Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

శ్రీ సరస్వతి దేవి స్తోత్రం | Saraswati Stotram | Hindu Temples Guide

శ్రీ సరస్వతీ దేవి స్తోత్రం :

యా కుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా
యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా |
యా బ్రహ్మాచ్యుత శంకరప్రభృతిభిర్దేవైస్సదా పూజితా
సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా || 1 ||

దోర్భిర్యుక్తా చతుర్భిః స్ఫటికమణినిభై రక్షమాలాందధానా
హస్తేనైకేన పద్మం సితమపిచ శుకం పుస్తకం చాపరేణ |
భాసా కుందేందుశంఖస్ఫటికమణినిభా భాసమానాౙ్సమానా
సా మే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా || 2 ||

సురాసురైస్సేవితపాదపంకజా కరే విరాజత్కమనీయపుస్తకా |
విరించిపత్నీ కమలాసనస్థితా సరస్వతీ నృత్యతు వాచి మే సదా || 3 ||

సరస్వతీ సరసిజకేసరప్రభా తపస్వినీ సితకమలాసనప్రియా |
ఘనస్తనీ కమలవిలోలలోచనా మనస్వినీ భవతు వరప్రసాదినీ || 4 ||

సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి |
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా || 5 ||

సరస్వతి నమస్తుభ్యం సర్వదేవి నమో నమః |
శాంతరూపే శశిధరే సర్వయోగే నమో నమః || 6 ||

నిత్యానందే నిరాధారే నిష్కళాయై నమో నమః |
విద్యాధరే విశాలాక్షి శుద్ధఙ్ఞానే నమో నమః || 7 ||

శుద్ధస్ఫటికరూపాయై సూక్ష్మరూపే నమో నమః |
శబ్దబ్రహ్మి చతుర్హస్తే సర్వసిద్ధ్యై నమో నమః || 8 ||

ముక్తాలంకృత సర్వాంగ్యై మూలాధారే నమో నమః |
మూలమంత్రస్వరూపాయై మూలశక్త్యై నమో నమః || 9 ||

మనోన్మని మహాభోగే వాగీశ్వరి నమో నమః |
వాగ్మ్యై వరదహస్తాయై వరదాయై నమో నమః || 10 ||

వేదాయై వేదరూపాయై వేదాంతాయై నమో నమః |
గుణదోషవివర్జిన్యై గుణదీప్త్యై నమో నమః || 11 ||

సర్వఙ్ఞానే సదానందే సర్వరూపే నమో నమః |
సంపన్నాయై కుమార్యై చ సర్వఙ్ఞే తే నమో నమః || 12 ||

యోగానార్య ఉమాదేవ్యై యోగానందే నమో నమః |
దివ్యఙ్ఞాన త్రినేత్రాయై దివ్యమూర్త్యై నమో నమః || 13 ||

అర్ధచంద్రజటాధారి చంద్రబింబే నమో నమః |
చంద్రాదిత్యజటాధారి చంద్రబింబే నమో నమః || 14 ||

అణురూపే మహారూపే విశ్వరూపే నమో నమః |
అణిమాద్యష్టసిద్ధాయై ఆనందాయై నమో నమః || 15 ||

ఙ్ఞాన విఙ్ఞాన రూపాయై ఙ్ఞానమూర్తే నమో నమః |
నానాశాస్త్ర స్వరూపాయై నానారూపే నమో నమః || 16 ||

పద్మజా పద్మవంశా చ పద్మరూపే నమో నమః |
పరమేష్ఠ్యై పరామూర్త్యై నమస్తే పాపనాశినీ || 17 ||

మహాదేవ్యై మహాకాళ్యై మహాలక్ష్మ్యై నమో నమః |
బ్రహ్మవిష్ణుశివాయై చ బ్రహ్మనార్యై నమో నమః || 18 ||

కమలాకరపుష్పా చ కామరూపే నమో నమః |
కపాలికర్మదీప్తాయై కర్మదాయై నమో నమః || 19 ||

సాయం ప్రాతః పఠేన్నిత్యం షణ్మాసాత్సిద్ధిరుచ్యతే |
చోరవ్యాఘ్రభయం నాస్తి పఠతాం శృణ్వతామపి || 20 ||

ఇత్థం సరస్వతీ స్తోత్రమగస్త్యముని వాచకమ్ |
సర్వసిద్ధికరం నౄణాం సర్వపాపప్రణాశనమ్ || 21 ||

మరిన్ని స్తోత్రాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Key words : Sri Saraswati Stotram , Telugu Stotras , Storas In Telugu Lyrics, Hindu Temples Guide  

Comments

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు