Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

శ్రీ నారాయణ సూక్తం | Sri Narayana Suktam lyrics with audio | Hindu Temples Guide

శ్రీ నారాయణ సూక్తం :

ఓం సహ నా’వవతు | సహ నౌ’ భునక్తు | సహ వీర్యం’ కరవావహై | తేజస్వినావధీ’తమస్తు మా వి’ద్విషావహై” || ఓం శాంతిః శాంతిః శాంతిః’ ||


ఓం || సహస్రశీర్’షం దేవం విశ్వాక్షం’ విశ్వశం’భువమ్ | విశ్వం’ నారాయ’ణం దేవమక్షరం’ పరమం పదమ్ | విశ్వతః పర’మాన్నిత్యం విశ్వం నా’రాయణగ్‍మ్ హ’రిమ్ | విశ్వ’మేవేదం పురు’ష-స్తద్విశ్వ-ముప’జీవతి | పతిం విశ్వ’స్యాత్మేశ్వ’రగ్ం శాశ్వ’తగ్‍మ్ శివ-మచ్యుతమ్ | నారాయణం మ’హాఙ్ఞేయం విశ్వాత్మా’నం పరాయ’ణమ్ | నారాయణప’రో జ్యోతిరాత్మా నా’రాయణః ప’రః | నారాయణపరం’ బ్రహ్మ తత్త్వం నా’రాయణః ప’రః | నారాయణప’రో ధ్యాతా ధ్యానం నా’రాయణః ప’రః | యచ్చ’ కించిజ్జగత్సర్వం దృశ్యతే” శ్రూయతే‌உపి’ వా ||

అంత’ర్బహిశ్చ’ తత్సర్వం వ్యాప్య నా’రాయణః స్థి’తః | అనంతమవ్యయం’ కవిగ్‍మ్ స’ముద్రే‌உంతం’ విశ్వశం’భువమ్ | పద్మకోశ-ప్ర’తీకాశగ్ం హృదయం’ చాప్యధోము’ఖమ్ | అధో’ నిష్ట్యా వి’తస్యాంతే నాభ్యాము’పరి తిష్ఠ’తి | జ్వాలమాలాకు’లం భాతీ విశ్వస్యాయ’తనం మ’హత్ | సంతత’గ్‍మ్ శిలాభి’స్తు లంబత్యాకోశసన్ని’భమ్ | తస్యాంతే’ సుషిరగ్‍మ్ సూక్ష్మం తస్మిన్” సర్వం ప్రతి’ష్ఠితమ్ | తస్య మధ్యే’ మహాన’గ్నిర్-విశ్వార్చి’ర్-విశ్వతో’ముఖః | సో‌உగ్ర’భుగ్విభ’జంతిష్ఠ-న్నాహా’రమజరః కవిః | తిర్యగూర్ధ్వమ’ధశ్శాయీ రశ్మయ’స్తస్య సంత’తా | సంతాపయ’తి స్వం దేహమాపా’దతలమస్త’కః | తస్యమధ్యే వహ్ని’శిఖా అణీయో”ర్ధ్వా వ్యవస్థి’తః | నీలతో’-యద’మధ్యస్థాద్-విధ్యుల్లే’ఖేవ భాస్వ’రా | నీవారశూక’వత్తన్వీ పీతా భా”స్వత్యణూప’మా | తస్యా”ః శిఖాయా మ’ధ్యే పరమా”త్మా వ్యవస్థి’తః | స బ్రహ్మ స శివః స హరిః సేంద్రః సో‌உక్ష’రః పరమః స్వరాట్ ||

ఋతగ్‍మ్ సత్యం ప’రం బ్రహ్మ పురుషం’ కృష్ణపింగ’లమ్ | ఊర్ధ్వరే’తం వి’రూపా’క్షం విశ్వరూ’పాయ వై నమో నమః’ ||

ఓం నారాయణాయ’ విద్మహే’ వాసుదేవాయ’ ధీమహి | తన్నో’ విష్ణుః ప్రచోదయా”త్ ||

ఓం శాంతిః శాంతిః శాంతిః’ ||

మరిన్ని స్తోత్రాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి 


Key words : Sri Narayana Suktam , Telugu Stotras , Storas In Telugu Lyrics, Hindu Temples Guide 

Comments

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు