Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

మధురాష్టకం | Madhurashtakam | Hindu Temples Guide

మధురాష్టకం :

అధరం మధురం వదనం మధురం
నయనం మధురం హసితం మధురమ్ |
హృదయం మధురం గమనం మధురం
మధురాధిపతేరఖిలం మధురమ్ || 1 ||

వచనం మధురం చరితం మధురం
వసనం మధురం వలితం మధురమ్ |
చలితం మధురం భ్రమితం మధురం
మధురాధిపతేరఖిలం మధురమ్ || 2 ||

వేణు-ర్మధురో రేణు-ర్మధురః
పాణి-ర్మధురః పాదౌ మధురౌ |
నృత్యం మధురం సఖ్యం మధురం
మధురాధిపతేరఖిలం మధురమ్ || 3 ||

గీతం మధురం పీతం మధురం
భుక్తం మధురం సుప్తం మధురమ్ |
రూపం మధురం తిలకం మధురం
మధురాధిపతేరఖిలం మధురమ్ || 4 ||

కరణం మధురం తరణం మధురం
హరణం మధురం స్మరణం మధురమ్ |
వమితం మధురం శమితం మధురం
మధురాధిపతేరఖిలం మధురమ్ || 5 ||

గుంజా మధురా మాలా మధురా
యమునా మధురా వీచీ మధురా |
సలిలం మధురం కమలం మధురం
మధురాధిపతేరఖిలం మధురమ్ || 6 ||

గోపీ మధురా లీలా మధురా
యుక్తం మధురం ముక్తం మధురమ్ |
దృష్టం మధురం శిష్టం మధురం
మధురాధిపతేరఖిలం మధురమ్ || 7 ||

గోపా మధురా గావో మధురా
యష్టి ర్మధురా సృష్టి ర్మధురా |
దలితం మధురం ఫలితం మధురం
మధురాధిపతేరఖిలం మధురమ్ || 8 ||

|| ఇతి శ్రీమద్వల్లభాచార్యవిరచితం మధురాష్టకం సంపూర్ణమ్ ||

మరిన్ని స్తోత్రాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Key words : Madhurashtakam , Telugu Stotras , Storas In Telugu Lyrics , Hindu Temples Guide 

Comments

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు