శ్రీ బాల ముకుందాష్టకం | Sri Bala Mukundaashtakam | Hindu Temples Guide
శ్రీ బాల ముకుందాష్టకం :
కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతమ్ |
వటస్య పత్రస్య పుటే శయానం బాలం ముకుందం మనసా స్మరామి || 1 ||
సంహృత్య లోకాన్వటపత్రమధ్యే శయానమాద్యంతవిహీనరూపమ్ |
సర్వేశ్వరం సర్వహితావతారం బాలం ముకుందం మనసా స్మరామి || 2 ||
ఇందీవరశ్యామలకోమలాంగమ్ ఇంద్రాదిదేవార్చితపాదపద్మమ్ |
సంతానకల్పద్రుమమాశ్రితానాం బాలం ముకుందం మనసా స్మరామి || 3 ||
లంబాలకం లంబితహారయష్టిం శృంగారలీలాంకితదంతపంక్తిమ్ |
బింబాధరం చారువిశాలనేత్రం బాలం ముకుందం మనసా స్మరామి || 4 ||
శిక్యే నిధాయాద్యపయోదధీని బహిర్గతాయాం వ్రజనాయికాయామ్ |
భుక్త్వా యథేష్టం కపటేన సుప్తం బాలం ముకుందం మనసా స్మరామి || 5 ||
కలిందజాంతస్థితకాలియస్య ఫణాగ్రరంగేనటనప్రియంతమ్ |
తత్పుచ్ఛహస్తం శరదిందువక్త్రం బాలం ముకుందం మనసా స్మరామి || 6 ||
ఉలూఖలే బద్ధముదారశౌర్యమ్ ఉత్తుంగయుగ్మార్జున భంగలీలమ్ |
ఉత్ఫుల్లపద్మాయత చారునేత్రం బాలం ముకుందం మనసా స్మరామి || 7 ||
ఆలోక్య మాతుర్ముఖమాదరేణ స్తన్యం పిబంతం సరసీరుహాక్షమ్ |
సచ్చిన్మయం దేవమనంతరూపం బాలం ముకుందం మనసా స్మరామి || 8 ||
మరిన్ని స్తోత్రాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Key words : Sri Bala Mukundaashtakam , Telugu Stotras , Storas In Telugu Lyrics, Hindu Temples Guide
Today Tirumala Darshan Information:
తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు.
Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX
సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు
a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం
b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం
c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు
Comments
Post a Comment