Drop Down Menus

పుత్ర సంతానం కోసం "పుత్ర గణపతి వ్రతం" పూజా విధానం - Putra Ganapati Vratam in Telugu

ఫాల్గుణ శుద్ధ చవితినాడు పుత్రగణపతి వ్రతం. వినాయక చవితి విధానంలోనే చేసే వ్రతం ఇది. గణపతిని పుత్రసంతానం కోసం పూజిస్తూ ఆచరించే వ్రతం ఇది. కేతువు అనుగ్రహానికి వినాయక చవతి, సంకష్టహర చతుర్థి, పుత్రగణపతి వ్రతాలు చేస్తే ఫలింత వుంటుందని సిద్ధాంతాలు చెపుతున్నాయి.

గణపతి శబ్ద బ్రహ్మస్వరూపము . అంటే ఓంకారానికి ప్రతీక. మంత్రాలన్నింటికీ ముందు ఓంకారము ఎలా ఉంటుందో అలా అన్ని శుభకార్యాలకు ప్రా రంభంలో గణేశపూజ విధిగా ఉంటుంది . గణేశుడు ఆది, అంతం లేని ఆనందమూర్తి, సకల సంపత్తులనిచ్చే సిద్ధిదేవత . ఓంకారనాదం ఉద్భవించి, ఆ నాదం క్రమక్రమం గా గజానరూపం గా వెలుగొందింది . గణపతిని ఓంకారస్వరూపునిగా " గణపత్యథర్వశీర్షం " కూడా పేర్కొన్నది. దేవతాగణాలకు ఆదిపురుషుడై, అధిపుడై ఉద్భవించడం వల్లనే ఈయనకు గణనాధుడని, గణేశుడని, గణపతి అని పేర్లు వచ్చాయి . ఆకృతిని బట్టి కొన్ని పేర్లు, ఆధిపత్యాన్ని అనుసరించి కొన్ని పేర్లు గణపతికి కలిగినప్పటికీ ప్రధానము గా ఈ దైవం గణాలకు నాయకుడు.

ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టి, స్వామివారిని షోడశ ఉపచారాలతో పూజించాలి. ఆయనకి ఇష్టమైన పండ్లను.. పిండివంటలను నైవేద్యంగా సమర్పించాలి. సాయంత్రం వేళలో కూడా స్వామిని పూజించి ఆ తరువాత ఉపవాస దీక్షను విరమించాలి. ఈ విధంగా నియమనిష్టలను ఆచరిస్తూ అంకితభావంతో ఈ వ్రతాన్ని ఆచరించడం వలన మనోభీష్టం నెరవేరుతుందని చెప్పబడుతోంది.

పూర్వం మహారాజులు .. చక్రవర్తులు వారసత్వానికి ఎక్కువగా ప్రాముఖ్యతను ఇచ్చిన కారణంగా వాళ్లంతా పుత్ర సంతానాన్ని ఎక్కువగా కోరుకునేవారు. తమ తరువాత తమ రాజ్య భారాన్ని కొడుకే స్వీకరించాలని వాళ్లు భావించేవాళ్లు. ఇక పున్నామ నరకం నుంచి తప్పించే వాడు పుత్రుడే అనే మహర్షుల వాక్యం కారణంగా కూడా వాళ్లు పుత్ర సంతానం కోసం ఆరాటపడే వాళ్లు. ఇందుకోసం వాళ్లు 'ఫాల్గుణ శుద్ధ చవితి' రోజున 'పుత్ర గణపతి' వ్రతాన్ని ఆచరించే వాళ్లు.

అలా ఈ రోజున ఈ వ్రతాన్ని ఆచరించి ఆ పుణ్యఫల విశేషం కారణంగా పరాక్రమవంతులైన పుత్రులను పొందిన రాజులు ఎంతో మంది ఉన్నారు. ఈ రోజున ఎవరైతే తమకి పుత్ర సంతానం కావాలనే సంకల్పంతో వినాయకుడిని పూజిస్తారో వారి కోరిక తప్పనిసరిగా నెరవేరుతుందని సాక్షాత్తు పరమశివుడే పార్వతీదేవితో చెప్పినట్టుగా ఆధ్యాత్మిక గ్రంధాలు ప్రస్తావిస్తున్నాయి.

ఇక రాజులు తమ ప్రాభవాన్ని కోల్పోయినా .. రాచరికాలు గత చరిత్రగా మిగిలిపోయినా 'పుత్రగణపతి వ్రతం' మాత్రం నాటి నుంచి నేటి వరకూ ప్రాచుర్యాన్ని పొందుతూనే ఉంది. ఫాల్గుణ శుద్ధ చవితి రోజున ఉదయాన్నే దంపతులు తలస్నానం చేసి, పరిశుభ్రమైన పట్టువస్త్రాలు ధరించాలి. పూజా మందిరంలో కలశస్థాపన చేసి.. శక్తి గణపతి ప్రతిమను అలంకరించాలి. పుత్రగణపతి వ్రత కథను చదువుకుని దంపతులు అక్షింతలను తలపై ధరించాలి. గణపతికి ఇష్టమైన వంటకాలను నైవేద్యంగా సమర్పించాలి.

ఇంచుమించు వినాయకచవితి వ్రతంలానే ఈ వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది. భక్తి శ్రద్ధలే ప్రధానంగా ఈ వ్రతాన్ని ఆచరించాలి. తమకి పుత్ర సంతానం కావాలని పూజా సమయంలోనే స్వామివారికి దంపతులు అంకితభావంతో చెప్పుకోవాలి. బుద్ధిమంతుడు.. జ్ఞానవంతుడు.. ఆదర్శవంతుడైన పుత్రుడిని ప్రసాదించమని స్వామిని వేడుకోవాలి. ఈ విధంగా స్వామి మనసు గెలుచుకోవడం వలన అనతికాలంలోనే ఫలితం కనిపిస్తుందని చెబుతారు.

ప్రతి చవితి రోజున స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉండాలి. ఆయన అనుగ్రహాన్ని ఆకాంక్షిస్తూ అత్యంత భక్తి శ్రద్ధలను ప్రకటిస్తూ ఉండాలి. మొక్కుబడిగా కాకుండా ఎవరైతే అంకితభావంతో గణపతిని మెప్పిస్తారో ఆ దంపతులకు అనతికాలంలోనే పుత్ర సంతానం కలుగుతుందని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి.

అత్యంత అధ్భుతమైన ఈ స్తోత్రమును ఫాల్గుణ శుద్ధ చవితి రోజున 8 సంఖ్యతో పారాయణ చేసిన విశేషమైన ఫలితం.

శ్రీపుత్ర గణపతి స్తోత్రం..!!

శ్లో జ్ఞానశక్తిముమాం దృష్ట్వాయద్ దృష్టం వ్యోమ్ని శంభునా !

యచ్చోక్తం బ్రహ్మణా పూర్వం శరీరంతు శరీరిణామ్ 

శ్లో|| యచ్చాపి హసితం తేనదేవేన పరమేష్ఠినా | 

ఏతత్కార్య చతుష్కేణపృథివ్యాంచ చతుర్ప్యపి ||

శ్లో ప్రదీప్తాస్యో మహాదీప్తఃకుమారో భాసయన్ దిశః |

పరమేష్ఠి గుణైర్యుక్తః సాక్షాత్రుద్ర ఇవాపరః ||

శ్లో ఉత్పన్నమాత్రో దేవానాంయోషితః సప్రమోహయన్ |

కాన్త్యా దీప్త్యా తథా మూర్త్యారూపేణచ మహాత్మవాన్ ||

శ్లో తద్ దృష్ట్వా పరమం రూపంకుమారస్య మహాత్మనః |

ఉమానిమీషే నేత్రాభ్యాంతమ పశ్యతభామినీ ||

శ్రీశ్రీ పరమేశ్వర ఉవాచ -

శ్లో|| వినాయకో విఘ్నకరో గజాస్యోగణేశ నామా చ భవస్య పుత్రః | 

ఏతేచ సర్వే తవయాన్తు భృత్యావినాయకాః క్రూరదృశః ప్రచండాః | 

ఉచ్చుష్మ దానాది వివృద్ధ దేహఃకార్యేషు సిద్ధం ప్రతిపాదయన్తః ||

శ్లో|| భవాంశ్చ దేవేషు తథా ముఖేషుకార్యేషుచాన్యేషు మహానుభావాత్ |

అగ్రేషు పూజాం లభతేన్యధాచవినాశయిష్య స్యథ కార్యసిద్ధిం ||

శ్లో|| ఇత్యేవ ముక్త్వా పరమేశ్వరేణ సురైఃసమం కాంచన కుంభ సంస్ఠః |

జలై స్తథా సావభిషిక్తగాత్రోరరాజ రాజేంద్ర వినాయకానాం ||

శ్లో దృష్ట్వాబిషిచ్య మానంతుదేవాస్తం గణనాయకం |

తుష్టువుః ప్రయతాః సర్వేత్రిశూలాస్త్రస్య సన్నిధౌ  ||

దేవా ఈచుః - 9

శ్లో|| నమస్తే గజవక్త్రయనమస్తే గణనాయక | 

వినాయక నమస్తేస్తు నమస్తేచండ విక్రమ ||

శ్లో|| నమోస్తుతే విఘ్నకర్తేనమస్తే సర్పమేఖహో | 

నమస్తే రుద్ర వక్రోత్థ ప్రలంబ జఠరాశ్రిత | 

సర్వదేవ నమస్కారాదవిఘ్నం- - కురు సర్వదా || 

శ్రీ పార్వత్యువాచ -

శ్లో|| అపుత్రోపి లభేత్ పుత్రానధనోపి ధనం లభేత్ | 

యం యమిచ్ఛేత్ మనసాతం తం లభతి మానవః ||

శ్లో|| ఏవంస్తుత స్తదాదేవైర్మహాత్మా గణనాయకః | 

అభిషిక్తస్య రుద్రస్యసోమస్యా పత్యతాం గతః ||

శ్లో ఏతస్యాం యస్తిలాన్ భుక్త్వాభక్త్యా గణపతిం నృప | 

ఆరాధయతి తస్యాశు తుష్యతేనాస్తి సంశయః  ||

శ్లో యశ్చైతత్ పఠతే స్తోత్రంయశ్చైతత్ప్రుణుయాత్ సదా |

నతస్య విష్ను జాయన్తనపాపం సర్వథా నృప ||

Tags: పుత్ర గణపతి స్తోత్రం, పుత్ర గణపతి వ్రతం, Putra Ganapathi Stotram in Telugu, Putra Ganapathi Vratam, Ganapathi, vinayaka

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.