Today Tirumala Darshan Information:

నమస్కారం హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం. టెంపుల్స్ గైడ్ కాల్ సెంటర్. కాల్ సెంటర్ వారికి జీతాలు ఇవ్వాలి కాబట్టి టెంపుల్స్ గైడ్ సభ్యత్వం ఉన్న వారికి మాత్రమే కాల్ చేసే అవకాశం ఉంటుంది. జీవితకాల సభ్యత్వం 100 రూపాయలు మాత్రమే. 8247325819 ఈ నంబర్ కు gpay లేదా ఫోన్ పే చేయగలరు.

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

Jantar Mantar | Connaught Place | New Delhi


ఢిల్లీలోని చాల తప్పకుండ  చూడవలసిన ప్రదేశాలలో ఈ జంతర్ మంతర్ ఒకటి. ఇది పూర్తిగా అప్పటిలో ఖగోళ పరిశోధన ప్రాంతం. 13 రకాలైన ఖగోళ పరికారాలు ఈ ప్రాంతం జంతర్‌ మంతర్‌లో కలవు. ఇది ఢిల్లీ లోని ఒక పురాతన కట్టడం. ప్రస్తుతం ఎటువంటి పరిశోదనలు చేయడం లేదు. ఈ ప్రాంతంలో అప్పటిలో కొన్ని సినిమా షూటింగ్ కూడా జరిగినవి. ప్రస్తుతం శిధిలావాస్థకి చేరుకున్నది. 

చరిత్ర : 

1724 వ సంవత్సరంలో నిర్మించబడినది. ఈ కట్టడాన్ని రెండవ జై సింగ్ జైపూర్ మహారాజు నిర్మించబడినది. ఈ జంతర్ మంతర్ మొత్తం ఐదు. పూర్వం మొఘల్ చక్రవర్తి మొహమ్మద్ షా  పంచాంగం, జ్యోతిష్య శాస్త్ర పట్టికలను సవరి౦చమని కోరగా దాని  కోసం మహారాజుగారు ఈ పనిని చేపట్టారు. జ్యోతిష్య శాస్త్ర పట్టికలు తయారీ, సూర్యుడు, చంద్రుడు, గ్రహాల కదలికలను అంచనా వేయడం వంటి లక్ష్యాల కోసం నిర్మించిన ప్రదేశం ఈ జంతర్ మంతర్. వాటిలో ప్రత్యేకంగా పరిశీలించి గమనిస్తే మొత్తం 13 ఆసక్తికరమైన ఖగోళ సంబంధ సాధనాలు ఉన్నాయి. మొత్తం ఇటువంటి ప్రాంతాలు మొత్తం 5. ఇది ఢిల్లీ లో ఉండగా మిగిలిన నాలుగు పరిశోధనాశాలలు జై పూర్, వారణాశి, ఉజ్జయిని, మథురలలో చూడవచ్చు.


దీనిలో ప్రధానమైనవి సామ్రాట్‌, రామ్‌, జైప్రకాష్‌, మిశ్ర యంత్రాలు ముఖ్యమైనవి.   జైపూర్‌లో ఉన్న జంతర్‌ మంతర్‌  నిర్మాణానికి నాలుగేళ్ళ ముందే ఈ జంతర్‌ మంతర్‌(ఢిల్లీ ) నిర్మాణాన్ని మొదలు పెట్టారు.  కానీ ఇందులో ప్రధానంగా సామ్రాట్ యంత్రం  70 అడుగుల ఎత్తైన నిర్మాణం. వాస్తవానికి సూర్యగడియారానికి సమానం, జయప్రకాశ్ యంత్రం ఒక నక్షత్ర స్థానాన్ని సర్దుబాటు చేసే లక్ష్యంతో నిర్మించారు.


దర్శన సమయం :

ప్రతి రోజు ఉదయం 9:30-5.30 వరకు

చేరుకునే విధానం :

రోడ్డు మార్గం : 

ఈ ప్రాంతనికి కొద్ది దూరంలోనే పార్లమెంటు ఉన్నది. మొదట అక్కడికి చేరుకొని అక్కడి నుంచి నడక దారిలో ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు. 

రైలు మార్గం :

ఈ ప్రాంతానికి పటేల్ చౌక్ అనే మెట్రో రైల్వే స్టేషన్ దగ్గరిలో కలదు. ఈ స్టేషన్ నుంచి జంతర్ మంతర్ కి కేవలం 2 కి. మీ దూరంలోనే ఉన్నది. లేదా న్యూ ఢిల్లీ స్టేషన్ కూడా చేరుకొని అక్కడి నుంచి ఆటో లో లేదా ఇతర ప్రైవేట్ వాహనాలలో చేరుకోవచ్చు.

విమాన మార్గం :

మొదట ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం చేఊకొని అక్కడి నుంచి కార్ లేదా ప్రైవేట్ వాహనాలలో ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు.

చిరునామా :

జంతర్ మంతర్ ,
కన్నాట్ ప్రాంతం ,
సంసాద్ మార్గ్,
కొత్త ఢిల్లీ ,
పిన్ కోడ్ : 110001

Kew Words : Jantar Mantar , New Delhi , Famous Places In Delhi , Hindu Temples Guide

Comments