Drop Down Menus

Sri Mahabaleshwara Swamy Temple Information | Karnataka Famous Temples


శ్రీ మహాబలేశ్వర  దేవాలయం , గోకర్ణము ,  కర్ణాటక :

భూకైలాస క్షేత్రం ఈ గోకర్ణ క్షేత్రం. ఈ శైవ క్షేత్రం చాలా ప్రసిద్ది పొందిన ఆలయం. ఈ ఆలయం కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ నందు కలదు. ఈ ప్రాంతన్నికి అత్యంత సుందరమైన ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఈ ప్రాంతం గోవా కి దగ్గరగా ఉండడం వల్ల విదేశీ పర్యటకులు సహితం ఆకర్షిస్తుంది.

స్థలపురాణం :

రావణాసురుడు పరమశివుని గురించి ఘోరమైన తపస్సు చేసి మెప్పించి ఆత్మ లింగాన్ని దీవి నుంచి భువి పైకి రాపిస్తాడు. కానీ ఆ ఆత్మ లింగం ఎక్కడ పెడితే అక్కడే ప్రతిష్ట జరిగిపోయి ఎవ్వరూ కూడా తిరిగి ఎత్తా శక్యం కాదని మహాదేవుడు చెపుతాడు. రావణాసురుడు ఆత్మలింగాన్ని లంకలో ప్రతిష్ఠిస్తే ప్రతికూల చర్యలు జరుగుతాయని భావించి దేవతలు విష్ణువును వేడుకొనగా విష్ణువు తనమాయతో సూర్యాస్తమయం అయ్యేటట్లు చేస్తాడు. అప్పుడు రావణుడు సూర్యాస్తమయం అయిందని భావించి సంధ్య వార్చుకోవడానికి సంసిద్ధుడు అవుతాడు.



ఆ ఆత్మలింగాన్ని రావణ నగరం అయినా లంకా పట్టణానికి తీసుకొని పోకుండా బ్రహ్మ , విష్ణు అందరూ కలసి రాయబారిగా నారాదుడిని పంపిస్తారు. నారదుడు అది ఆత్మ లింగం కాదని చెప్పడంతో చివరికి గోపాలుడు రూపంలో వినాయకుడు ప్రత్యక్షమవుతాడు. సంధ్య సమయం అయింది అని తెలుసుకొని రావణుడు సంధ్య వార్చుకొని వచ్చేంతవరకు  ఈ శివ లింగాన్ని పట్టుకొమ్మని ఆ గోపాలుడు రూపంలో ఉన్న వినాయకుడుతో చెపుతాడు. వినాయకుడు తాను మూడుసార్లు పిలుస్తానని , ఈ లోపు రాకపోతే ఈ శివలింగాన్ని కింద పెడతానాని చెపుతాడు. రావణుడు వెళ్ళగానే మూడు సార్లు పిలిచి వెంటనే శివలింగాన్ని కింద పెడతాడు. ఇంతలోనే రావణుడు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ శివలింగాన్ని లేపగ శివలింగం కదలదు. ఆ కారణంగానే ఇక్కకద శివయ్యాను మహా బలేశ్వరుడు అని పిలుస్తారు.

విష్ణువు తన మాయని తొలగించగా వెంటనే సూర్యుడు ఆకాశంలో మళ్ళి కనిపిస్తాడు. ఈ విషయాన్ని గ్రహించి రావణుడు ఎంతో కోపోద్రిక్తుడై ఆత్మలింగాన్ని తన చేతులతో పెకలించ ప్రయత్నం చేస్తాడు. ఆత్మలింగం పైనున్న కవచాన్ని విచ్ఛిన్నం చేసి విసిరివేస్తే గోకర్ణకు 23 కి.మి. దూరంలో సజ్జేశ్వర అనే ప్రదేశంలో పడుతుంది. లింగంపై నున్న మూత తొలగించి విసిరి వేస్తే అది గోకర్ణకు 27 కి.మి దూరంలో ఉన్న గుణేశ్వరలో పడుతుంది. లింగం పైనున్న వస్త్రాన్ని విసిరివేస్తే అది కందుక పర్వతంపై నున్న మృదేశ్వరలో పడుతుంది. ఆపేరు కాలక్రమంలో మురుడేశ్వరగా మారింది.

గణపతి దేవాలయం : 

మహాబలేశ్వరుడు ఆలయానికి ప్రక్కగా గణపతి ఆలయం ఉంటుంది. రావణాసురుడు తల మొట్టాడు అనడానికి గుర్తుగా గణపతి మాడు మీద ఒక గుంట ఉంటుది.  గణపతి స్వామికి అందరూ  అభిషేకం చేయవచ్చు.


ఆలయ దర్శన సమయం :

ఉదయం : 6.00AM TO 2.00PM
సాయంత్రం : 5.00PM TO 8.30PM

ఆలయ చిరునామా :

శ్రీ మహాబలేశ్వర  స్వామి ఆలయం ,
గోకర్ణము , ఉత్తర కన్నడ జిల్లా - 581326
కర్ణాటక రాష్ట్రం
భారతదేశం.
Ph : 08386 – 257956, 257955
+91 9482331354 / 9449595254
Email : info@srigokarna.org

ఆలయానికి చేరుకునే విధానం :

ఈ ఆలయాన్నికి చేరుకోవడానికి రోడ్డు , రైలు , విమాన మార్గాలు ఉన్నాయి.

బస్ మార్గం :

ఈ ఆలయం దేశం లోని అన్నీ మార్గాల నుంచి మొదటహుబ్లి నుండి లేదా హంపి నుంచి గోకర్ణం కి బస్ లు కలవు. గోవా నుంచి ఈ ప్రాంతాన్నికి ఉదయం 8 గంటలకి బస్ కలదు. మంగళూరు నుంచి 252 దూరంలో కలదు. బెంగళూరు నుంచి ఉదయం 9 గంటలకి , మైసూరు నుంచి ఉదయం 6 గంటలకి ఈ ఆలయానికి నేరుగా బస్ లు కలవు. కార్వార్ నుంచి ఉదయం  7 మరియు మధ్యాహ్నం 4 గంటలకు గోకర్ణకు సరాసరి బస్సులు నడుస్తాయి.

రైలు మార్గం : 

గోకర్ణకు 23 కి.మి. దూరంలో ఉన్న కుంటా, 25 కి.మి. దూరంలో ఉన్న అంకోలా, ఉత్తర కన్నడ  కార్వార్లో  నిలుస్తాయి. అక్కడి నుంచి ప్రైవేట్ వాహనాలు లో ఈ ఆలయానికి చేరుకోవచ్చు.

విమాన మార్గం :

గోవా మరియు డాబోలిమ్ విమానశ్రయలు దగ్గరలోని విమానశ్రయాలు
KeyWords : Sri Maha Baleshwara Swamy Temple , Gokarna , karnataka Surrounding Temples, Hindu Temples Guide
ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments