Drop Down Menus

Bhimashankar Jyotirlinga Temple History in Telugu, Maharashtra


భీమశంకర క్షేత్రం :
భీమశంకర క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన 6వ భీమశంకర లింగం వెలసిన హిందూ పుణ్యక్షేత్రం . భీముడు అనే రాక్షసుడి కారణంగా తలెత్తిన వివత్తును తొలిగించి నందువల్ల ఆ భీమశంకర జ్యోతిర్లింగంగా ప్రసిద్ధిచెందింది. ముంబై మహానగరం నుండి 213 కిలోమీటర్ల దూరంలో, పూణే నగరం నుండి 110 కిలోమీటర్ల దూరంలో ఉంది భీమశంకర్. ఇది సాహసికులు ఇష్టమైన ప్రదేశం.

ఇతిహాసం మేరకు శివ భగవానుడు సహ్యాద్రి కొండలలో భీముడి అవతారంగా దేవతల కోరిక మేరకు నివసిస్తున్నాడని చెపుతారు. త్రిపురాసురుడనే రాక్షసుడితో శివుడు పోరాడి ఆ రాక్షసుడిని వధించాడు. ఆ రాక్షసుడితో జరిగిన యుద్ధంలో శివుడి శరీరంనుండి ప్రవహించిన చెమట ధారలే భీమ నదిగా ప్రవహించాయని చెపుతారు.

ఎలా వెళ్ళాలి ? 
ముంబై నుండి కర్జాత్ స్టేషన్ వరకు (90 km) రైల్లో వెళ్ళండి. అక్కడి నుండి టాక్సీ లేదా బస్సులలో 40 km ల దూరంలో ఉన్న ఖండాస్ గ్రామానికి చేరుకోండి.

ఇక్కడికి చేరుకున్నాక, టూరిస్ట్ లకు రెండు ఆప్షన్ లను ఎంచుకోవచ్చు భీమశంకర్ చేరుకోవటానికి. ఒకటి గణేష్ ఘాట్ రూట్ కాగా, మరొకటి శిది రూట్.

గణేష్ ఘాట్ & శిది ఘాట్ రూట్ లు రెండూ కూడా అద్భుతంగా ఉంటాయి. ఖండాస్ నుండి కుడివైపు తిరిగి మెయిన్ బ్రిడ్జి మీదుగా 3-4 గంటలు ప్రయాణిస్తే గణేష్ ఘాట్ చేరుకోవచ్చు. గంట ట్రెక్ తర్వాత గణేష్ ఆలయం, పదర్ ఖిల్లా చేరుకోవచ్చు. మీరు ట్రెక్ ను ఇంకా కొనసాగించాలనుకుంటే, గైడ్ సహకారంతో కొనసాగించవచ్చు.

ఈ రూట్ గుండా వెళుతున్నప్పుడు టీ స్టాల్ లు, చిన్న చిన్న హోటళ్లు కనిపిస్తాయి. మీకు ఆకలి అనిపిస్తే వెళ్లి తినండి. పదర్ ఖిల్లా రూట్ నుండి కొన్ని గంటల ప్రయాణంలో భీమశంకర్ చేరుకోవచ్చు.

భీమశంకర్ ఎలా చేరుకోవాలి ? వాయు మార్గం : పూణే సమీప విమానాశ్రయం. విమానాశ్రయం బయట భీమశంకర్ చేరేందుకు అద్దెకు టాక్సీలు, క్యాబ్ లు దొరుకుతాయి. రైలు మార్గం : కర్జాత్, పూణే లు భీమశంకర్ సమీప రైల్వే స్టేషన్లు. రోడ్డు మార్గం : మహారాష్ట్ర లోని వివిధ ప్రదేశాల నుండి భీమశంకర్ కు ప్రతిరోజూ బస్సులు నడుస్తుంటాయి. పూణే, ముంబై నుండి కూడా రోజువారీ సర్వీసులు ఉంటాయి.

bhimashankar temple timings, bhimashankar temple steps, bhimashankar hotels, bhimashankar images, places to visit near bhimashankar, bhimashankar from mumbai, maharashtra tourism bhimashankar, bhimashankar trek, bhimashankar temple history in telugu.
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

ఎక్కువమంది చదివినవి

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.