప్రాంతంలో పూజారులు ఎవరు ఉండరు. ఆ ప్రాంత గిరిజనులే పూజారులు.


తమ కోరికలను  తీర్చమని అమ్మవార్లకి బంగారం(బెల్లం) సమర్పిస్తారు. తమ కోరిక నెరవేరిన తరువాత అమ్మవారికి కోడి లేదా మేక లేదా వారి వారి ఆర్ధిక స్తోమత కి తగినట్టుగా అమ్మవారికి నైవేద్యం సమర్పించి తదనందతరం భక్తులు స్వీకరిస్తారు. ఈ జాతర లో మారియొక్క ప్రత్యేకత ఏమిటనగా ఎటువంటి విగ్రహ ఆరాధన ఉండదు.



కేవలం ప్రకృతి ఆరాధన , పసుపు , కుంకుమలు, బెల్లం తప్ప మరి ఏ ఇతర పదార్దాలు కూడా కనిపించవు. కేవలం గిరిజనులే కాకుండా ఇయతర అని మతాల వారు కూడా ఈ వన గిరిజన జాతరలో పాల్గొంటారు. సుమారు ఒక కోటి యాభై లక్షల మంది భక్తులు ఈ జాతర కి విచ్చేస్తారు. ఇంతటి భక్తులు పాల్గొనడం మరియు ఇంతటి గొప్ప సంప్రదాయ గిరిజన జాతర కావడంతో ఈ జాతర ఆసియా ఖండం లోనే రెండవ అతి పెద్ద జాతర గా పేరు పొందింది.



ఈ ప్రాంతానికి చేరుకునే విధానం :


బస్ రూట్ : 


సొంత వాహనం కలవారు డైరెక్ట్ గా వరంగల్ హైవే మీదుగా ములుగు జయశంకర్ భూపాలపల్లి కి చేరుకొని అక్కడి నుంచి మేడారం కి చేరుకోవచ్చు.

హైదరాబాద్ నుంచి ఈ ప్రాంతానికి 295 కి. మీ దూరంలో కలదు.

హైదరాబాద్ లో గల యం. జి . బి. యస్(MGBS) నుంచి జాతర జరిగిన అన్నీ రోజులు ప్రతి 30 నిమిషాలకి ఒక బస్ కలదు.

సికింద్రాబాద్ లో గల జె. బి , యస్ (JBS) నుంచి జాతర జరిగిన అన్నీ రోజులు ప్రతి 40 నిమిషాలకి ఒక బస్ కలదు.

రైలు ప్రయాణం : 


దేశంలోని అన్నీ ప్రాంతాల నుంచి మొదట సికింద్రాబాద్ కి చేరుకొని అక్కడి నుంచి వరంగల్ లో దిగి అక్కడి నుంచి బస్ రూట్ లో ఈ జాతర కి చేరుకోవచ్చు.

ఇచ్చట చూడదగ్గ మరికొన్ని ప్రదేశాలు : 


లక్నవరం బ్రిడ్జ్ :


                             
  జాతరకి విచ్చేసిన చాలా మంది భక్తులు ఈ ప్రాంతాని తప్పకుండా చూస్తారు. ఈ ప్రదేశ ప్రవేశ రుసుం కూడా చాలా తక్కువే.


పెద్దలకి 20/- పిల్లలకి 10/-కానీ జాతర రద్దీ దృష్టా ఈ నెల 12 వరకు ఈ ప్రదేశం మూసి వేయబడి ఉంది. చూడాలి అనుకునే వారు ఈ కింది ఫోటోలలో చూడవచ్చు.


హరిత వ్యూ పాయింట్  :


                          ఈ ప్రదేశం రామప్ప ఆలయం కంటే ఇంకా ముందుకు వెళితే వస్తుంది. ఇచ్చట చక్కగా బోటింగ్ చేయవచ్చు. ఒక్కరికీ 50/- మాత్రమే. చాలా చక్కటి రమణీయమైన ప్రకృతి ప్రాంతం చక్కటి గాలి ప్రశాంతమైన వాతావరణం లో బోటింగ్ చాలా బాగా ఉంటుంది.


రామప్ప దేవాలయం : 


ఓరుగల్లు నెలిన కాకతీయుల రాజులునిర్మించిన చారిత్రక దేవాలయం ఈ రామప్ప దేవాలయం ఈ ఆలయం వెంకటాపూర్ మండలం పాలంపేట అనే గ్రామం లో కలదూ.


కాకతియ రాజు గణపతి దేవుడు ఈ దేవాలయంలో వేయించిన శిలాశాసనం ప్రకారం ఈ దేవాలయాన్ని రేచర్ల రుద్రయ్య నిర్మించాడు.


ఈ ఆలయం క్రీ. శ 12 13 లో నిర్మించాడు. కాకతీయుల శిల్పకళా సౌదర్యానికి ఈ ఆలయం నిదర్శనం. ఒకొక్క స్తంభంలో ఏనో అందమైన శిల్పాలు. వాటిలో కొని ఈ క్రింద గమనించవచ్చు.



1000 స్తంభాల దేవాలయం : 


ఈ దేవాలయం సముదాయం కాకతీయుల మొదటి రుద్ర దేవుడు క్రీ. శ 1163 లో నిర్మించినట్టు శాసనం కలదు. మొట్ట మొదటి శివ , విష్ణు , మరియు సూర్య భాగవణుల కూటములున్నవి. ఒక మీటరు ఎత్తైన అదిష్టనం పై 31*25 మీ విస్తీర్ణం కలిగి ఉన్న జగతి పైన ఈ త్రికుతములు చేర్చును. శిల్పనైపుణ్యంతో నాలరారు నాట్య మండపం కలదు. దక్షణం న ఎతైన ద్వారా శాలా కక్షసములతోటి వేయి స్తంభాలు మహా మండపం ఈ రెండిటి మధ్య ఉన్నత పీఠం పై నందీశ్వరుడు చక్కని సోపానమలతోడగల ప్రాంగణం.



పరివృత ప్రాకారం శిధిలమైనది. తూర్పున త్వరణాల ద్వారములు , కాకతీ రుద్రుని శాసన స్తంభం దీనికి చేరువుగా అభిషేక జలమునకే దిగుడు బావి కలదు.


ఇచ్చట కనిపించే రమణీయ కుడ్య స్తంభం ల సునిశితమైన కాకతీయ శిల్పకళకు శోభయమనమములు(భారతీయ పురాతత్వ సర్వేక్షణ) వాటిలో కొన్ని ఈ క్రింద ఫోటోలో గమనించవచ్చు.       



ఇంత చక్కటి సమాచారని అందరికీ అందరికీ షేర్ చేస్తారు అని కోరుకుంటూ సమాచారాన్ని చదివిన మీకు ఇవే నా నమస్కారాలు. ఈ సమాచారని అందరికీ చేరేలా చేయండి. 
ఇట్లు మీ బాలు 


Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS