Drop Down Menus

Chhatarpur Temple | Katyayani Devi | Delhi


ఛతర్‌పూర్ ఆలయం , ఢిల్లీ :

ఈ ఆలయం ఢిల్లీ లోని ఛతర్‌పూర్ లో కలదు. నిజానికి ఈ ఆలయంలో అమ్మవారు  కాత్యాయని . అమ్మవారి ఉపశక్తి పీఠలలో ఒకటి.  ఈ ఆలయం యొక్క మొత్తం సముదాయం 60 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది.

ఆలయ చరిత్ర :

ఈ ఆలయాన్ని 1974 లో స్థాపించారు. బాబా సంత్ నాగ్‌పాల్ జి గారు ప్రారంభించారు. ఆయన 1988 లో శివైక్యం చెందారు. అతని సమాధి మందిరం ఆలయ ప్రాంగణంలోని శివ-గౌరీ నాగేశ్వర్ మందిరం ప్రాంగణంలోనే ఈ ఆలయం కలదు. 2005లో ఢిల్లీలోని అక్షర్ధామ్ ఆలయం ఏర్పడటానికి ముందు ఈ ఆలయం భారతదేశంలో అతిపెద్ద ఆలయంగా మరియు ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆలయంగా పరిగణించబడింది. ఈ ఆలయం పూర్తిగా పాలరాయితో నిర్మించబడింది అప్పటి కాలం నాటి శిల్ప కళా వైభవం గమనించవచ్చు.


ప్రధాన ఆలయంలోని ఒక ప్రక్కన దుర్గా దేవి ఆలయం కూడా ఉన్నది. ఈ ఆలయం దేవాలయం నవరాత్రి కాలంలో మాత్రమే తెరుచుకుంటుంది, ఆ సమయంలో భక్తులు వేల సంఖ్యలో దర్శనం కోసం ప్రాంగణానికి వస్తారు. వయస్సు పై బడిన వారు లేదా చిన్న పిల్లలతో ఉన్న వారి కోసం సమీపంలోని ఒక గదిని  నిర్మించారు, మరియు ఉప అలాయలు అయినా రాధా కృష్ణ, మరియు గణపతి ఆలయాలు కూడా దర్శించుకోవచ్చు.

ఆలయ దర్శన సమయం :

ఉదయం       : 6.00 - 3.00
సాయంత్రం  : 3.30 - 9.30

వసతి వివరాలు :

ఈ ఆలయం దగ్గరలోనే ప్రైవేట్ హోటల్ లు కలవు.

ఆలయానికి చేరుకునే విధానం :

రోడ్డు మార్గం :

మొదట ఢిల్లీ చేరుకొని అక్కడి నుంచి ఈ ఆలయానికి ప్రైవేట్ ఆటో లో చేరుకోవచ్చు.

రైలు మార్గం :

దేశంలోని అన్నీ ప్రధాన ప్రాంతాల నుంచి మొదట ఢిల్లీ చేరుకొని అక్కడి నుంచి  ఛతర్‌పూర్ స్టేషన్ కి లోకల్ ట్రైన్ లలో చేరుకోవచ్చు. ఇక్కడి నుంచి ఆలయానికి కేవలం 2 కి. మీ దూరం ఉన్నది.

విమాన మార్గం :

ఢిల్లీ లోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంనికి చేరుకొని అక్కడి నుంచి ప్రైవేట్ వాహనాలలో లేదా కార్ లో ఈ ఆలయానికి చేరుకోవచ్చు.

ఆలయ చిరునామా :

ఛతర్‌పూర్ ఆలయం,
ప్రధాన ఛతర్‌పూర్ రోడ్డు ,
అంబేద్కర్ కాలనీ,
ఛతర్‌పూర్,
న్యూ ఢిల్లీ,
పిన్ కోడ్ : 110074

Key Words : Chhatarpur Temple , Katyayani Devi Temple , Famous Temples In Delhi , Hindu Temples Guide 
ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments