Drop Down Menus

Kukke Shree Subrahmanya Temple History Telugu | Karnataka

కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయం :
కుమారధారా నది మీద వున్న సుబ్రహ్మణ్య స్వామి వూళ్ళో వున్న సుబ్రహ్మణ్య దేవాలయం లేక కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయం చూసి తీరవలసిన వాటిలో ఒకటి. ఈ గుడి చుట్టూ నదులు, పర్వతాలు, అడవులు ముఖ్యంగా కుమార పర్వత౦ పరుచుకుని వుంటాయి. సుప్రసిద్ద శ్రీ కుక్కే సుబ్రమణ్యస్వామి దేవస్థానం కర్నాటక రాష్ట్రం, దక్షిణ కన్నడ జిల్లా, సుల్ల్య తాలూకా లోని సుబ్రమణ్య అను గ్రామములో ఉంది. ఇక్కడ కార్తికేయుడిని సర్ప దేవుడు సుబ్రమణ్యునిగా భక్తులు ఆరాధిస్తారు. గరుడికి భయపడి దివ్య సర్పం అయిన వాసుకి, ఇతర సర్పాలు సుబ్రమణ్యుని చెంత శరణు పొందాయని పురాణాలు చెబుతున్నాయి.

కుక్కే సుబ్రమణ్య లో చూడవలసిన మరిన్ని సందర్శన స్థలాలు :
బిలద్వార గుహ, సుబ్రమణ్య మఠం , వేదవ్యాస సంపుట నరసింహ దేవాలయం, ఆది సుబ్రమణ్య దేవాలయం, అభయ మహాగణపతి దేవాలయం, హరిహరేశ్వర్ దేవాలయం, మత్స్య పంచమి తీర్థాలు మొదలైనవి.

ఆలయ దర్శించే సమయం : 6 am – 1:30 pm 3:30pm – 8:30 pm

కుక్కే సుబ్రమణ్య ఎలా చేరుకోవాలి ? 
విమాన మార్గం 
మంగళూరు విమానాశ్రయం కుక్కే సుబ్రమణ్య కు 115 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. బెంగళూరు ఎయిర్ పోర్ట్ 340 కిలోమీటర్ల దూరంలో ఉంది. క్యాబ్ లేదా ప్రవేట్ టాక్సీ లలో ప్రయాణించి కుక్కే సుబ్రమణ్య చేరుకోవచ్చు. 

రైలు మార్గం 
కుక్కే సుబ్రమణ్య వద్ద రైల్వే స్టేషన్ కలదు. ఇది సుబ్రమణ్య రోడ్ రైల్వే స్టేషన్ గా పిలువబడుతున్నది. ఊరి నుండి 7 కిలోమీటర్ల దూరంలో ఈ స్టేషన్ ఉన్నది. స్టేషన్ బయట క్యాబ్ లేదా అటో లలో ప్రయాణించి ఊర్లోకి రావచ్చు.

బస్సు / రోడ్డు మార్గం 
బెంగళూరు, మంగళూరు ల నుండి కుక్కే సుబ్రమణ్య కు కర్నాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (KSRTC) బస్సులు నడుస్తుంటాయి. దీంతో పాటు ప్రవేట్ వోల్వా బస్సు, ఏసీ బస్సు సర్వీసులు కూడా మంగళూరు నుండి బయలుదేరుతాయి.

kukke subramanya miracles, kukke subramanya power, kukke subramanya pooja list, kukke subramanya temple address, kukke subramanya temple timings, subramanya temple in bangalore, kukke subramanya for pregnancy, kukke subramanya temple history in hindi, kukke subrahmanya swamy temple history telugu, kukke subrahmanya swamy
ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.