Drop Down Menus

Muktinath Temple History Telugu | Nepal

ముక్తినాధ్‌:
నేపాల్ దేశంలోని మస్తంగ్ జిల్లాలో ఉన్న హిమాలయపర్వతాలలో భాగమైన తొరంగ్ లా పర్వతపాదం పాదం వద్ద ఉన్న పవిత్ర క్షేత్రం ముక్తినాథ్. ముక్తినాథ్ ఒకే క్షేత్రం అటు శైవులకీ, వైష్ణవులకీ, బౌద్ధులకీ ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా భాసించడం చాలా అరుదు. అలాంటి అరుదైన ఘనత కలిగిన క్షేత్రం నేపాల్లోని ముక్తినాధ్‌ ప్రాంతం.

నారాయణడు స్వయంభువుగా వెలసిన ఈ క్షేత్రంలో స్వామివారు ముక్తి నారాయణుడిగా పూజలను అందుకుంటున్నాడు. శ్రీ మహావిష్ణువు స్వయంభువుగా వెలసిన ఎనిమిది క్షేత్రాలలో, అమ్మవారి శక్తి పీఠాలలో ఈ ఆలయం ఒకటిగా చెబుతారు.

నేపాల్ దేశంలో మస్తంగ్ జిల్లాలో 12 వేల అడుగుల ఎత్తులో ముక్తినాధ్ ఆలయం ఉంది. ఈ ఆలయంలో స్వామివారు నాలుగు చేతులతో దర్శనం ఇస్తారు కానీ చేతిలో ఎటువంటి ఆయుధాలను ధరించి లేకపోవడం విశేషం. అమ్మవారి నుదుటి భాగం ఈ ప్రదేశంలోనే పడిందని అందుకే 51 శక్తి పీఠాలలో ఈ ఆలయం ఒకటిగా చెబుతారు. అంతేకాకుండా 108 వైష్ణవ దివ్యక్షేత్రాలలో ఒకటిగా చెబుతారు. అయితే ఈ ఆలయానికి దగ్గరలోనే గండిక నది ప్రవహించడం వలన ఈ అమ్మవారిని గండకీ చండి అనే పేరుతో పిలుస్తుంటారు. హిందువులే కాకుండా బౌద్దులు కూడా ఈ ప్రాంతాన్ని పవిత్రంగా భావిస్తారు. బౌద్దులు పూజించే అవలోకితస్వర అనే దేవత ఇక్కడే ఉత్బవించిందని వారి నమ్మకం. శైవులకు, వైష్ణవులకు, బౌద్ధులకు ప్రసిద్ధ క్షేత్రంగా విరాజిల్లుతున్న ఏకైక క్షేత్రం ఇది ఒక్కటే అని చెబుతారు. అయితే టిబెటిన్ బౌద్ధులు ముక్తినాథ్ లేక చుమింగ్ గ్యాస్థాను ఢాఖినీ క్షేత్రంగా భావిస్తున్నారు. ఢాకినీ అంటే ఆకాశనృత్య దేవత. బౌద్ధుల వజ్రయాన బుద్ధిజానికి చెందిన తాంత్రిక ప్రదేశాలలో ముక్తినాథ్ ఒకటి. అవలోకేశ్వరుడు ముక్తినాథుడిగా అవతరించాడని వారు భావిస్తుంటారు.

ఈ ఆలయంలో విశేషం ఏంటంటే, ఇక్కడ 108 నంది ముఖాల నుండి ఎప్పుడు చల్లని నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. ఆలయ దగ్గరలో ఉన్న పుష్కరిణి నుండే ఈ నీరు వస్తుంది. ఇక్కడి వచ్చే భక్తులు అంతటి చల్లటి ప్రదేశంలో కూడా ఇందులో నుండి వచ్చే చల్లటి నీటిలో స్నానం చేస్తుంటారు. భూమి మీద పంచభూతాలు ఒకే దగ్గర వివిధ రూపాలలో దర్శనం ఇచ్చే ప్రపంచంలోనే ఏకైక క్షేత్రం ఇదేనని చెబుతారు. ఈ ఆలయంలో స్వామివారితో పాటు శ్రీదేవి, లక్ష్మీదేవి, గరుడాళ్వార్, రామానుజుల వారి పంచ లోహ విగ్రహాలు ఉన్నాయి. అంతేకాకుండా సాలగ్రామాలు కూడా ఉన్నాయి. ఇక్కడి స్వామివారికి హారతి అనేది ఇవ్వరు నేతితో దీపం మాత్రమే పెడతారు.

ఈ ఆలయానికి దగ్గరలోనే జ్వాలామాత ఆలయం ఉంది. ఇక్కడ జ్యోతి నిరంతరం వెలుగుతూనే ఉంటుంది. దీనిని దైవ మహిమగా భావిస్తూ ఈ జ్యోతిని జ్వాలామాయిగా భక్తులు కొలుస్తారు. ఇంకా ఇక్కడే గండిక నది జన్మస్థలం ఉన్నది. ఇక్కడ దొరికే నల్లని రాయిని సాలిగ్రామం అంటారు. ఇవి గుండ్రని రాళ్ళలా తాబేలు నోరు తెరచుకున్నట్టు ఉండి లోపల శ్రీ మహా విష్ణువే శేషసాయిగా ఉండి దర్శనమిస్తుంటాడు. ఇక ఈ ఆలయాన్ని చేరుకోవడం అనేది అంత సులువు కాదు, నడుచుకుంటూ లేదా గుర్రాల మీద వెళుతూ ఉంటారు. ఇంకా ఇక్కడికి హెలికాఫ్టర్ ద్వారా వెళ్లే అవకాశం ఉంది. అయితే వేసవి కాలంలో మాత్రమే ఈ ఆలయానికి వెళ్ళడానికి అనుమతి అనేది ఉంటుంది.

ఈవిధంగా ఎన్నో కష్టాలను ధాటి వెళ్ళి ఈ ఆలయాన్ని దర్శిస్తే మోక్షం వస్తుందని ఒక నమ్మకం. అందుకే ఈ క్షేత్రం ముక్తిక్షేత్రం అంటే మోక్షాన్ని ప్రసాదించే క్షేత్రం అని అర్ధం.

నేపాల్‌లోని ముస్తాంగ్ జిల్లాలో దాదాపు 12 వేల అడుగుల ఎత్తున ఉండే ముక్తినాధ్‌ ఆలయాన్ని చేరుకోవడం ఏమంత తేలిక కాదు. రాణిపువా, జామ్‌సమ్‌ వంటి ప్రాంతాల నుంచి నడుచుకుంటూనో, గుర్రాల మీదనో ఈ ఆలయానికి చేరుకోవాలి. ఆ ప్రయాస కూడా చేయలేనివారు హెలికాప్టర్లలో ఆలయం సమీపానికి చేరుకుంటారు. ఆలయాన్ని చేరుకోవడం ఇంత వ్యయప్రయాసలతో కూడుకున్నప్పటికీ నిత్యం వేలాదిమంది ప్రయాణికులు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ముక్తిక్షేత్రంగా పిలుచుకునే ఈ పుణ్యస్థలిని చేరుకుంటూ ఉంటారు.

దర్శనం, సేవలు , ఉత్సవాలు :
ముక్తినాథ్‌ నుండి హిమాలయ శిఖరాల సుందర దృశ్యం
ముక్తినాథ్ దర్శనానికి తగిన సమయం మార్చి నుండి జూన్. ఇతరమాసాలలో వాతావరణ పరిస్థితులు అనుకూలిచవు. భక్తులకు ఈ ప్రయాణంలో అనేక ఆలయాలు, చారిత్రక ప్రదేశాలను సందర్శించే అవకాశం ఉంది.

ప్రయాణ వసతులు:
క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల కారణంగా కాట్మండ్ నుండి పోక్రా లోని జాంసం విమానాశ్రయానికి ప్రయాణించి అక్కడి నుండి ట్రక్కులు, జీబుల ద్వారా ప్రయాణించి ముక్తినాథ్ చేరుకోవచ్చు. పరిస్థితులు అనుకూలించినపుడు కొంతమంది భక్తులు హెలికాఫ్టర్ ద్వారా ప్రయాణించి 40 నిముషాలకు ముక్తినాథ్ చేరుకోవచ్చు. హెలికాఫ్టర్‌లో వచ్చేవారిని సిక్నెస్ కారణంగా ఎక్కువసేపు ఉండడానికి అనుమతించబడరు. మౌంటెన్ ఇలా చేస్తుంటారు. రాణిపురా, జాంకర్‌కాట్, చొంగర్, కాగ్‌బెనీ లేక జాంసంలలో యాత్రీకులకు బసచేయడానికి వసతిగృహాలు లభ్యమౌతాయి.

history of muktinath temple, muktinath temple tour, muktinath temple after earthquake, muktinath temple 108 dhara, muktinath temple in map of nepal, muktinath temple weather, objective of muktinath temple, muktinath temple images, mukthinath temple history telugu
ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.